నా చేతిలో… నీ చెయ్యి... అహం సంకెళ్ళు తెగినప్పుడే నేను ప్రేమ పాదాల్ని తాకాను. ఆ దృశ్యం ఎంత నిండుగా చూశావో.. నీ ప్రణయపు జలపాతంలో నన్ను శుద్దిస్త్నానం చేయించావు. సంధ్యాచీకట్ల పొత్తిళ్ళలో సంద్రపు చలువ వింధ్యామరల మధ్య మనల్ని కమ్ముకున్న ఒడ్డున ఇసుకతిన్నెల పరుపు పరుచుకొని ఒకరినొకరం హత్తుకొని కునుకు తీసిన నాలుగునిముషాలు చాలవా? స్వర్గం మనకోసమే పుట్టిందని చెప్పడానికి. అమ్మల నువ్వూ బాబులా నేనూ మురుపించుకొనీ బుజ్జగించుకొనీ బాధించుకొనీ ఏడ్పించుకొనీ గాఢంగా నమ్ముకొనీ ఎన్ని ఊసులు చెప్పుకొన్నాం ఎన్ని ఆశల్ని నెమరువేసుకున్నాం చెప్పరా? ఇది ఎన్నిజన్మల వరం. ప్రేమకు అర్ధం చెప్పమంటే..చెబుతానిప్పుడే అది నా చేతిలో వున్న నీ చెయ్యి. sriarunam from my book నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు...nundi
by Sriarunam Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBUtx2
Posted by Katta
by Sriarunam Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NBUtx2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి