పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rammohan Rao Thummuri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rammohan Rao Thummuri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2014, ఆదివారం

Rammohan Rao Thummuri కవిత

గీత సినిమా ఆమధ్య రిలీజయ్యింది కాని ఆడలేదు.ఆ సినిమాలో ఓ పాట రాసే అవకాశం ఇచ్చారు దర్శకులు శ్రీ యేలేటి రామారావు గారు. సన్నివేశం చెప్పారు.ఒక దళిత వేదపండితుడికి దేవాలయంలో సన్మానం జరిగిన తరువాత అతని స్పందన పాట రూపం లో రాయమన్నారు. మల్లగుల్లాలు పడుతుంటే మనీషా పంచకం సూచించారు మిత్రుడు నారాయణ గౌడు. దాన్ని పట్టుకోవాడానికి కొంత కష్ట పడాల్సి వచ్చింది. ఆ ప్రేరణతో డైరెక్టరు గారి సూచనల మేరకు పాట తయారయ్యింది.దర్శక నిర్మాతలిద్దరికీ చాలా బాగా నచ్చింది.దాదాపు నా బాణీలోనే రేవతి రాగంలో పాట సెట్ చేశారు సంగీత దర్శకులు పద్మనావ్ గారు. దాన్ని చంద్రతేజగారు పాడారు. సాహిత్యం మీ కోసం ఆదికవి వాల్మీకి విరచితం రామాయణం-ఆరాధనీయం వేదవ్యాసకృతమ్ భారత పురాణం -అతిపూజనీయం గాధిసుతప్రోక్తం గాయత్రిమంత్రం -సంస్తవనీయం మాతంగ హృదయం మమకార నిలయం - బహుశ్లాఘనీయం సూతమాతంగ కైరాత క్షత్రియ మునులు బ్రహ్మతత్వజ్ఞాన సంపన్నకోవిదులు స్మృతిశృతి పురాణేతిహాస కృతి కర్తలై ఇలలోన ఖ్యాతివడసిన మేటి బ్రాహ్మణులు ఛండాలుడైతేమి ద్విజుడైన నేమీ బ్రహ్మమెరిగినవాడె నిజమైన బ్రాహ్మణుడు ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ పంచభూతాత్మకం పార్థివ శరీరం జ్ఞానకర్మేంద్రియాధీన మీ దేహం త్రిగుణ సంజనిత సంవేదనా గేహం మనోబుధ్యహమ్మంథన మాయకలశం పంచవింశతి తత్వ పక్వపరిధులు దాటి జ్ఞాననేత్రాలతో పరతత్వమును గాంచి సకల జీవుల లోన తన్ను తా జూచుకొను నేర్పుగల్గినవాడె నిజమైన బ్రాహ్మణుడు ఛండాలుడైతేమి ద్విజుడైన నేమీ బ్రహ్మమెరిగినవాడె నిజమైన బ్రాహ్మణుడు అంత్యజుడనై పుట్టి ఆర్షవిద్యలు నేర్చి అంతరాత్మ ప్రబోధమ్ముతో జీవించు నా స్వప్నమీనాడు నిజము చేసితివా బ్రహ్మజ్ఞులతొ నన్ను సమము చేసితివా దేవ దేవేశ్వరా సర్వలోకేశ్వరా ప్రణమామి ప్రణమామి పాహి పరమేశ్వరా ప్రణమామి ప్రణమామి పాహి పరమేశ్వరా ప్రణమామి ప్రణమామి పాహి పరమేశ్వరా

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UwAGTO

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వ ----------- జీవితం ఆశల కొమ్మవైపు జిరాఫీ మెడలా సాగుతూ ------------------------- వాధూలస 21/6/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSje1P

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Rammohan Rao Thummuri కవిత

రైలుపెట్టెలో బాలచంద్రుడు ........................................... నడవలేక పోతే పాకుతూ అయినావెళ్లు కానీ ...వెళ్లడం మాత్రం ఆపకు -అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలు అతడెప్పుడూ వినివుండడు పరిసరాలు పరిశుభ్రం గా ఉంచడానికి ప్రభుత్వపరంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమం అతనికి చిన్న చెల్లెలు ఆగిన రైలు పెట్టెలోకి అకస్మాత్తుగా బల్లిలాగానో పిల్లిలాగానో దూరుతాడు వాడి చూపులన్నీ నీ పాదాల కింద పారాడుతున్న పల్లిపొట్టుపైనో సమోసా తిని నువ్వు గిరాటేసిన న్యూస్ పేపరు ఉండలపైనో గుట్కా పొట్లాల పైనో పాలిథీన్ కవర్లపైనో చించి పారేసిన చిత్తు కాయితాలపైనో నీ బూటు కాళ్ళతో నువ్వు మోసుకొచ్చిన బజారు దుమ్ముపైనో నిలిచిఉంటుంది తన అవిటి కాలుతోపాటు ఊతకర్రనూ ఈడ్చుకుంటూ తన ఒంటిమీద ఉన్న ఆ ఒక్క చిరిగిన చొక్కాను తుండుగుడ్డను చేసి తుడుచుకుంటూ నువ్వుఅసహనంగా చూస్తున్నా భరిస్తూ నీ పాదాల కింద పాము మెలికలు తిరుగుతూ పాచినంతా పరిశుభ్రంచేసి నీ వైపు చెయ్యి చాపితే ఇయ్యాలా వద్దా అని ఇరవైసార్లు ఆలోచించే నీ ఇంగితాన్ని తన దీన వదనంలో విలీనం చేసి జాలితోనో ప్రతిఫలంగానో నువ్వు చేజార్చిన నీ దగ్గరి చిన్న నాణాలు పిడికిట పట్టే ఆత్మ స్థైర్యం గల అవిటి బాలచంద్రుడు తనను నిలబెట్టడానికి లేని కాళ్ల మీద విసుగులేని విక్రమార్కుడు దేహానికేగాని మనసుకు వైకల్యం లేని స్వయంకృషి సూర్యుడు -వాధూలస 20/6/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l9pdDQ

Posted by Katta

29, మే 2014, గురువారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వ ............... సంధ్య కొద్ది పాటి విశ్రామమయితేనేం ఇరుపక్షాల రాత్రీ పగళ్లను నెగ్గుతూ .............................................. వాధూలస 28/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rivP7e

Posted by Katta

21, మే 2014, బుధవారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వ ........... పుట్టుక మన చేతుల్లో లేని వాళ్లం కొట్టుక చావాల్సిందే .................................. 'వాధూలస'21/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qSLgTF

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వ """""""""" కులాగ్ని ఎప్పుడూ మండుతూ ఉండేలా ఎగదోస్తూ వాళ్లోసారి వీళ్లోసారి """""""""""""""""""""""""""" వాధూలస 20/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p7wunn

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Rammohan Rao Thummuri కవిత

శ్రీమతి సింగిరెడ్డి శారదగారు డల్లాస్ లో TANTEX (telugu association of north texas)సాహిత్య కార్యక్రమాల కన్వీనరుగా పరిచయమయ్యారు.తొలి పరిచయభాషణ లోనే వారికి మావూరికి గల అవినాభావ సంబంధం గురించి తెలిసింది .ఆమె చిన్నతనాన ఎలగందుల బస్టాండులో వాళ్ల కోసం సిద్ధంగా ఉన్న సవారి కచ్చురం లో వాళ్ల అమ్మమ్మ గారి ఊరైన జవారి పేటకు పోయిన సంగతి గుర్తు తెచ్చుకుని మురిసి పొయ్యారు.ఆ వూరికి మాఖిల్లా ముందునుంచి వెనక్కు వెళ్లి మానేరు దాటి పోవాల్సి వచ్చేది.ఇప్పుడు వాగు పోయి మానేరు డ్యాం ఏర్పడ్డ తరువాత ఆ రాక పోకలన్నీ బంద్. వాగు గురించి రాయమన్న వారి అభ్యర్థన మేరకు ఆవేదన పొంగి అక్షరాల వాగు ప్రవహించింది. వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! గల గల పారేటి గంగమ్మ మానేరు జల జల జారేటి జాబిల్లి మానేరు ఒడ్లొరిసి పారేటి ఓదార్పు మానేరు వరిమళ్లు దడిపేటి వరలచ్మి మానేరు వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! యాసాడ గైనంటే యాదే లేక పాయె గన్నేర్వరం తొవ్వ గంగలగల్సి పాయె ఉరగాల్వ ఊసు ఉత్తదే ఐపాయె పెద్దకాల్వ సొగసు పేరుకే లేదాయె వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! వాగావలూళ్లన్ని వలసకేళ్లీ పాయె మిగిలిన ఊళ్లకు సుట్టు దిరుగుడాయె బండ్ల తొవ్వలు బాయె బస్టాండు కళవాయె పాత రోజులన్ని కలలోనే గనుడాయె వాగెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! మానేరెక్కడున్నది శారదమ్మో శారదమ్మా ! Vaadhoolasa 18/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o3t7h9

Posted by Katta

17, మే 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

శిబి శిల ................... ఊరికి పడమట అలసిన సూర్యుణ్ణి తన వెనకనున్న పడమటింటిలో పరుండబెట్టేందుకు కూచున్న రాళ్లరాసి గుట్టమ్మ పెరిగే తరిగే చంద్రుణ్ణి రోజూ సిగలో తురుముకున్నందుకేమో చందమామ గుట్టయ్యింది మా సోపాల ముంగట నిలవడి సూసినప్పుడల్లా నాకది శిలా పుష్పాలతో పేర్చిన పెద్దబతుకమ్మలా అన్పించేది సాయంత్రం ఈద్ గాహ్ ఎక్కి అటువైపు చూస్తే సూర్యశిరోమణి ధరించిన మహారాణి లా కన్పించేది బాపు పంపిస్తే తిర్మలయ్యగారింటికి వెళ్ళినప్పుడో షేర్ఖాన్ బాయికి మంచినీళ్లకు పోయినప్పుడో సూరమ్మ బాయికి స్నానానికి వెళ్ళినప్పుడో కన్నుల్లోనే వెలిగిపోయేది ఆ పడమటి గుట్ట మొన్న దాని పక్కపొంటి పోయినప్పుడు శతృవును చుట్టుముట్టిన యుద్ధ సైనికుల్లా మరముక్కు ల ఇనుపకొంగలు శవాన్ని పీక్కు తింటున్న రాబందుల్లా రాకాసి కోరల రంపపుచక్రాల యంత్రభూతాలు గుట్టుగా ఉన్న గుట్టను బట్టలూడదీసినట్లు కత్తితో కడుపులో పొడిస్తే పేగులన్నీ బయట పడ్డట్టు అందమైన చందమామగుట్ట ఆసిడు పోసినా ముఖంలా అందవిహీనవిదారక దృశ్యం నా వూరు అందాన్ని చెరిపేసుకుని ప్రపంచదేశాల భవంతుల అందాల్ని ఇనుమడింపజేయడానికి తరలి వెళ్తున్న నా ఎలగందుల శిలారత్నమా మున్నీట మునిగిన వూరోళ్ల నాదుకోవడానికి నడుం కట్టిన గ్రానైటు గండశిలా రాజమా! నిన్ను శిబి చక్రవర్తికి తమ్ముణివనిగాదు అన్నవన్నా తక్కువే !!!!.................... వాధూలస 17/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mDQIFA

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Rammohan Rao Thummuri కవిత

చాలా ఏళ్ల క్రితం ఆంధ్రప్రభ వారపత్రిక రెండవ అట్ట మీదనో,మూడవ అట్ట మీదనో వివేకానందుని కవిత ఒకటి ఇంగ్లీషులో వేశారు. అది నాకు బాగా ఇష్టమయ్యి నాకు తెలిసిన భాషలో అనువదించుకున్నాను. ఇన్ని రోజులూ అది ఎక్కడో కాగితాల్లో కలిసి పోయింది. నిన్న రావెల సోమయ్యగారి పోస్టింగు చదువగానే ఈ కవిత కొరకు వెదికాను. అదృష్టవశాత్తూ దొరికింది. దీని ఆంగ్ల ప్రతి నా దగ్గర లేదు.అనువాదం సవరించుకునే అవకాశం లేదు. కనుక యథా తథంగా చూడండి. దేవుడిచ్చాడు .................... నేను బలం కావాలని అడిగాను నన్ను బలోపేతుణ్ణి చేయడానికి దేవుడిచ్చాడు ఇబ్బందుల్ని నేను తెలివితేటలిమ్మని అడిగాను పరిష్కరించుకొమ్మని దేవుడిచ్చాడు సమస్యల్ని నేను సంపదలిమ్మని అడిగాను పనిచెయ్యడానికి దేవుడిచ్చాడు మెదడునీ కండల్నీ నేను ధైర్యమిమ్మని అడిగాను గట్టెక్కమని దేవుడిచ్చాడు ప్రమాదాల్ని నేను ప్రేమ కావాలని అడిగాను సహాయమందించమని దేవుడిచ్చాడు ఇక్కట్లలో ఉన్న జనాల్ని నేనడిగాను ఉపకారం చెయ్యమని దేవుడిచ్చాడు అవకాశాల్ని నేను కోరుకున్నవేవీ నేను పొందలేదు నాకు కావలసినవన్నీ నేను పొందాను వివేకానందుని ఆంగ్ల మూలానికి స్వేచ్ఛానువాదం 'వాధూలస' dt.4/5/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q2EPwC

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వలు ............ మతం ఇరువైపులా పదునుకత్తే కౄరత త్రుంచుతూ పెంచుతూ మత ప్రవక్తలు వేల ఏండ్లు గడచినా పదవులు కొనసాగిస్తూ 'వాధూలస'23/04/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mx0V5v

Posted by Katta

Rammohan Rao Thummuri కవిత

ఒక భావ తరంగం ................................. చరిత్ర అఘాయిత్యాల అగాధం తవ్వి చూస్తే నెత్తురు పీల్చిన మట్టి పెంకుల సొరంగం చరిత్ర కొందరి అమానుషాల అమానత్ ఒకరి సౌధం కూల్చిన రాళ్లతో మరొకరి దుర్భేద్య దుర్గం చరిత్ర భూగోళం నుండి ఖగోళానికి వేసిన చిక్కుముడి విప్పడానికి యుగాల తరబడి కొనసాగుతున్న యత్నావళి చరిత్ర అభిమతాల విత్తులు చల్లి మతాల మొక్కల్ని పెంచి మనుషుల మధ్య పెంచుతున్న దూరం చరిత్ర కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కలిసి చేసుకున్న ఒడంబడిక మనిషి శిల్పం ఇంకా అసంపూర్ణం 'వాధూలస'23/04/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ppj61y

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వలు ....................... గోడలకు అక్షరాభ్యాస కార్యక్రమం ఐదేళ్ళకోసారి ఇప్పుడంతా అంతర్జాల మహేంద్రజాలం పండితులే పలకల్ని పలుకరిస్తూ వాధూలస 19/04/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4B9jI

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Rammohan Rao Thummuri కవిత

వాకిట్లో వసంతం .............................. ధర్మనిష్ఠ తో రాముడు పదునాలుగేళ్లు పాండవులు పుష్కర కాలమే అరణ్యవాసం చేసింది అస్థిత్వపు ఆరాటంతో అలుపెరుగని పోరాటపటిమతో అరువదేండ్ల జనారణ్యవాసం చేసిన నాలుగున్నరకోట్ల గుండెవాకిళ్లలోకి గెలుపు చప్పుళ్లతో మెరుపు గుప్పిళ్ళతో ఎగజల్లిన గులాలై వలపులా వసంతం దిగివచ్చింది ఎన్నిత్యాగాల పచ్చిమామిడి కాయలు ఉరితాళ్ళు మెడలకు పూల హారాలుగా వేసుకున్నాయో ఎన్ని కలాలు అక్షరాయుధాలయ్యి పోరాటయోధుల పోడిమి వసివాడకుండా నిద్రలేమిని వరించాయో ఎన్ని గళాలు కళాజాతరలుగా నిరవధిక ఉద్యమస్ఫూర్తికి నిరంతరం మోగే యుద్ధ భేరీలయ్యయో ఎన్ని మేధస్సులు చరిత్రపుటలను చెదలు వదలించడానికి తపస్సులు చేశాయో ఆరుదశాబ్దాల తిమిరంతో సమరం వేయి వెలుగుల విజయ విహారమై కోటి గొంతుల జయ జయ నినాదమై నిద్రాణమైయున్న ఆశల ఆశయాల మేల్కొల్పిన కాహళారవమై నిర్ణయాలను నీరుగార్చడానికి పన్నిన కుట్రల కుతంత్రాల శకునుల పన్నాగాలను సైంధవుల శిశుపాలుర ఆగడాలను అరికట్టడానికి ఎన్ని కృష్ణరాయబారాలు జరిగాయో నిన్నటి విజయ విక్రమం నేడు జయ జయధ్వానం కోటిరతనాల వీణా నిక్వాణం వాకిట్లో వసంతవిలాసం చిమ్మచీకట్లో చిరుదివ్వెల చిరుదరహాసం 'వాధూలస' జయ ఉగాది

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN5JW

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

చిలుకలు చేరిన సాయంకాలం ---------------------------------- సాహిత్యాకాశంలోని ఓ చిన్ని మేఘం చిరుజల్లు కురిపించింది భారతకోకిల భాగ్యనగరావాసంలో సదమల సాయంత్ర సమయాన తలవెండ్రుకల్ని తళతళ లాడించే కుంకుడు చెట్టు కింద కూడిన చిలుకల ముచ్చట్లకు ముచ్చట పడిన ప్రపంచ కవిత్వ దినం పసిడి సింహద్వారం లోకి పరుగులు తీస్తూ వచ్చింది ఆత్మీయతానాదం అంతర్లీనంగా ధ్వనించే వాతావరణం ఆరాజేందరనందకిశోరాన్ని అలరించింది పరిణతవాణి పరిచయాలు ప్రఫుల్ల కవితా చంద్రోదయాలు కలంపడుతున్న కలువ మొగ్గలకు ఆశల సౌదామినులయ్యాయి ఆశయాల హరివిల్లులయ్యాయి కొత్త గొంతుల కోయిలల గానం చిత్త శుద్ధి చేసింది చివర చిలుకలు వాలిన చెట్టును చిత్తరువు బంధించింది ---------------------------------------- వాధూలస 22-3-2014 ప్రపంచ కవిత్వ దినోత్సవ సందర్భంగా 'కవిసంగమం'లో ప్రేక్షకుడినై పొందిన అనుభూతి.

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIuVK

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

నిన్నటి వెన్నెల ........................ వెన్నెల లో తడుస్తున్నప్పుడు తన్మయత్వమే తప్ప ధ్యాసేది? తలపులు జ్ఞాపకాల్ని తడిమినప్పుడు వెనుకటి రోజులన్నీ మళ్లీ తెరకెక్కుతాయి అప్పటి అంగి లాగులకు అమాయకత్వమే ఎక్కువ చెప్పులు లేని కాళ్లకు చెట్లూ గుట్టలంటేనే మక్కువ మోకాళ్లమంటి నాగులకుంట నీళ్లల్లో నీరుగట్టెల్ని నిర్లక్ష్యం చేసే తెంపరితనం వీరన్న గుట్ట సందమామ గుట్ట సొనికల్లో సీతాలప్పండ్లకోసంసొట్లు శోధించడం ఎండకాలం పెరండ్లల్ల దిరిగి రేగుచెట్టు దులిపి రేగువండ్లతోటే గూడరామయ్యయో బొమ్మెన కిట్టయ్యయో తిట్లుగూడాదినటం దాగుడుమూతలాడుకుంటూ ఎదురింట్లో పక్కింట్లో గుమ్ములు గరిశెలు ఖరాబుజేసి గడ్డివాములు ఖంగాలి జేసి వాళ్ళవి వీళ్లవి సొడ్లు దినటం గద్దె మీద కస్పనర్సిమ్లు తాత కతలు వినుకుంటు పోద్దుబొయ్యినాంక ఇంట్ల తిడ్తరని బయంబయంగ ఇంటికి జేరి అయినయా తిరుగుళ్ళు అని అక్షింతలు వేయించుకోవడం కంక బద్దల తోటి బాణాలు జేసి పజ్జొన్న బాణప్పుల్లల చివర్ల చింతపండు మైదంబెట్టి బట్టల దుకాన్ల అట్టలుదెచ్చి కత్తిరిచ్చి కిరీటాల్జేసి బొగ్గు మీసాలతో మక్కబూరు గడ్డాలతో రోకలిబబండ గదలతో సైకిలుట్యూబు తోకలతో అరుగులమీద నాటకాలాడిన ఆకతాయితనం రోకలిబండ నడుమ బట్టపేగులో కప్పనుబెట్టి కట్టి బుజంమీద మోసుకుంటూ ఇల్లిల్లూ దిరుక్కుంటూ కప్పతల్లి కప్పతల్లి కడుపు నిండవొయ్ అని పాడుకుంటూ ఇండ్ల ముందర నిలబెట్టి ఆడోళ్లు నెత్తిమీద గుమ్మరించిన నీళ్లకు పెయ్యిమీది బట్టలుదడిసి దగ్గువడిషాలు తెచ్చుకోవటం చిర్రగోనెలాడుకుంటు తుమ్మూరోళ్లింటినుంచి కాసర్ళోళ్లింటిదాకా బజార్లు కొలుచుకుంటూ బలాదూరుదిరగటం సిగిరెడ్డబ్బాలు జమ జేసి పత్తాలు తయారుజేసి పగటిపూట పసులకొట్టంల పత్తాలడటం ఎంగిలి పూలనాట్నుంచి సద్దులదాకా గుమ్మడి పూలకు గునుగు పూలకు తంగెడుపూలకు చెట్టపట్టాలతో చేన్లు చెల్కలు దిర్గటం వెన్నీల రోజులైతే బజారు ఉస్కెల వెన్నీల చన్నీల అనుకుంటూ వెలుగు నీడలతో దోబూచులాడుకోవటం వానకాలం వరదకుకొట్టుకొచ్చిన ఉస్కెల దాసన్నపుల్లలాడటం లేకపోతే బొమ్మరిళ్లుగట్టడం తుమ్మ బొంగరాలు పట్టుడు బొంగరాలు దెచ్చుకుని జాలలు పేనుకుని బొంగరాలాడేటప్పుడు గుండందాటి తిరిగిన బొంగరం మీద బొంగరం ములికితో పోట్లు పొడవటం గడ్డపోణి దుకాన్ల కొనుక్కొచ్చిన గోలీలతో జేబులు నింపుకుని బొటనవేలు నేలకానించి మధ్యవేలుతో గోలికి సూటివెట్టి గోలీతో కొట్టడం అప్పటి ఆటలే వేరు ఆ రోజులే వేరు అప్పటి దోస్తులందరూ ఇప్పుడు ఎక్కడ మనుమలతో మనుమరాళ్లతో ఆడుకుంటున్నరో అది కరువైనవాళ్లు జీవితాలు బరువైనవాళ్లు నిన్నటి వెన్నెల ఎక్కిళ్లతో ఎరుపెక్కిన చెక్కిళ్లతో కార్చలేని కన్నీళ్ళతో కడ వైపు చూస్తున్నరో.... వాధూలస 15/3/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m5SDUr

Posted by Katta

3, మార్చి 2014, సోమవారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వ కలం వాడిపోతున్నది వేలు వేలుపెట్టినప్పట్నుంచీ 3.3.14 'వాధూలస'

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVIssY

Posted by Katta

28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Rammohan Rao Thummuri కవిత

రుబాయి సముద్రానికి తెలుసు చేపల నెలా పోషించాలో సముద్రానికి తెలుసు నావలెలా నడిపించాలో ప్రపంచంలోని ఉప్పదనమంతా సహిస్తున్నా సముద్రానికి తెలుసు ముత్యాలెలా సృష్టించాలో 28/2/14 వాధూలస

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eGv9fJ

Posted by Katta

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Rammohan Rao Thummuri కవిత

మువ్వ మెరిసే రాగి పళ్ళెం ఆకసం గోడ చేరువగా పొద్దువాలుతుం దిప్పుడే 16/2/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eEMsgW

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Rammohan Rao Thummuri కవిత

నా కిలా అన్పించింది .............................. కనులకు విన్పింపచేసేది కర్ణాలకు చూపించేది నీది కాని అనుభవాన్ని నీ గుండెలకు తాకించేది నీకు నిన్నే కొత్తగా చూపించేది కవిత్వంగా నిలుస్తూ ......... ..................................... వాధూలస 7/1/14

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g6Mf9d

Posted by Katta

6, ఫిబ్రవరి 2014, గురువారం

Rammohan Rao Thummuri కవిత

........ప్చ్ ............................................. భక్తి ఛానెళ్లయి ప్రవహిస్తున్నా భక్తులు కరువౌతున్న కాలం సంబరాలు అంబరాలనంటుతున్నా సంతోషం దిక్కులు చూస్తున్నకాలం విజ్ఞానం ఒడిలోబొంగరంలా తిరుగుతున్నా వికాసం వెలవెల బోతున్న కాలం ఉద్యమాలు ఊపిరి సలపనియ్యక పోయినా ఉద్దేశ్యాలు ఉట్టికెక్కుతున్న కాలం దృశ్య మాధ్యమాల దృక్పథాలేవైనా దుష్ట సంప్రదాయాలు దృగ్గోచరమవుతున్న కాలం నూరు దోసిళ్ళ కాసులకు మూడు దోసిళ్ళు చదువులమ్ముతున్న కాలం నాయకులు కురిపించే కారుణ్య వర్షాలకు తలమునకలై కర్షకులు తలలు వేలాడేస్తున్న కాలం డబ్బు చేరితే చాలు పబ్బాలన్నీ పబ్బులకూ క్లబ్బులకూ పరుగులు తీసే కాలం పడగొడితేనే నిలబడగలమనుకున్న పదవులు బేరసారాల పందేరాలు పెడుతున్న కాలం రాని ఉద్యోగాలు ఉత్తర దక్షిణాయనాల చుట్టు వచ్చిన ఉద్యోగాలు బాధ్యతలక్కరలేని హక్కుల చుట్టూ చక్కర్లు కొడుతున్న కాలం దబ్బూ దస్కం లేకుండా దగ్గుపడిశం తెచ్చుకున్నందుకు జబ్బు నిన్ను నడి బజార్లో నిలదీసే కాలం కుంభమేళాలు జరిగినా పుణ్య నదులకు పుష్కరాలొచ్చినా అధినాయకుల సంకల్పాలు జపిస్తూ ఆత్మగౌరవ పిండ ప్రదానాలకు అనువౌతున్న కాలం సంతోష సంతాప సందేశాలకు సొల్లు వాగుళ్ళకు సెల్లు గిల్లే మానవ సంబంధాల కాలం నిన్ను నువ్వు పాతేసుకోడానికి నిజాయితీ గొయ్యి తీసే కాలం ఏమంటే ?ష్ ! ....ఇది కలికాలం...ప్చ్....

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhBplO

Posted by Katta