పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మార్చి 2014, శనివారం

Ramakrishna Kalvakunta కవిత

అ"మంగళుడు" పొద్దున్నే చన్నీటి తలస్నానం చేసినా..అతడు నిత్య అమంగళుడే! ముట్టుకున్న వారంతా కులం మురికిని ఒక స్నానంతో కడిగేసుకుంటారు గుబురుగడ్డాలపొదల్ని నునుపుగా చెక్కే శిల్పి అతడు చేతిలో కత్తి వున్నా...బతుకుతో తప్ప పోరాటం చేయని యోధుడతడు కాలిగోర్లు ,చంక వెంట్రుకల మాలిన్యా న్ని ప్రక్షాళించే "పవిత్ర గంగ" అతడు .. నీ చింపిరి తల అరణ్యాన్ని క్రాఫ్ పార్క్ లా తీర్చి దిద్దే డి జై నర్! ఎక్కడైనా అతని పిలుపొక్కటే "మంగలోడా" అని , అవును !అతడు మంగలుడే,.... నీకు నిత్యం మంగళం కలిగేందుకు నీ మురికిని నరికి సుందర వేషాన్నివేసి మార్కెట్లోకి పంపినందుకు .... అతడు అమంగళుడే ! కత్తి మొండిదైనా మనుషుల కన్నా నయమే, తనకాళ్లమీద తానెలా నిలబడాలో చెప్పే కొత్త చూపు అతడు ! క్రీములెన్నిటితో తడిపినా మొద్దుబారిన క్రిమి ముఖాలు మెత్తబ డవు ... పురాతన దుర్గంధాల్ని ఇంకా మోస్తూనే .... తలపట్టి ఒళ్ళంతా హూనమయ్యేలా సేవ చేసేది తరాల కులవిద్య మీదే ! ఎందరి ముఖాలకో పున్నమి వెన్నెలలు అద్దినా , అతని జీవితమంతా అమావాస్యలే ! యంత్రం గా మారి, కత్తి గాట్ల గాయాల జీవితంపై ఏ ముఖమూ సానుభూతిని వర్షించదు నగిషీలకు అలవాటైన ముఖాలు ఛీ కొడతాయి ... అతని నిస్సహాయతకు దువ్వెన నవ్వుతుంటే కత్తి కర్తవ్యా న్ని గుర్తు చేస్తుంటే ....చావుకైనా ,మంచికైనా ముందుండే మండే దివిటీగా .. .అందరి పెళ్లిళ్లలో మోగే మంగళ వాద్యమై ..... నడిపిస్తున్నా ... అతడింకా... "అమంగళు డేనా? -డా . కలువకుంట రామకృష్ణ e

by Ramakrishna Kalvakunta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUhfb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి