పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ajay Kumar Kodam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ajay Kumar Kodam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జూన్ 2014, ఆదివారం

Ajay Kumar Kodam కవిత

లవ్‌ యూ..!!అజేయ్‌ నాకింకా గుర్తే.. అప్పుడే కళ్లే తెరుస్తున్న నన్ను చూసిన నీ కళ్లలో.. ప్రపంచాద్భుతాన్ని చూసిన అబ్బురం.. నీ రెండు చేతుల తొలి ఊయల గుండె చప్పుడు జోలపాట కందిపోతానేమోనన్నంత భయంగా తాకిన పెదవుల వణుకు.. చిరుముద్దులోనే నేనున్నాననే కొండంత భరోసా.. ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన జ్ఞాపకం.. పాదాలపై అడుగులేయిస్తూ నేర్పిన నడక.. ప్రతీ అడుగులో మార్గదర్శనం.. ... .. .. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే .. ఇంకా నా వెంట నడుస్తున్న.. నువ్వే ఐ ఆల్వేస్‌ హ్యావ్‌ యూ విత్‌ మీ.. థ్యాంక్యూ వెరీ మచ్‌!!

by Ajay Kumar Kodam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hVxkUO

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Ajay Kumar Kodam కవిత

మృత్యువు..//@ajay నాతోపాటే ..ఓ ఆత్మీయ మిత్రుడు పుట్టాడు.. క్షణకాలమే మా స్నేహబంధం.. పలుకరింపైనా లేకుండానే అదృశ్యమయ్యాడు.. ఏంటో చాలా మంచివాడు.. ఎటెల్లిపోయాడో.. ? ఎందుకు విడిచి వెళ్లాడో..? ఐనా..నిత్యం వెన్నంటి ఉన్నాడన్న భావనే.. గుండెచప్పుడు మందగించినప్పుడల్లా.. అయ్యో నేస్తం అన్న తన ఆవేదన విన్నట్టుగానే ఉంది.. తన అడుగుల చప్పుడు మనసుకు తెలుస్తూనే ఉంది.. తనకి కూడా సేమ్ ఫీలింగ్ అనుకుంటా.. అనునిత్యం నన్ను కలుసుకునేందుకు తపనే .. ఆపద ఎదురైన ప్రతీక్షణం.. అక్కున చేర్చుకొనేందుకు ఆరాటమే.. ఐనా.. ఎందుకో తెగ మొహమాటం వాడికి.. ఇప్పటికైతే ఎదురుపడలేదు.. కానీ..ఏనాటికైనా కలువకపోడుగా.. గట్టిగా నిలదీసేస్తా.. ఏంట్రా .. ఇన్నాళ్లకు తీరిందా అని... బదులేమిస్తాడో చూస్తా... అప్పుడు మీమీద్దరమేగా.. ఇన్నాళ్ల ఊసులన్నీ తీరిగ్గా ముచ్చటించుకుంటాం

by Ajay Kumar Kodam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ogKzi2

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Ajay Kumar Kodam కవిత

దిల్‌ కుష్‌.. ( 8.09 pm 20-2-14 ఈ క్షణాన నేను...) // అజేయ్‌ ఏంటో మనసంతా శూన్యంగా మారిపోయింది.. ఏదో తెలియని ఫీలింగ్‌.. ఆనందమే.. కానీ ఇంకా ఏదో వర్ణించలేనంత గొప్పగా... అనంత విశ్వపు దిగంతాల్లో .. ఒక ప్రశాంతత నిండిన ప్రదేశంలో.. ఒక్కడినే నిలబడి.. నన్ను నేనే చూసుకుంటూ.. నాతో నేనే మాట్లాడుకుంటూ.. ఏకంతంతరాల్లో .. నిశబ్దపు శృతిలయలను ఆస్వాదిస్తూ.. తెగ సంబరపడుతూ ఎగసెగసి పడుతున్న గుండెచప్పుడును.. అక్షరాలుగా చిత్రీకరించేందుకు ఉరకలెత్తుతూ.. ఇదీ అదీ అని చెప్పలేనంత.. ఉద్విగ్నానందం.. ఇప్పటికింతే.. // అజేయ్‌

by Ajay Kumar Kodam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mvVrvd

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Ajay Kumar Kodam కవిత

ఎవడున్నాడీ లోకంలో../ అజేయ్‌ కుమార్‌. తెలీకడుగుతున్నా.. ఎవడున్నాడీ లోకంలో.. ప్రాంతీయ పక్షపాతి కానివాడు. నువ్వెవరంటే.. విశ్వమానవుడినని చెప్పగలిగే ధీరుడు. కులమో, మతమో.. ఇజమో.. గిజమో... ఒక చట్రంలో చిక్కని వాడెవ్వడు.. ముస్లింలకు అల్లా.. క్రైస్తవులకు జీసస్‌.. హిందువులకు.. రాముడో, కృష్ణుడో ముక్కోటిదేవతలో.. పరమాత్ములనే “మత”పరిమితం చేసేశాంగా.. పరిధులు గీసి.. పంచుకున్నాంగా.. ఇప్పటికైనా.. మతం మాకొద్దని అనగలమా..? ‘మన’వాళ్లన్న మాట మానముగా?.. ఇంకెందుకు.. ఈ సెక్యూలర్‌ తొడుగులు మేధావుల ముసుగులు విశాల హృదయపు ఫోజులు..

by Ajay Kumar Kodam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NhCDQV

Posted by Katta