పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

Prasad PV కవిత

|| నాన్న || అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే వద్దని మారాం చేసినపుడు నీ మమకారాన్ని కలిపి ఒక్కో ముద్దా నా నోటికందిస్తే అప్పటికే నిండిపోయిన నా కడుపు ఎలా వెలితవుతుందో తెలీదు.. రుచి తెలియని నీ మమకారం ఆహారమవుతుంటే అన్నం ముద్ద తింటూ నిన్ను చూసినపుడు ఆకలిని తీర్చే ఆకాశం కనిపించింది చదువు కోసం నీకు దూరంగా ఇల్లెల్లిపోతున్నపుడు ఆడపిల్లను సాగనంపుతున్నట్టు నన్ను తడిమి తడిమి ముద్దెట్టుకుంటుంటే నీ గుండె కన్నీటి చెలమల్లో తానమాడుతూ కనిపించింది. బాధలు,బాధ్యతలంటే ఏంటనడిగినపుడు నీ చిరునవ్వే సమాధానమైంది మాకు. వాటి అర్థాన్ని కూడా మాకు తెలీనివ్వకుండా ఇంటినే కాదు అందర్నీ ఒంటి స్థంభంలా మోస్తూ భారాన్ని భరించే భూమికి నాన్నవయ్యావు

by Prasad PV



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKysyE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి