కట్టా శ్రీనివాస్ || నాన్నపేగు అప్పుడు అమ్మమాటకోసం అడవుల్లోకి వదిలినా కన్నపేగుని వదలని మనసుతో ప్రాణాలొదిలింది తనే. మరోసారి మామ కత్తికి బలికాకుండా కాచేందుకు అర్ధరాత్రి వానలో గంపకెత్తుకుని నదినిసైతం లెక్కచేయకుండా దాటించి కాచుకుందీ తానే. బాధలన్నీ గాంభీర్యపు కవళికల చాటున దాచేసి వున్నదంతా ఇచ్చేసేదీ తనంటే తనే నిజమే సుమా దేవుడ్నయినా దయతో కాచుకునేది నాన్నే అమ్మతర్వాత అమ్మంతటిదీ తనే. అశ్వద్ధామా హత: చెవికి సోకగానే ఆయుధాల్నీ, ప్రాణాల్నీ వదిలేంత పుత్రశోకం. గురుధర్మం రూపంలో తూస్తే ప్రేమగా కనపడకపోవచ్చు. వందతప్పుల్ని చూస్తూ కళ్ళుమూసుకున్న కట్టడిని లోకం గుడ్డిదనుకోవచ్చు. అమ్మప్రేమలా అది ఊటబావి కాదు నిరంతరం తడిగా కనిపించేందుకు అమ్మతో సహా నీచుట్టూ తన దేహాన్నే ఫణంగా పెట్టి నిలుచున్న రాతికోట. అప్పగింతలప్పటి వరదగుడి ఎదురుదెబ్బల్ని కాచే జీవితపు బడి గుండెలపై జేబుని ఊయలచేసి ఊపే ఒడి పుట్టగానే తల్లిపేగుని కత్తిరించినా పోయేవరకూ అంటిపెట్టుకుంటుందేమో నాన్నపేగు. బిడ్డలు తాకినప్పుడల్లా అదిమనల్ని సాకుతున్నట్లు కనబడుతుంది. ► 15-06-2014 ► http://ift.tt/TXXrjh
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXrjh
Posted by Katta
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXrjh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి