పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sana Chittaluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sana Chittaluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మార్చి 2014, బుధవారం

Sana Chittaluri కవిత

'చిత్తలూరీలూ మనసులో వుంటరు, మాటల్లోకి రారు. చూపుల్లో వుంటరు, కల్లల్లో ప్రతిబింబమై మెరవరు. ఊపిరిలో వుంటరు, చిరుగాలై తాకరు. మన గుండె గదుల్లో మౌనంగా తిరిగే సీతాకోక చిలుకలు కొందరు...! చిత్తలూరి 9603254546

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHjkKH

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

Sana Chittaluri కవిత

చిత్తలూరీలు మీ కట్టుబాట్ల ఇనుప గొలుసులు వేసి పూల చెట్లను లాగకండి విస్తరించే పరిమళాన్ని బంధించటం మీవళ్ళేమవుతుంది. మీ అజమాయిషీల చేతులు చాచి కోయిలల కంఠాలను నొక్కకండి నినదించే ధిక్కార స్వరాన్ని ఆపటం మీ వళ్ళేమవుతుంది. ** ** ** వంటింటి కుందేళ్ళు పాత పాట. పులులు కూడా వంట చేస్తాయి... రుచులు పోయే అమ్రుత హస్తాలు అవసరమైతే పంజా విసురుతాయి.. కొత్త మాట. ** *** ** నా పద్యాలేమైనా పావురాలా ఎగరేసిన చోటికే మళ్ళీ తిరిగి రావటానికి.. అవి పాడుతూ పడుతూ వెళ్ళి ఏ తోటలోనో తప్పిపోయిన కోయిలలు. చిత్తలూరి 9912346673

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWECVm

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Sana Chittaluri కవిత

చిత్తలూరీలు నేను చేసిన డిగ్రీలన్నీ నా రెక్కల మీద చుక్కల అలంకరణలయ్యాయి నేనున్న గది మాత్రమే నేనెగిరే చోటయింది అతనికెప్పుడూ నేనో రంగుల సీతాకోక చిలుకనే నా స్వేచ్చా స్వాతంత్ర్యాలంటే అతనికెప్పుడూ చులకనే పెళ్ళంటే ఒకరి స్వేచ్చను మరొకరు హరించడం కాదని అతనికెలా చెప్పేది... చిత్తలూరి 220314

by Sana Chittaluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNUgaX

Posted by Katta