ఎన్నెన్ని ఆలోచనలు ఎన్నెన్ని ప్రణాలికలు బతికినంత కాలం కలిసే బతకాలనుకున్నం ఎన్ని ఊసులు మరెన్నో ఊహలు ఎన్నో ఎన్నెన్నో పంచుకున్నాం పకృతి ప్రకోపించి ఎక్కడో ఉరుముతుంటే నిద్రలో ఉలిక్కిపడి నిన్ను హత్తుకున్నానా పొద్దున్నే నువ్వా విషయం చెపితే నాకు భయం అనిపించేది నువ్వు లేకుండా నేనీ లోకంలో ఒంటరిగా నేనలా బతకాలని సాయంత్రం శృంగార దేవతను తలచుకొని నీకెన్ని రోజులు నిద్రను దూరం చేశానో నిజం చెప్పు ఒక్కనిమిషమైన నిన్నొదిలి ఉన్నానా పరమాత్ముడు పిలిచినా పనిఉందని చెప్పి నాతోనే ఉంటానన్నావ్ మరి ఎందుకు ఉన్నపళంగా నాకు దూరం అయ్యావు చెట్టులో పుట్టలో ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావ్ నువ్వు లేవని రావని తెలిసి కూడా నా మది ఒప్పుకోడం లేదే నడిరాత్రి నిద్రలోనే నీకోసం పక్కలో వెతుక్కున్నాను నువ్వెంత దూరం వెళ్ళినా నీకోసం నేనొస్తా నేస్తం నువ్వా స్వర్గంలో ఉండి ఆనందం అనుభవిస్తున్నావేమో నీ ఉత్సాహంలో నాకు ఎప్పుడైనా చోటు లేకుండా ఉన్నదా స్వర్గానికి నేను చేరినా ఆ రంబా, ఊర్వసి లు నాకెందుకు నటరాజ స్వామిని తలచుకొని మనిద్దరమే నాట్యం చేద్దాం మనిద్దరిని చూసి ఇంద్రాది దేవతలు కుళ్ళు కోవాలి నీవు లేని లోకం తెరచాపలేని నావలా ఉంది ఇక్కడ నేనుండలేను వస్తున్నా నేస్తం నీకోసం
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQEc5
Posted by Katta
by Venugopal Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQEc5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి