ఇదే నా(?) జీవితం? // శారద శివపురపు నన్ను పిలచి పిలచి నిద్రలోకి జారుకున్న సూరీడు పొద్దున్నే పొడుచుకొచ్చి చిర్నవ్వులు చింది స్తున్నాడు నడిరాతిరి నిశ్శబ్దంగా ఉబికి వచ్చిన ఆత్మీయతల వెల్లువ వేకువ సొదల్లో, రొదల్లో పెదవి దాటి పయనించదులె తెగిన ఆశల రెక్కలతో సుదూర గమ్యాల స్వప్నాలు దిక్కుతోచని గమనంలో, మారిపోయే నా గమ్యాలు నిర్వచించేనా? తరుముకొచ్చే రాత్రీ, పగళ్ళు? పడమర పయనంలో తూరుపు చూపుల ఆశావాదం రాత్రి పగలు కాని ఏకాంతంలో నన్ను నేను చూసుకుంటే నాకు నేనే ఒక అపరిచితుడిగా పరిచయమవుతుంటే రెప్పలు మూసుకుని వాటేసుకున్న చిక్కని చీకట్లో చుక్కలాంటి పొద్దుల కై ఎప్పటికీ వెతుకులాట మెరుపులాంటి వెలుతురులో కనులు విడివడని, ఇదిఅని తెలియని నీరసంలాంటి ని స్తేజపు నిర్వేదం. నిశీధిలో జాగృతిలో, స్వప్నాలు కనులు దాటి కదలలేవు ప్రతి రాత్రి ముడి విడిన బంధాలు పగలెప్పటికీ ప్రశ్నలే. ఎదబంధాలు ఎదురుబొదురుగా, ఎన్నడు కలవని రైలుపట్టా లే, ఏంలాభం? గుండె చిక్కుకున్నాకా తెలిసిందది తెగిన గాలిపటమని. శబ్దంలోంచి నిశ్శబ్దానికి, ప్రేమతత్వంలోంచి ప్రేమ రాహిత్యానికి, అగాధంలోంచి ఆకాశానికి, ఆకాశంలోంచి అగాధానికీ దూరం ఒక క్షణమని తెలుసుకొనేందుకొక జీవితకాలం. 14/06/2014
by Sharada Sivapurapu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqtbj
Posted by Katta
by Sharada Sivapurapu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgqtbj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి