Si Ra// Dynamics of Stagnancy and mechanism of poetry // 13-6-14 రోజూ ఒకే ప్రదేశంలో కుర్చొని కవిత్వం రాస్తాం. వేరే ప్రదేశానికి వెల్లి రాసినా మన రచనలపై విశ్వాసం లేనితనం మనల్ని ఆవహిస్తుంది.(ఒక వేల వెల్లిన ఆ ఇంకొక ప్రదేశమే మిమ్మల్ని మీ సాధారణ-తనం నుండి విడుదల చేస్తే మొత్తం గా కొత్త అనుభవాన్ని అనుభూతి చందుతారు. అప్పుడు కవిత్వం రావటం సాధరనం, దాని గురించి ఈ వ్యాసం చివర్లో చెప్తాను* ). అదే కేలెండర్, అదే గడియారం, అవే గోడలు. కాని ఒకొక్క కవిత్వంలో ఒకొక్క సందర్భం, స్థలం, సమయం. సముద్ర గర్భం పై కురుస్తున్న వర్షం గురించి రాస్తాం. ఎముకలు కరిగే లాంటి ఎండ గురించి రాస్తాం. చేదించలేని చీకటి గురించి రాస్తాం, మారుతున్న ౠతువుల గురించి రాస్తాం. ఎప్పుడూ అదే నవ్వు తో ఉన్న, కలవని ముత్తాత ప్రతిమను చూస్తూ, అదే ఫేను శబ్ధం వింటూ, అదే నిశబ్ధంలో కూరుకుపోతూ. ఇన్ని ప్రదేశాలకు మనం ప్రయానం చేస్తుంటాం కానీ ఒకే ప్రడదేశం లో కుర్చోనిఉంటాం. దీనిగురించి ఆలొచిస్తుంటే టక్కుమని అనిపించింది, మనం కవిత్వం ద్వారా చలనం అనేది మరిచిపొయిన వస్తువులతో ఒక రకమైన సంబందం ఏర్పరుచుకుంటాం. ఆ వస్తువు కదలిక-లేని తనం లో మనం కదులుతాం, దాంత్లో ఒక విశ్వాన్నే కనుక్కునేకి ప్రయత్నిస్తాం. ఎక్కువ సార్లు ఆ వస్తువు లోకి పరకాయ ప్రవేశం చేస్తాము కుడా, తెలియకుండానే. ఆ వస్తువు పరిస్తితిని మన ఆనందానికో, బాధకో ముడి వేసి మనగురించి మనమూ, కొత్త విశయాలు కనుక్కుంటాం. ఈ రకంగా ఆ వస్తువుతో ప్రేమలో పడతాం. కవిత్వం మన లోపల జరిగే అలజడి అయినా, కవిత్వం శూన్యం లోంచి పుట్టదు. కవిత్వం పగటికల లాంటిది. ప్రపంచంలో ఏ ప్రదేశమైనా పగటి కలలు కనటానికి, అనుకూలంగానే ఉంటుంది. పగటికలని పోషించటానికి తనవంతు మద్దతు ఇస్తుంది. నిజానికి కవిత్వం రాయటం పగటి కలలు కనటం రెండిటికీ ఆలొచనా విధానం ఒకే రకంగా ఉంటుంది. పగటికలలుకనే ఎవరైనా కవిత్వం రాయగలరు. కాని ఎక్కడ అందరికి కష్టం అవ్తుంది అంటే పూర్తి చేతనం తో పగటికలను కనటం అనే దెగ్గర. అచేతనంగానో, ఉపచేతనం గానో కనిన పగటికలని కవిత్వం రాయలేము. అలా పూర్తి చేతనతో ఉండటం అనేది చుట్టూ ఉన్న పరిసరాలతో, వస్తువులతో ఒక రకమైన ప్రేమలో పడితే తప్ప చెయ్యలేము. ఒక కవి నిర్వానం అన్న స్థాయికి రావలంటే తను ఎలాంటి ప్రదేశానికి వెల్లినా ఆ ప్రదేశంలోని వస్తువులతో ప్రేమలో పడిపోవటం తనకు తెలుసుండాలి. ఆ ప్రదేశం లోని వస్తువుల అచేతనంలో ఒక కదలికను కనుక్కోవగలగాలి. బహుశా ఇలాంటి ఆలొచన నుండే పుట్టింటుంది శ్రీశ్రీ -కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల, ఆరటితొక్క, హారతి పల్లెం- అన్నీ కవితా వస్తువులే అన్న ఆలొచన. అన్నిటిలోనూ కవి కనుక్కొవాల్సిన ఒక చలనం "నీ వైపే చూస్తూ ఉంటాయ్, తమ లోతును తెలుసుకోమంటాయ్". *ఒక కొత్త ప్రదేశానికి వెల్లినప్పుడు మనకు తెలియకుండానే మనం పూర్తి చేతనటో ఆలొచిస్తుంటాం. మొదటి సారి మనకు కలిగిన అనుభూతి మనకు ఎక్కువకాలం గుతుందటానికి కారనం అదే. మొడటి సారి బస్సు ఎప్పుడు ఎక్కాము, మొదటి సారి ఒంతరిగా యెప్పుడు ప్రయానించాము, మొడటి సారి సముద్రాన్ని చూసినప్పుడూ, అలాంటి సమయాల గురించి మనకు తెలిసో తెలియకనో ఒక జ్ఞాపకం ఉంటుంది. అందుకే ఆ ప్రదేశం గురించి సులభంగానే కవిత్వీకరించేయ గలుగుతాం. కవిత్వం మన ఆలొచనలను విడుదల చేసే ఒక పద్దతి. అలాంటి కొత్త ప్రదేశం, సాధారన తనం నుండీ మనల్నే విడుదల చెస్తుంది కాబట్టి, కవిత్వం కేవలం అలాంటి సమయాల్లో ఉపఫలం మాత్రమే.
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqvKNS
Posted by Katta
by Si Ra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oqvKNS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి