పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

Sasi Sri కవిత

రాళ్ళబండి శశిశ్రీ // లెక్కల్లో జీవితం // అన్నీ దృక్పథాల వ్యాసార్ధాలతో మన చుట్టూ నిర్మించుకునే వృత్త పరిధులే ఎవరు కాదన్నారు మనిషి దృష్టి వైశాల్యం πr2 కాదని?! ఎటు నుంచి చూసినా అన్నీ లెక్కలూ, తీసివేతలే అటు ఇటు కాని ఆలోచనల అలసటలే కూడికకు పనికి రాని వ్యర్థ సంఘటనల సమాహారాలే ఏ నిష్పత్తిలో నిర్వచించను మది మజిలీలను, జీవిత గమ్యాలను?! అనుభూతుల నెయ్యాలను, అభిజాత్యపు కయ్యాలను?! చిరిగిన పేజీలలో వగరు అనుభవాలు పెరిగిన పరిణితి సాక్షిగా తరగిన ఆనందాలు ఎప్పుడూ వుండే నిటూర్పులను అప్పుడప్పుడూ వచ్చే ఓదార్పులు నల్లిఫై చేస్తూనే ఉంటాయి బ్రతుకు సమీకరణాలలో! గుండెనిండుగా శ్వాస తీసుకొని మళ్ళీ ప్రారంభిద్దామా మారని మన నడకని?! పునరావృత్తమయ్యే పర్వాలలోకి మోనాటనీ వీడని రొటీన్ లోకి- 15-6-2014

by Sasi Sri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lwsvRk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి