పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। మట్టిగాజులు ।। ---------------------- గుప్పెళ్ళు అప్పుడప్పుడే విప్పుకుంటున్నప్పుడు ఆటలు నేర్పించటం మొదలుపెట్టాయి అమ్మ చేతికున్న ఆ మట్టిగాజులు. కాళ్ళతో తన్నుతున్నప్పుడు విరిగిన గాజుముక్క గాయం చేసిందేమోనని అమ్మ ఆత్రం పడుతుంటే చిలిపిగానే గిచ్చాయి. అవి వెలిసిపోయి వున్నట్టు గుర్తు కానీ నా పెదవులకు ఒక్కోసారి పాలిండ్లై కమ్మని రుచిని పంచేవి. మగత నిద్రలోకి జారుతున్నప్పుడు మత్తురాగం పాడుతూ జోలపుచ్చేవి చిరు సవ్వడులతో మేనిని తాకుతూ ... అవి నా చేతికి చిక్కినప్పుడల్లా బొంగరంలా తిరుగుతూ రంగురంగుల వర్ణాలు పూయించేవి నా కళ్ళల్లో .. నాతోపాటే స్నానమాడేవి ,నాతోడే ముస్తాబయ్యేవి , నా నీడే కోరేవి తోడబుట్టిన తొబుట్టువుల్లా ... కానీ వాటికీ వయసు మీదబడిందేమో ఒక్కొక్కటిగా విరిగిపోయి మట్టిలో కలసిపోయాయి ఓ రోజున నా మనసుని మట్టిముద్ద చేసి ! (08-02-2014)

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eBfhkg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి