గుబ్బల శ్రీనివాస్ || నువ్వు - వాడు || ------------------ నువ్వు నవ్వుతుంటావు మల్లెపువ్వై .. మంచు బింధువై .. వాడు పగలుబూనుతుంటాడు నీ లాలిత్వాన్ని నలిపేసి ..సున్నితత్వాన్ని చిదిమేసే రాక్షసుడిలా .. వాడి జన్మకు నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటావు వాడు నీకు పునర్జన్మే లేకుండా తలుస్తున్నాడు భూదేవంత వోర్పు నువ్వు పంచుతున్నావు నీ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నాడు భూమాతపై వాడు క్షమాగుణం నీ సహజ లక్షణం అంటున్నావు పశువై ఉరుకుతున్నాడు కసాయితనానికి చిరునామాగా వాడు కన్నీళ్లను నువ్వు దాచుకుని ప్రేమ బాహువులు అందిస్తున్నావు కనికరం వాడు మరచి నుదిటి రాతలు తిరగరాస్తున్నాడు నీ నిదురలోనూ ప్రేమతో నిండి ఉంటావు వాడు కలలోనూ విషం కక్కుతుంటాడు అగ్నిపరీక్షలు సహించి అభినవ సీతవు నువ్వవుతున్నావు అణువణువునా అనుమానం నింపుకుని మృగం వాడవుతున్నాడు ! (22-03-2014)
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQEsv
Posted by Katta
by Gubbala Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pkQEsv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి