పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మార్చి 2014, శనివారం

Patwardhan Mv కవిత

ప్రేమిస్తా రా ?? మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది..మన మాట వారికి నచ్చట్లేదనీ,ఎప్పటికీ నచ్చదనీ. అర్థమౌతూనే ఉంటుంది మన ఉనికి వారికి కష్టమైందని,ఎప్పటికీ ఇష్టం కానిదనీ. మన స్పర్శ వారు భరించలేరని,ఎప్పటికీ అసహ్యమైనదనీ. మనను అక్కడకు రాకుండానే చూడాలనుకుంటారని,ఎప్పటికీ రానివ్వరనీ. వారి ప్రతి ఆలోచనా మనకు ఐమాక్స్ స్క్రీన్ మీద కనబడుతూనే ఉంటుంది. మనల్ని కొలిచే కొలమానాల శిలాజాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటవి. చాలాసార్లు నిగూఢంగానూ,ఒక్కోసారి కాసింత బహిరంగంగానూ శిశిరంలో ఆకుల్ని మాత్రమే రాల్చి కాదు చెట్టు నగ్నమయ్యేది,ఆలోచనల్ని కూడా! వారు మన ప్రతి పద ముద్రల వెనకాల వెదికేదేంటో మనకు తెలుసు వారు మనను చిత్రించే చిత్రవర్ణ మర్మమేమిటో తెలుసు వారు మన గాలిలో శ్వాసించే గంధక ధూమమూ తెలుసు వారు మన చుట్టూ అల్లిన చీకటి సాలెగూళ్ళూ తెలుసు. వారి అభావ,విభావ,ముభావ స్వభావాలకీ మన చేతుల్నించి దారం తెగిపోయిన గాలిపటం లాంటి కారణమూ తెలుసు అయినా విచిత్రం !విస్ఫోటించిన ఆవేదన విరామాన్ని ఎరుగకముందే మన మొహం మీద నవ్వు నెలవంక మొలుచుక వస్తుంది. అంతకంతకూ వారిపై మోహం పెరుగుతూనే ఉంటుంది వారిని ఒక్క సారైనా ముద్దాడి పోవాలనే వ్యామోహమూ పెరుగుతూ ఉంటుంది మనల్ని మనం జీవ నదిగా మార్చుకున్నప్పుడు అన్నింటినీ కల్పుకొని ముందుకు సాగిపోవడమే కదా మనకు తెలిసింది. నిస్సహాయులం ప్రేమించడం మన జీవ ధాతువు. 22-03-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h73tSP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి