క్రాంతి శ్రీనివాసరావు ||మొదలులోకి ...|| నేను సాంద్రమైపోతాను ...కానీ ఆవెంటనే ఉక్కిరిబిక్కిరై ఉనికిలోకి తేలిపోతాను నేను సరళమైపోతాను ...ఏం లాభం భయం రెక్కలు మొలచి క్రిందికి జారిపోతాను నేను అప్పుడప్పుడూ నిలిచిపోతాను ....క్షణాల్లోనే రంగువెలసి మరుక్షణమే ఎవడిలానో మారిపోయేందుకు పరుగులిడతాను.. చుట్టూ ఎన్ని భూతాలో ..అన్ని వాటిలానే మారాలంటున్నాయి అందుకే నన్ను నేనే ఉండచుట్టుకొని ... వేగంగా విప్పుకొంటూ కొత్త గాలిపటమై ఎగురుతుంటాను అయునా ఎలాఉన్నా మరోలానే ఉండాలనిపిస్తుంది ......ఎందుకంటే నాకంటే ముందే ఎవడో అచ్చం నాలానే ఎగురుతుంటాడక్కడ నాకొసం ఈలోకం సిద్దపరిచిన గాజుపూల పానుపు గుచ్చుకొంన్నప్పుడల్లా నన్ను నేను గుర్తుపట్టే ప్రయత్నంలో మునిగిపోతాను ....మళ్ళీ సరళమై సాంద్రమై స్తాణువై తల్లి పేగులో వెతుకులాడుతాను .....
by Kranthi Srinivasa Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCQnTF
Posted by Katta
by Kranthi Srinivasa Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lCQnTF
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి