పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Yagnapal Raju Upendram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yagnapal Raju Upendram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

Yagnapal Raju Upendram కవిత

**పనికొచ్చేది** హోమగుండంలో పూర్ణాహుతైన గుమ్మడికాయలాంటి మెత్తటి రాత్రి ఒకరివెంట ఒకరు ఊరికే పరుగెత్తే పిచ్చికుంకల్లాంటి గడియారపు ముళ్ళు ఆ కాసేపటికీ హస్తభూషణమయ్యే పెద్ద కప్పులోని టీ అంటే నాకన్నా వాటికే ఇష్టం కప్పును పట్టుకునే చేతి వేళ్ళనూ తాకీ తాకనట్టు తాకే పెదాలనూ చప్పరించే నాలుకనూ చూస్తూ కప్పులోని టీ అయిపోయేంతవరకూ రాత్రి గడియారం అలానే నిల్చుండిపోతాయి అలా రాత్రిని కాలాన్ని నిలబెట్టే టీ కోసం స్టవ్ రోజూ ఎదురుచూస్తుంది ఒక్కో తేనీటి చుక్క గొంతుదిగే ఒకానొక జ్ఞాపకం నిజంగా జీవితంలోకి వెళ్లాలనుకున్నపుడు పనికొస్తుంది http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

3, మార్చి 2014, సోమవారం

Yagnapal Raju Upendram కవిత

(ఒక్కొక్కరూ ఒక్కొక్క తీరంలా కనిపించే నా మిత్రులందరికీ అంకితం ఈ కవిత) **The Shores** Innumerable shores meet At a cape where all the oceans rest Where all the conchs Exchange their honks Where all the sea shells Share their sheen And the sands Whisper off their romance And let the sun shine To lit up the evenings And the moon seeps in to the water To burn it quiet and cool At last the shores depart Leaving behind the trails of scorching love Filled in the scratches of nails

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Yagnapal Raju Upendram కవిత

**పిచ్ బ్లాక్** అన్నీ రంగులూ కలిస్తే తెలుపు కదా ఏ రంగు లేకపోవడమే నల్లదనమా ఏమో నల్లదనానికి కూడా కొలతలుంటాయి కలర్ టెక్నాలజీ మహిమ మరి కమ్ముకునే నల్లదనాన్ని ఎలా కొలవాలో పిచ్ బ్లాక్? కమ్ముకొచ్చే ప్రశ్నా? సమాధానమా? ఏదైనా స్పెక్ట్రోస్కోప్ కొలుస్తూ కనబడితే అడగాలీసారి నా పిచ్చిగానీ గట్టిగా మూసుకున్న రెప్పల వెనుక నేనెప్పుడూ గమనించే చీకటినే అడగవచ్చుగా వెంటనే ఆ పని చెయ్యాలి చీకటిలో ఏవో ఆకారాలు రూపాలు మారుతూ కదలాడుతున్నాయి విరగ పూచిన శాంతి నల్లటి రెక్కలై రాలిపోతోంది నా భుజాలను ఒరుసుకుంటూ కొన్ని ముక్కలు నా ఒళ్ళో పడుతున్నాయి ఓం శాంతిః శాంతిః శాంతిః అంతలో కొన్ని మాటలు అమ్మా పువ్వులన్నీ నల్లగా మారి రాలిపోతున్నాయి ఏం కాదులే తల్లీ మళ్ళీ పూస్తాయి రంగుల్లో పూస్తాయా అమ్మా అవును చిట్టి తల్లీ రంగుల్లోనే పూస్తాయి 26.02.2014 http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Yagnapal Raju Upendram కవిత

**పేరున్నా లేనిది** ఎప్పుడో కదలాడిన ఒక తెమ్మెర మళ్ళీ ఒకసారి చేరుకోలేని తెరై తెగులుతుంది ఏమడగను ఏం మాట్లాడను చూస్తూనే ఉండాలనిపిస్తూనే ఇక చూడకూడదనిపించే స్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా ఒకసారి నింపేసుకున్న హృదయం ఎంత తోడినా ఖాళీ అవదని తెలిసినా ఏతాం వెయ్యడానికే సరిపోదనిపించే బ్రతుకును ఎప్పుడైనా బ్రతికావా ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియనిది పోయినదేదీ దొరకదెందుకని తొందరగా 17.02.2014 http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Yagnapal Raju Upendram కవిత

**శృంగారాలు – 7** ఈ భూమిమీద పూసేముందే కట్టగట్టుకుని మాట్లాడుకుంటాయేమో కనకాంబరాలు వాడిపోయినా వన్నె తగ్గకూడదని మనంకూడా మాట్లాడుకుందాం పెదాలతో చేతులతో కాళ్లతో శరీరాలతో ఇవన్నీ కుదరకపోతే కనీసం కళ్ళతో అలవిగాని కోరికతో ప్రేమతో ద్వేషంతో అసూయతో ఇంకేదైనా భావంతో ఏదీ చొరబడని దగ్గరితనంతో కనీసం మౌనంగానైనా మాట్లాడుకుందాం పిల్లా మనం కనకాంబరాలం వయసు వాడినా మనసు వన్నె తగ్గదులే 12.02.2014 http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Yagnapal Raju Upendram కవిత

**ఊరు** కాస్త పచ్చదనం కనిపించినా పారే నది కనిపించినా గుబురు పొదలపై గుత్తులుగా పూసిన పూలు కనిపించినా కాస్త వెన్నెల ఎప్పుడైనా తడిమినా కొంచెం చల్లని గాలి ఎప్పుడైనా గుసగుసలాడినా మెత్తటి తడి మట్టి ఎప్పుడైనా పాదాలను ముద్దు పెట్టుకున్నా గుడి గంటలు లీలగా వినిపించినా ఆకాశం నిండా చుక్కలు చూసి చాలాకాలమైందనిపించినా గుంపులు గుంపులుగా ఎగురుతున్న పిట్టలు కనిపించినా ఎవరి మాటల్లోనైనా కాస్తంత మొరటుతనం మంచితనం కనిపించినా నీకు తెలీకుండా నీ కంట్లో ఉబికిన తడి నీ చెంపలను తడిపితే నీలో నీ ఊరు ఇంకా సజీవంగానే ఉన్నట్టు http://ift.tt/1bthiZX

by Yagnapal Raju Upendram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bthiZX

Posted by Katta