పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Raj Kumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Raj Kumar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //గాలి చూపులు// మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో నేను ఎండా కాలపు తీవ్రతను వర్ణిస్తూ రాసిన కవిత ప్రచురితమైంది. చుట్టూ పిల్ల సూర్యుళ్లు తలపైని చిల్లుల రేకులకప్పు ప్రసరించే కిరణబింబాలు కిటికీలోంచి దూసుకొచ్చే వడగాలులు ఒంటిమీద వేడివేడి కుబుసాలు వదులుతూ చరచరా పాకిపోతాయి నాలుగ్గోడలూ.. ఆ పైన రేకుల్లోంచి పొడుచుకొచ్చే అదృశ్య అగ్నిహస్తాలు ఎంతని మేగినా పొక్కిలౌతున్న నేలన నల్లినిజేసి నలిపేస్తాయి చెమటా.. దగడుదగడు పొగలూ కక్కుతూ శరీరమంతా ఒక ఆవిరియంత్రమౌతుంది విసుగు విసుగు విసుగు మనోవాక్కాయ కర్మలన్నిట్లో వెయ్యి రేకులుగ విప్పారిన విసుగు బయటికి చూస్తే వెండి తాపడం చేసినట్లు కండ్లు బైర్లుకమ్మే ఎండ నెత్తులు విరబోసుకున్న అగ్నిస్తంభాలు పక్కన నిప్పుటేరులో అడపాదడపా కొట్టుకుపోతున్న జీవాలు అంతటా ఒకటే తపన ఒక చల్లని మబ్బుతునక రెప్పలపై వాలాలని సమస్తంగా విస్తరించిన తీవ్రమైన ఆశ గదిలో ఎదురుగా టేబుల్ పై కుదురుగా కూచున్న మూడు రెక్కల ముద్దుపక్షి ఎప్పుడో తెగిన ప్రాణ ప్రవాహం తరలి వచ్చిన పరవశంతో తల అటూఇటూ తిప్పుతూ గాలిచూపులు చూస్తుంది చెమర్చిన చర్మానికి చల్లని మంత్రగంధం అలదినట్లు విసుగు మటుమాయమౌతుంది 18/6/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lQB75E

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ II ఒక ఎండకాలం సాయంత్రం II కొమ్మా కదలదు ఆకూ కదలదు గాలి ముక్కు మూసుకు తపస్సు చేస్తున్నది. *** ఎన్ని నీళ్ళు గుమ్మరిచ్చినా నివురు గప్పిన నిప్పోలెనే గచ్చు. *** ఆకాశంలా కర్ఫ్యూ పెట్టినట్లనే ఏడనో ఒక పిట్ట *** ఏ చానల్ తిప్పినా ఎన్నికల ముచ్చటన్నట్టు ఎవల్లను పలకరిచ్చినా ఎండ సంగతే. 18/05/14/ సాయంత్రం

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lACiTL

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ ll కాగితప్పడవలు ll గులాబీ పూరిక్కలు సుతిమెత్తగా పరిచిన కాగితప్పడవలు వాటిలో చిన్నారి మురిపాన్ని ముద్దుగా మూటగట్టి పంపుతున్నట్లు జోరుగా వానకురిసిన రోజుల్లో వీధుల్లో నీటి కాలువల వెంట పోటీపడి ప్రవహించిన బాల్యచాపల్యం మళ్ళీ పురివిప్పుకున్నట్లు ఇప్పుడూ అంతే ఉత్సాహంతో ఊహా కౌశలంతో భావాల్ని పరిచిన వాక్యవిన్యాసపు కవితలనూ "కవిసంగమ" ప్రవాహంలో వదులుతూ.. కాకపోతే ఇప్పుడు కవితలు ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతుంటే పిసరంత దిగులు * * * కాస్తా కామెంట్లతో లంగరు వేయరూ ప్లీజ్! 13/5/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyd7Io

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //అమ్మ నా పాస్‍వర్డ్ // "మీరు అర్థంకారు" "అసలు మీరేంటో మీకర్థమౌతుందా?" "ఓ అర్థముండి ఏడిస్తేగా.." "వాడు వొట్టిమొండి""మూర్ఖుడు" "అమాయకుడు" "...."...." * నన్నెవ్వరూ అర్థం చేసుకోనప్పుడు.. అర్థం చేసుకోను కనీసమూ ప్రయత్నించనపుడు వాళ్లకు తోచిన ఆ ఘడియలో అనిపించిన ఎత్తిపొడుస్తున్నామనో.... ఆకాశానికి ఎత్తేస్తున్నామనో ఏదో ఓ అర్థాన్ని అంటగట్టినపుడు ఒక్కొక్కసారి నాకు నేనే అర్థంకానపుడు నేనేమిటో నాకే చూపే అద్దంలా నా మనసుకు అర్థం చెబుతూ ఆ అర్థాన్నే అందరికీ చూపుతూ అమ్మ.... నా నిఘంటువు. నేను బాధపడ్డా.. ఏడ్చినా.. కోపించినా తమాయించుకోలేక ఒంటి కాలిపై లేచినా అరిచి గీపెట్టినా.. తాను తలకొట్టుకుంటూనైనా నన్ను మారమంటూనే లోకానికి నా సాత్విక రూపాన్ని పరిచయం చేయజూస్తూ అమ్మ.... నా ఫోటోఫ్రేము ఒక్కమాటలో.. నన్ను నేనుగా నా బతుక్కే లాగిన్ కావడానికి పాస్‍వర్డ్ అమ్మ 11/5/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU4Nz

Posted by Katta

10, మే 2014, శనివారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ //ఉన్నానింకా// అస్థికలు పైన వేసుకు తిరుగుతున్నా చావని అస్తిత్వపు మూలుగలోంచి తన్నుకొస్తున్న మూలుగు నేనున్నానింకా.. దుగ్ధ భ్రమ పేరూ పెద్దిర్కం నానానూననూనెల్లో గోలుతున్న అభిరుచుల వితానవాసనల ఘుమఘుమలకు మూసుకుపోయిన కళ్లు మండించే కుముటు పాడు పాడు.. మాడు మాడు ఈ మాడు వాసన చివరాఖరు జ్వలనంలోనూ నేనున్నానంటూ ఫట్మని ఉనికి చాటుకునే ఉన్మత్త ప్రేలాపన చంకలు కొట్టుకుంటూ వేవేల కాపీల కుప్పల స్వీయ సంకలనాల నిచ్చెనెక్కుతూ రొప్పుతూ... రోలుతూ.. బతుకంతా పిడకలు చరిచిన గోడకే తానూ అవార్డు ఫలకమై వేలాడుతూ.. వేరీ బ్యాడ్.. బేడే.. బేడా అణా కాలణా కాలం నాటి తనువుల అణువణువుల అనుభవసారాదీపాల ధూపాల మసి కస్తురితిలకంగా దిద్దుకు సాగిపోరా..! పోరా..! పోర.. పోరితే పోయేదేం లేదురా..! పోయేదేం లేకుంటే పోరాటమేలరా..! కవిత్వమో కళ.. కళా చతురిమ.. తురుముకోరా నీ తలన పేరు పెద్దనల తోవన ఆతోవ ఈతోవ ఏతోవ కాదని తోవల నడుమ తిప్పకు మడిమ వుత్తి గోల కాదు కవిత్వం అని కేవలం కళాకాదు అది నీ అనుభూతి ఆవిష్కారం మనల్ని కదిలించే పరిష్కారం ఎంత శల్యమైపోనీ లోన గలగల లాడే విత్తుల ఎండుకాయ ఈ కవిత్వపు బొంది. 10/5/2014

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oBAY5h

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Raj Kumar కవిత

మడిపల్లి రాజ్‍కుమార్ **మిత్రమా..! ఏమంటావూ..?** తనువును సాకే వృత్తిలానే బహుశా మనసూ ప్రవృత్తి పోషణలో.. ఒకవేళ ప్రవృత్తీ వృత్తిగా మారితే మనసూ నెమ్మది నెమ్మదిగా కేవలం దేహమైఘనీభవిస్తూ .. అట్లాకాక ఉల్టాగా వృత్తి ప్రవృత్తి ఐపోతే రాను రాను తనువంతా హృదయమై విప్పారుతుందంటావా...? 6/2/14

by Raj Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZpzuw

Posted by Katta