కత్తిమండ ప్రతాప్ || నేను సైతం || ======================== మట్టి నెర్రల మధ్య దాగున్న ఆనవాళ్ళు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి గత గాయాల చరిత్ర పునరావృతమై శిధిలాలు జ్ఞాపకాల్లోనుండి బయలుపడుతున్నాయి గుండె గాయాలు పచ్చి పుండ్లై లేపనం కోసం చూస్తున్నాయి ఎప్పుడో చెప్పిన (చదివిన ) పోరాటాలు ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి నరాల్లో రక్తం వేడెక్కింది గుండెలను పిండేస్తుంది ఉడికి(కె )నెత్తురు మెదడులో ఆలోచనల అగ్నిగోళం పేలుతుంది ఆవేశం లావాల ప్రవహించినా నేనింకా నెర్రల మధ్యే ఇరుక్కుపోయాను గొంతు పెగలని ఆవేశం బిగపట్టుకున్న ఆలోచనలు అణచి వేసే నీ చేతుల సాక్షిగా నా చుట్టూ బిగుసుకుంటున్నాయి ఆరుబయట పిల్లలు ఆడుకొంటున్నారు బొమ్మ తుపాకీలతో ... ఏదో రోజు నేను సైతం అంటూ నీ(పోరాటాల) బాటలో పయనించేందుకు ... --------------------------------------------- మార్చి 22/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJWRh
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJWRh
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి