పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జూన్ 2014, ఆదివారం

Rasoolkhan Poet కవిత

*నాన్న* పచ్చని పల్లెను వదలి పట్నం వచ్చిన నాన్న తన జీవితంలో పచ్చదనాన్ని కోల్పోయాడు కొలిమిలో కాలే బొగ్గులా కన్నీటి కొలనులా కష్టాలతో స్నేహం చేస్తూ మా కడుపులు నింపడానికి కదిలే నాన్నలో..... కనిపించని ఆత్మస్ధయిర్యం మా కర్తవ్యాన్ని గుర్తు చేసేది మా కోసం చదువులు కొనలేక అచేతనంగా చూస్తు మౌనంగా రోదించే నాన్న చెంపలపై ముత్యాల్లా మెరిసే కన్నీటి చుక్కలు చుక్కానిలా మాకు దారి చూపేవి నాన్న చివరిదాక కొవ్వొత్తిలా వెలుగును పంచుతూనే కరిగిపోయాడు మా జీవితాలలో చీకటి చుక్కను తరిమి పోయాడు నాన్నంటే ఆనందం నాన్నంటే ఆదర్శం నాన్నంటే ఆత్మీయ స్పర్శ నాన్నంటే నిన్నటి తీపి కల నాన్నంటే మా బ్రతుకులలో కురిసిన వెన్నెల ధార అవును .....నాన్నే మాకు అన్నీ. పి రసూల్ ఖాన్

by Rasoolkhan Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qgquMq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి