పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Bharathi Katragadda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bharathi Katragadda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Bharathi Katragadda కవిత

వీరవనిత అసలైన వీరవనితవి నీవేనమ్మా! అందుకే నీకు వేల వేల వందనాలమ్మా! వీధుల్లోని చెత్తాచెదారాన్ని ఊడ్చేస్తూ శుభ్రంగా వుంచే నీవే కదమ్మా అసలైన వీర వనితవి. అర్ధరాత్రి సైతం వీధుల్ని శుభ్రం చేసే నిన్ను చూస్తుంటే నీ ధైర్యాన్ని అభినందించాలో నీ వృత్తిధర్మాన్ని మెచ్చుకోవాలో నాకర్ధం కావడం లేదమ్మా! తోడేళ్ళు,గుంటనక్కలు పొంచి వుండే ఈ అర్ధరాత్రి సమయంలో నిన్ను నీవే రక్షించుకుంటూ సాగిపోయే నీ మనోధైర్యానికి నిజంగా వేల వేల సలాములమ్మా! అయినా నీచుట్టూ వుండే ఈ సమాజానికి నీ కష్టాన్ని గుర్తించే తీరికెక్కడిదమ్మా? ఒకవేళ గుర్తించినా నిన్నేదో అంటరానిదానిలానే చూస్తారే తప్ప నిన్ను నిన్నుగా గుర్తించే హృదయమెక్కడిదమ్మా! మీరే లేకపోతే మీ శ్రమే లేకపోతే ఈ సమాజంతో పాటుగా ఈ పరిసరాలెంత కల్య్షితం అవుతాయో కదా!! ఒక్క క్షణం దుర్ఘంధానికే ముక్కు మూసుకునే వీరికి అదే దుర్ఘంధంలో నీవు అనుక్షణం చెలిమి చేస్తుంటే కరడుకట్టిన వీరి హృద్ఫయాలకి కనీసం చిన్న కదలికైనా లేదే? అణువంత కనికరమైనా లేదే? అర్ధరాత్రీ సైతం మీ ధైర్యం చూస్తుంటే నడిరేయి సైతం మీ వృత్తిధర్మం చూస్తుంటే నిజంగా నీకు వేల వేల సలాములమ్మా!!! (అమీర్పేటలో ఒక వివాహానికి హాజరైన నేను అర్ధరాత్రి అక్కడ రోడ్లు ఊడుస్తున్న స్త్రీలని చూసి మనసు చలించి రాసిన కవిత) 23.JUNE14.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UATfX0

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Bharathi Katragadda కవిత

తెలంగాణ వీరులారా.... తెలంగాణ శూరులారా... తెలంగాణ సైనికులారా... వందనాలు... వేల వేల వందనాలు... అదిగదుగో తెలంగాణ అదే మన తెలంగాణ అదే మన వీర తెలంగాణ... అమరవీరుల ఆత్మబలిదానాలతో అజేయుల వీరగర్జనలతో అరుదెంచిన అపురూపమైన మన వీర తెలంగాణ.. ఈ పుడమితల్లి వెక్కి వెక్కి రోదించె బలిదానాల రక్తపుటేర్లతో తడిసిన తనని తాను చూసుకొని ఈ నేలతల్లి దుఃఖించింది అమాయకుల రోదనలతో నిలువెల్లా తడిసిన తనని తాను చూసుకొని .. అశ్రువులతో నిండిన తన కళ్ళను తుడుచుకొని వేదనతో బరువెక్కిన మనసుని సమాధానపరచుకొని ఆశగా భవితలోకి చూసిన పుడమితల్లి కళ్ళల్లో నేడు కనిపించాయి సంతోషరేఖలు... తనువెల్ల పులకించెను పలకరించిన విజయధరహాసాలు చూసి దశాబ్దాల పోరాటాల ఫలితం నేడు సాధించిన తెలంగాణ రాష్ట్రం జాగ్రత్తగా చూసుకొనే బాధ్యతను,బంగారు భవితను తన బిడ్డల భుజస్కంధాలపై పెట్టి అనుక్షణం వారిని నీడలా వెన్నంటివుంటూ ఆశీర్వదిస్తోది మన తెలంగాణతల్లి.... 08.06.14

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1msRAt2

Posted by Katta

31, మే 2014, శనివారం

Bharathi Katragadda కవిత

నా మనసు పుష్పాన్ని నీకు సమర్పించాను ప్రభూ! ఆ పరిమళాన్ని గ్రహించి నీవు నిష్క్రమించావు! ఇప్పుడిక్కడ ఏ పరిమళమూ లేని మోడు మిగిలింది నీకోసం శూన్యంలోకి చూస్తూ! 31May14

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oaR6u9

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Bharathi Katragadda కవిత

అక్షరశిల్పం పాతకాగితమే కదా అని నన్ను పారేయకండలా! అపురూపంగా చూడండొక్కసారి! గుండెగదుల్లో దాక్కున్న ఙ్ఞాపక పరిమళాలేవో మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తాయి! అద్భుతమైన అక్షర నిధులేవో మిమ్మల్ని అక్కున చేర్చుకుంటాయి! ఏనాడో మర్చిపోయిన బాల్యం నిన్ను పలకరించొచ్చు. మరేనాడో పారేసుకున్న యవ్వనపు తీపి గుర్తులు పలకరించొచ్చు! మనసులో గుప్తంగా దాచుకున్న ప్రియురాలి మధురిమలు పలకరించొచ్చు. మనసుని హత్తుకున్న ఇల్లాలి మురిపాలు పలకరించొచ్చు! తండ్రి ప్రేమగా దండించిన అపూర్వ క్షణాలు పలకరించొచ్చు ! అమ్మ ఆర్తిగా అదుముకున్న మధుర క్షణాలు పలకరించొచ్చు! బడి డుమ్మా కొడితే దండించిన గురువు పలకరించొచ్చు! తాతయ్య నానమ్మల చందమామ కథలు పలకరించొచ్చు! అందుకే ఈ అక్షర శిల్పాలను ఒక్కసారి మనసారా సృశించండి! పోగొట్టుకున్న అపూర్వ పెన్నిధేదో దొరకవచ్చు ఆర్తిగా మిమ్మల్ని పెనవేసుకుపోవచ్చు!! భారతీరాయన్న 18.5.14.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t61zdf

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Bharathi Katragadda కవిత

కాగితంపూలు అనుబంధాలన్నీ నేడు కాగితం పూలైపోతున్నాయి! ప్రకృతిసిధ్ధమైన పూలపరిమళాలు సైతం నేడు కలుషితమైపోతున్నాయి! స్వార్ధపు గాలులతో చల్లని స్నేహపరిమళం సైతం నేడు తన సహజత్వాన్ని పోగొట్టుకొని వెలవెలబోతుంది! మానవసంబంధాలన్నీ గిరిగీసుకొని పలకరిస్తే పాపమన్నట్లుగా మూగబోతున్నాయి. ఆప్యాయతానురాగాలతో కూడిన కమ్మని పిలుపులు సైతం ఆంటీ,అంకుల్, బ్రో అనే తడిపొడి మాటల్లో పడి అర్ధాలే మారిపోతున్నాయి! పాశ్చాత్యపోకడలతో హలో అంటూ జారుకుంటున్నాయి! చందమామ కథలతో బొమ్మరిల్లు బొమ్మలతో బుజ్జాయి మాటలతో జోకొట్టే నానమ్మలు,తాతయ్యలు నానీలు,గ్రానీలు అయిపోయి పాపం వృధ్ధాశ్రమాల్లో సేదదీరుతున్నారు గాయపడిన హృదయాలతో! కోల్పోయిన అనుభూతులతో!! కంప్యూటర్ యుగం అతివేగంగా మానవసంబంధాల్లోకి యాంత్రికంగా అడుగుడి సెల్లుల పర్వంతో,వాట్సపుల జోరుతో చాటింగుల సహవాసంతో కాస్తో కూస్తో ఉన్న అనుబంధాలకి తాళం వేస్తుంది! ఇక చేతి వేళ్ల కదలికలే మాటలవుతున్నాయి! టి.వ్. కంప్యూటర్లే మనుషులవుతున్నాయి!! అన్నీ చూస్తూనే వున్నాము. అందరమూ చూస్తూనే వున్నాము!! అయినా మార్పులేని వ్యవస్థ మనది కదూ! అయినా సరే మార్పుకై ఒక అడుగు వేద్దాము! రేపు మరో పదడుగులు తోడు కావొచ్చు! ఆ అడుగులతోనే కాగితంపూలని సువాసనలు వెదజల్లే సుమాలుగా మారుద్దాం!! భారతీరాయన్న 09.0514.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g2RMCI

Posted by Katta

7, మే 2014, బుధవారం

Bharathi Katragadda కవిత

సీ. మందార మకరంద మాధుర్య రుచులతో అలరారు కమ్మని అమ్మభాష నిండైన గమనంబు నిండైన తేజంబు కలుపుతూ తరలింది కడలి వోలె చల్లని గాలిలా చక్కని కవితలా మనసుని తడిమింది మంచువోలె కమనీయ రమణీయ గారాల నడకతో కనువిందు చేసింది ఘనముగాను. తే. పద్యపు సొగసుతో కూడి వన్నె తెచ్చె గద్యపు నడకతో కూడి ఘనము కూర్చె జాన పదములతో కూడి జలధియయ్యె అట్టి మన భాష పలుకంగ అవధులేల?

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s1PH9O

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

Bharathi Katragadda కవిత

గుభాళించే ఉత్తరాల పర్వం ముగిసింది! నేను క్షేమం నీవు క్షేమంటూ పలకరించే ఆప్యాతానురాగాల ఉత్తరాల పర్వం ముగిసింది! ఈమెయిల్ వచ్చి ఉత్తరాల అనుబంధానికి రెక్కలొచ్చేలా చేసింది! పరిమళించే ప్రేమానురాగాలకి స్వస్తి పలికింది! పొడి పొడి మాటల్తో ఈమెయిల్ ఆధునిక ప్రభంజనాన్ని సృష్టిస్తుంది! విరగ్గొట్టిన మాటల్తో విపరీతార్ధాలతో ఈ ఈమెయిల్ ఇప్పుడు మనమధ్య స్థిరమై కూర్చుంది ! ముందుతరాలవారికి ఉత్తరం అనే మాధుర్యాన్ని వివరిద్దామన్నా మచ్చుకైనా దొరకని ఉత్తరం యోగక్షేమల్లో పాపం కొట్టుకుపోయింది! మనుషుల దగ్గరితనన్ని పెంచే ఉత్తరం దూరాన్ని పెంచే ఈమెయిల్ లో కొట్టుకుపోయింది! పొరపాటున మనమిప్పుడు ఉత్తరం రాసినా ఈ ఆధునిక యుగంలో తీరిగ్గ చదివే ఓపిక కూడా కరువైంది! సెల్లులపర్వంలో ఉత్తరం మూగబోయి ఒకప్పటి చిరునామాలా యోగక్షేమాలు లేనిదైంది. మమ్మల్ని క్షమించమ్మా ఉత్తరమా!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzvzfi

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Bharathi Katragadda కవిత

సీ. ఇంతుల చరితలు ఇలలోన మెరువంగ కన్నీటి రాసుల కథలు ఏల? మహిళలే రాణులై మహిని పాలింపగ కన్నీటి రాసుల కథలు ఏల? సిరులనే కురిపిస్తు శ్రీలక్ష్మి నడవంగ కన్నీటి రాసుల కథలు ఏల? చదువుల శక్తిచే శారద నడవంగ కన్నీటి రాసుల కథలు ఏల? తే. తరుణి కథలన్ని బాధలె తరచి చూడ అతివ రెక్కలకష్టమె అవని వెలుగు పురుష లోకాన కామపు ముసుగు లోన తరతరాలుగా తరుణియె తల్లడిల్లె!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k3N6KA

Posted by Katta

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Bharathi Katragadda కవిత

కవితావేశం 16.02.14 నేను ఒక కవిని సాధారణ కవిని అల్లిబిల్లి కవితలేవో అందంగా అల్లాలని అందమైన పదాల కోసం ఆరాటంగా,ఆవేశంగా వెతికాను. అందమైన పదాలు దొరికాయి భాషలో అందముంది భావంలోనూ అందముంది. కానీ నాకవి హృదయంలోనే ఏదో చెప్పలేని వెలితి! చెట్టూ,పువ్వూ జాబిలి,వెన్నెల సన్నజాజులు,పరిమళాలు వెన్నెలరాత్రులు,మధురానుభూతులు ఉషోదయం,నవోదయం చెలికోరిక,ప్రేమకానుక వానచినుకు,తొలకరి మెరుపు ఇలా ఎన్నో అందమైన పదాలతో కవితలల్లాను కాని మనసులో ఏదో చెప్పలేని వెలితి ! దరిద్రం,దౌర్భాగ్యం ఆకలికేకలు,మండేవేదనలు అనారోగ్యం,వికృతరూపం కుంటిబతుకు,గుడ్డిబతుకు చీకటిరాత్రులు,మౌనరోదనలు కష్టాల కొలిమి, కన్నీళ్ల కలిమి మరి ఈపదాలన్నీ కూర్చి ఏ కవితలల్లను? అందుకే నాకవి హృదయంలో చెప్పలేని వెలితి! ఇక కవిగా నాకర్తవ్యమేమిటో బోధపడినాక నిశ్చింతగా అనిపించింది!!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gIcMeG

Posted by Katta

13, ఫిబ్రవరి 2014, గురువారం

Bharathi Katragadda కవిత

చలనచిత్రం 13.02.14 నిన్నటిదాకా నా గుండె గదిలో కిలకిల నవ్వులు వినిపించేవి ! మధురమైన మాటల మూటలు దొర్లేవి! వెన్నెల కిరణాలు ప్రసరించేవి! సుమధురమైన సంగీతం వినిపించేది! కవితలెన్నో పద్యాలతో గారడీలు చేస్తూ పడీ పడీ నవ్వేవి! సాహిత్యపు పరిమళాలు విరజిమ్మేవి! కాని నేడంతా నిశ్శబ్దమే! అంతా అమావాస్య చీకటే! ఈ చీకట్లో జన్మ జన్మల శాపగ్రస్తలా నేను! ఆ శబ్దంలో నీవున్నావు! ఈ నిశ్శబ్దంలో నేను ఉండిలేను ఏమీలేని నాలో నీ ఙ్ఙాపకాలు వున్నాయి!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwsCHM

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Bharathi Katragadda కవిత

గతమైన కాలం అయ్యో! అదేమిటీ? నిన్ననేగా నేను కాలమనే ఈ విశాల పుస్తకంలో ఒక పేజీ తిప్పాను! అప్పుడే సంవత్సర సారాంశమున్న పేజీ అయిపోయిందా? అంత తొందరగా ఈ సారాంశం గతమైపోయిందా? ఈ కాలానికి అంత వేగమా! గతమైన ఈ సారాంశం వర్తమానంలో ఎన్నో నేర్చుకోమంటుంది. భవిష్యత్తులోకి బంగారు బాటలను అతిభద్రంగా పరచుకోమంటుంది! బాట పరచుకొని నడిచేలోగా పేజీ మళ్ళీ గతమైపోతుంది! ఈ కాలానికి ఇంత వేగమా?? 12.02.14

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gu7AK3

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Bharathi Katragadda కవిత

అన్వేషణ 08.02.14 నేను అన్వేషిస్తున్నాను అసలైన మానవత్వం కోసం! పరితపిస్తూ అన్వేషిస్తున్నాను మాయామర్మపు పొరలులేని సున్నితమైన మనసు కొరకు! ఎంత అన్వేషించినా మోసం,దగా కుట్రలతో కూడిన భయంకర ప్రపంచమే నన్ను వెక్కిరిస్తుంది! బాంబులు,హత్యలూ చిద్రమైన శరీరాలూ వరదలైన రక్తకన్నీరూ నన్ను జలదరింపజేసింది! మనుగడ కోల్పోయిన మతాలు ఈ పుణ్యభూమిని మరుభూమిగా మారుస్తుంటే నివ్వెరపోయాను! ఈ మానవలోకంలో మానవత్వానికే ఉనికీ లేదు,రూపమూ లేదు రక్తదాహం తప్ప అయినా అన్వేషిస్తూనే ఉన్నాను. ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు ఏ అల్లానో,జీససో ఏ రాముడో,బుధ్ధుడో కనిపించకపోతారా అని అన్వేషిస్తున్నాను! ఎవరు కనిపించినా మాకు మానవత్వాన్ని ప్రసాదించమని వేడుకుంటారు కదూ!

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cdNd0t

Posted by Katta