పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

Lugendra Pillai కవిత

కరణం లుగేంద్ర పిళ్ళై //అతనో...జీవితాన్ని చెక్కిన అమర శిల్పి// బీడి పొగతో నిండి చెమట వాసన వేస్తుంటాడు సూర్యుడి క్రింద ఎక్కడెక్కడో తిరిగి కర్రిబారిన మోహంతో ఇంటికొస్తాడు.. పంటి బిగువున బాధల్ని దిగమింగి నవ్వడం మరిచిపోయిన మౌన రుషిగా కనిపిస్తాడు పలకిద్దామన్నా భయం వేసి ఓ మూలన దాక్కొని చూస్తూంటే చిన్న పిల్లాడై పోయి ఆడుకుంటాడు నాకోసం ఏనుగవుతాడు.. నాకోసం గంతులేస్తాడు నేనడిగిన చిన్న పలకకోసం క్రోసెడు దూరం నడిచేస్తాడు.. అతడో నా జీవితానికో ట్రాపిక్ కానిస్టేబుల్ అప్పుడప్పుడు అపేస్తాడు....కసిరేస్తాడు క్రమం తప్పితే బెత్తమై వాంచేస్తాడు నా గమ్యం నిర్దేశించే సిగ్నల్ లైట్ అవుతాడు.. ఇప్పుడు తెలుస్తోంది.. గదమాయించే మాటల వెనుక ఓ గురువున్నాడని హెచ్చరించే ఆ చేతల వెనుక నాకోసమే తపించే ఓ హృదయం వున్నదని నా జీవితాన్ని ఇంత అందంగా చెక్కిన అమర శిల్పి జక్కన్న అతనేగా. నాన్న లేకుంటే నేను దారం తెగిన గాలిపటమేగా....15/6/2014

by Lugendra Pillai



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCQoqA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి