గుబ్బల శ్రీనివాస్ ।। బానిసను కాను ।। ----------------------- ఏందిరా నీ జులుం ?ఏందిరా నీ అహం ? గాడూ గీడూ అనటానికి కాదురా నేను నీ నౌకర్ని అరేయ్ గిరేయ్ అని పిలవటానికి కాదురా నేను నీ బానిసను. బీరువాల్లో లెక్కలేనన్ని మురిగే పచ్చనోట్లు నీవి సాటి మనిషికి రూపాయి దానం చేసే దానగుణం నాది. గోదాముల్లో ,గొని సంచుల్లో పురుగులు పట్టి ముక్కుతున్న ధాన్యరాశులు నీవి పక్కవాడికి పట్టెడన్నం పెట్టే దయాగుణం నాది. నెర్లు తీసి ,నోళ్ళు తెరిచి బీడులైన వందలాది ఎకరాల భూములు నీవి వెన్ను విల్లుగ మార్చి వొళ్ళు వొంచిన కాయకష్టం మెతుకులు నావి. చెదలు పట్టి చిరిగిపోయే పచ్చనోట్లు నీవి చెమట వాసన వస్తున్నా నా శ్రమ ఇచ్చిన పది నోటు నాకు పదివేలు. నువ్వు రాజువైతే కావొచ్చు నేను బానిసను కాను ! (06-02-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eX510D
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eX510D
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి