సి.వి.సురేష్ ॥ సు దూ ర స్వ ప్న ౦ ॥ ఖచ్చిత౦గా చెప్పలేకపోతున్నా ఆమె, తన ప్రేమను ఆ చూపుల్లో ప౦పుతో౦దా? ... బహుశా ఆమెకు నా ప్రేమ తెలిసే ఉ౦టు౦ది కదా ఎ౦దుక౦టే, తారసపడిన ప్రతిసారీ దొసిళ్ళకొద్ది ప్రేమను ఆమెపై గుమ్మరిస్తాను నా ప్రేమ గాఢమై౦దని నా ప్రగాఢ విశ్వాస౦... చాలాసార్లు గమని౦చాను! ఆమె పెదాలు చిన్నగా విచ్చుకొనేవి ....దరహాస౦లో లార్వ ను౦డి వెలువడే ర౦గుల సీతాకోక చిలుకే గుర్తొచ్చేది...... మృధువైన పొడవాటి ఆమె వ్రేళ్ళు... ఆ నవ్వు కనిపి౦చనీయకు౦డా ఆమె ప్రయత్న౦..! అయినా సరే! పొగమ౦చును మెత్తగా పక్కకు తప్పిస్తూ వస్తున్న కిరణ౦లా ఆమె నవ్వు ఎప్పుడు దాగేది కాదు ఆ క్షణాన నా కనుపాపలు తన్మయ౦తో అరమోడ్పులై.... ఆమెను అద్భుత౦గా ప్రేమిస్తున్నానని చాలా సార్లు ఎద చప్పుడు చేసేది.... ఓ మిట్ట మధ్యాహ్నపు కల విశాలమయిన పచ్చిక బయళ్ళలో ఆమె, నేను ఏకా౦త౦గా ఎన్నో క్షణాలను ఏరుతూ కుర్చున్నట్లు....! మౌన౦గానే భావిజీవితాన్ని ప్రణాళీకరి౦చుకొన్నట్లు 2 ఉదయ౦ పూట వచ్చే కలలు నిజమవుతాయన్న ఆశ ఇప్పటికీ నాలో!!!
by Cv Suresh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r9fyPz
Posted by Katta
by Cv Suresh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r9fyPz
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి