పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rasoolkhan Poet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rasoolkhan Poet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Rasoolkhan Poet కవిత

*అమ్మ* పురిటి నొప్పుల యజ్ఞం లో ఓ ప్రాణం అంచుల చివర మరొక ప్రాణం వెలిగింది నెత్తుటి ముద్దను మనసారా హత్తుకొని మురిపెంగా ముద్దు పెట్టుకున్నావు నిన్ను తలిస్తే చాలు ఇప్పటికీ ఆ స్పర్శ నా గుండెను తాకుతూనే వుంది కట్టెలు కొట్టావు కూలికి వెళ్ళావు నా కడుపును నింపి కన్నీళ్ళతో కాలాన్ని నడిపావు తాగుబోతు తండ్రి అప్పుల అతుకుల బతుకు ఆ నీడల జాడలు కూడా నాపై పడకుండా వెన్నెల కాంతులు జల్లావు నిశీధిలో నీవు కలిశావు నేనెంత ఎత్తుకు ఎదిగినా నీ వేలు పట్టి నడిచిన ఆ తొలి అడుగులు మరువలేదు నీ చేతి ఎర్రకారం ముద్దలు తింటూ నేను తినిపిస్తూ నువ్వు ఇద్దరం ఏడ్చేవాళ్ళం నేడు నా చుట్టూ పంచభక్ష పరవాణ్ణాలు ఉన్నా అమ్మ...! నీవు లేవు. పి రసూల్ ఖాన్ 23-6-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wlrSOr

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Rasoolkhan Poet కవిత

ప్రజా సాహితి లో నా కవిత "మట్టి చేతులు"

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1vOY1xB

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Rasoolkhan Poet కవిత

*కదిలే అక్షరాలు* అక్షరాలు కదులుతున్నాయ్ బంగారు వాకిట్లో పచ్చని చెట్టుక్రింద చల్లని వెన్నెల్లో కదిలే అక్షరాలను కళ్ళకు మెరుపులు చుట్టుకుని తదేకంగా చూస్తూ కూర్చుండి పోయా చంటి పిల్లాడికి చందమామ అందినంత ఆనందం నాలో తమ అనుభవాల ముటలను ముత్యాల్లా నాపై విసురుతుంటే ఆ జ్ఞానకాంతుల వర్షంలో తడిసి ముద్దయిపోయా ఆత్రంగా వచ్చినా మదినిండా స్పూర్తితో ఇంటికి చేరా...! యాకుబ్ భాయ్ షుక్రియా.....

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lL4HcP

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Rasoolkhan Poet కవిత

*నాన్న* పచ్చని పల్లెను వదలి పట్నం వచ్చిన నాన్న తన జీవితంలో పచ్చదనాన్ని కోల్పోయాడు కొలిమిలో కాలే బొగ్గులా కన్నీటి కొలనులా కష్టాలతో స్నేహం చేస్తూ మా కడుపులు నింపడానికి కదిలే నాన్నలో..... కనిపించని ఆత్మస్ధయిర్యం మా కర్తవ్యాన్ని గుర్తు చేసేది మా కోసం చదువులు కొనలేక అచేతనంగా చూస్తు మౌనంగా రోదించే నాన్న చెంపలపై ముత్యాల్లా మెరిసే కన్నీటి చుక్కలు చుక్కానిలా మాకు దారి చూపేవి నాన్న చివరిదాక కొవ్వొత్తిలా వెలుగును పంచుతూనే కరిగిపోయాడు మా జీవితాలలో చీకటి చుక్కను తరిమి పోయాడు నాన్నంటే ఆనందం నాన్నంటే ఆదర్శం నాన్నంటే ఆత్మీయ స్పర్శ నాన్నంటే నిన్నటి తీపి కల నాన్నంటే మా బ్రతుకులలో కురిసిన వెన్నెల ధార అవును .....నాన్నే మాకు అన్నీ. పి రసూల్ ఖాన్

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgquMq

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Rasoolkhan Poet కవిత

*తను* పుడుతూనే ఎండిన హృదయాలలో కొత్త చిగురులు పూయిస్తుంది తగ్గుతూ విస్తరిస్తూ ఎన్నో ఎత్తుపల్లాలు దాటి బీళ్ళలో పచ్చదనం పరుస్తుంది ఓర్పుగా నేర్పుగా కదులుతూ ఎందరికో ఆశాదీపం అవుతుంది తనుమాత్రం ఒంటరిగా తీరం చేరుతుంది సముద్రుడి(మగాడి)కి బ్రతుకునిస్తుంది. రసూల్ ఖాన్ 2-6-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wU3Afv

Posted by Katta

28, మార్చి 2014, శుక్రవారం

Rasoolkhan Poet కవిత

లే...! ఆశయాల శిఖరాలు ఆశల నిచ్చెనలకు అందవు. నీడల వెంట ఎన్నాళ్ళు నడిచినా నిజంగా మారలేవు. రంగుల ప్రపంచంలో నీ రంగు ఏదో గమనించు. ఎవరి ఆవేశాలకో నువ్వు ఆహుతి. ఎవరి పబ్బం గడవడానికో నీకి దుస్ధితి. జెండాలను మొసి మొసి జీవితాన్ని ధారపోసి ఓటు దాటి పోగానే పోటుకు గురవుతున్నావ్. ప్రభాత భానుడిలా వెలగాల్సిన నువ్వు చీకటి రాజకీయాలకు బలవుతున్నావ్. లే... నీ ఓటుతో కేటుగాళ్ళందరి కీళ్ళు కదిలించు. లే.... నీవే ఒక ఎజెండాగా మారి అవినీతి పరుల ఆట కట్టించు మతోన్మాదులను మట్టికరిపించు. లే.... యువశక్తితో నవయుక్తితో దేశాన్ని నడిపించు రేపటి కోసం ఈ రోజే నడుంబిగించు. పి రసూల్ ఖాన్ 28-3-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hCNgoF

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Rasoolkhan Poet కవిత

నేటిదినం పత్రికలో నాకవితా సంపుటి 'దువా'సమీక్ష

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTv1yJ

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Rasoolkhan Poet కవిత

*అంతర్లోచన* చీకటి దుప్పటిని కప్పుకున్న చలిలో భూమిని వెచ్చగా ఆసరా చేసుకొని ఒళ్ళుతెలియక నిదురపోతున్న కుక్క దాని కాళ్ళదగ్గర మగతగా మూలుగుతూ నిదురపట్టని అవ్వ...! జంతువులను ప్రేమించే లోకంలో మనుషులకు ప్రేమ కరువు. అభివృద్ధి ఆరాటంలో అంతస్తులు పెరుగుతూ అనుబంధాలు చరిత్ర పాఠాలయ్యాయి. సినిమాలు చూస్తూ కన్నీళ్ళు కారుస్తూ అదే కారుణ్యం అనుకుంటున్నాం. కన్నీళ్ళను తుడుచుకుని కలనుండి మేల్కోన్నవాడిలా కాలచక్రం వైపు కాళ్ళీడుస్తూ కదలిపోతున్నాం. చరిత్ర మరచిన వారిలో కలసి పోతున్నాం చీకటిగా మిగిలిపోతున్నాం. పి రసూల్ ఖాన్ 17-3-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKhbdH

Posted by Katta

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rasoolkhan Poet కవిత

* సృష్టికర్త * ప్రపంచానికి రంగులద్దిన వాడిని ప్రకృతిలో వెతుకుతున్నావ్ నీ సేవకై వచ్చిన వాటికే నువ్వు సేవకుడివయ్యావ్ అన్నిటికై ఆరాటం ఏమిలేని ఒంటరితనం సూర్యుడిలో అగ్నిని చూస్తూ కాంతిని మరిచావ్ కోకిలలో నలుపును చూస్తూ కిలకిల రాగం మరిచావ్ కన్నీటి చుక్కలను చూస్తూ ఆనంద బాష్పాలను మరిచావ్ చీకటిని చూస్తూ వెన్నెలను మరిచావ్ నీవు చూసేదంతా నిజంకాదు నీవు చూడనిది అబద్దం కాదు కలల ప్రపంచం నుండి కనురెప్పలు దాటిచూడు నిజం నీడలా నీవెంటే ఉంటుంది. పి రసూల్ ఖాన్ 18-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e4pCiT

Posted by Katta

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Rasoolkhan Poet కవిత

*మానని గాయం* మొండి గోడలకు రంగులద్ది ప్రపంచాన్ని ఏమార్చలేవు. కుత్తుకలు కోసి కుక్కలతో పోల్చి కుర్చికోసం నాలుగు గెడ్డాలతో పోజులిస్తున్నావ్. కిరాయి టోపిలను చూపి నయవంచనతో నయా కలలు కంటున్నావ్. నీవు ఎన్ని ముఖాలను మార్చినా నీ కోరపళ్ళకంటిన నెత్తుటి మరకలు మాయవు. చీకటి చరత్రను రాయాలని జూస్తే వెలుగు రేఖలకు మాడిపోతావ్. ఒరేయ్ ఉన్మాది మదమెక్కిన మతోన్మాది నీ కత్తులు,త్రిశూలాలు మా గుండెను చీల్చగలవు మాలో గూడుకట్టుకున్న భారతీయతను కాదు. నీడ ఎంత భ్రమించినా నిజమవ్వలేదు. నీలాగే... పి రసూల్ ఖాన్ 16-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gQgH80

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rasoolkhan Poet కవిత

॥నీడల జాడలు॥ ముఖచిత్రం నచ్చలేదని మహాకావ్యాన్ని కాదంటావా. వెలుగు నీదాకా రాలేదని వెన్నెలను నిందిస్తావా. చిరుదెబ్బలకు ఓర్వలేక ఒంటరి శిలవవుతావా. నీవె నిజం అనుకుని అబద్ధంగా మిగులుతావా. నీవు నిరాకరించినా ఆకాశం నీకు నీడనిస్తుంది భూమి నిన్ను భరిస్తుంది. మహా శిఖరమైన ఓర్పుకే తలవంచుతుంది. ఒక్కక్షణం ఆలోచన ఓటమిని జయిస్తుంది. ఆలస్యంగానే అద్బుతం వరిస్తుంది. పి రసూల్ ఖాన్ 3-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aVk7Zc

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Rasoolkhan Poet కవిత

॥నీడల జాడలు॥ ముఖచిత్రం నచ్చలేదని మహాకావ్యాన్ని కాదంటావా. వెలుగు నీదాకా రాలేదని వెన్నెలను నిందిస్తావా. చిరుదెబ్బలకు ఓర్వలేక ఒంటరి శిలవవుతావా. నీవె నిజం అనుకుని అబద్ధంగా మిగులుతావా. నీవు నిరాకరించినా ఆకాశం నీకు నీడనిస్తుంది భూమి నిన్ను భరిస్తుంది. మహా శిఖరమైన ఓర్పుకే తలవంచుతుంది. ఒక్కక్షణం ఆలోచన ఓటమిని జయిస్తుంది. ఆలస్యంగానే అద్బుతం వరిస్తుంది. పి రసూల్ ఖాన్ 3-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1aVk7Zc

Posted by Katta

Rasoolkhan Poet కవిత

$ఆల్ ద బెస్ట్$ ఎన్నో పరక్షలను పుట్టుకతోనే గెలిచావు. పసితనంలో ప్రపంచాన్ని చదివావు. ఒకరి నీడవవక నీవే దీపమై వెలుగురేఖలను పంచు. జగాన జయభేరి మ్రోగించు. పి రసూల్ ఖాన్ 1-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MJrfwQ

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Rasoolkhan Poet కవిత

$ఆల్ ద బెస్ట్$ ఎన్నో పరక్షలను పుట్టుకతోనే గెలిచావు. పసితనంలో ప్రపంచాన్ని చదివావు. ఒకరి నీడవవక నీవే దీపమై వెలుగురేఖలను పంచు. జగాన జయభేరి మ్రోగించు. పి రసూల్ ఖాన్ 1-2-2014

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MJrfwQ

Posted by Katta