పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, మార్చి 2014, శనివారం

Rammohan Rao Thummuri కవిత

చిలుకలు చేరిన సాయంకాలం ---------------------------------- సాహిత్యాకాశంలోని ఓ చిన్ని మేఘం చిరుజల్లు కురిపించింది భారతకోకిల భాగ్యనగరావాసంలో సదమల సాయంత్ర సమయాన తలవెండ్రుకల్ని తళతళ లాడించే కుంకుడు చెట్టు కింద కూడిన చిలుకల ముచ్చట్లకు ముచ్చట పడిన ప్రపంచ కవిత్వ దినం పసిడి సింహద్వారం లోకి పరుగులు తీస్తూ వచ్చింది ఆత్మీయతానాదం అంతర్లీనంగా ధ్వనించే వాతావరణం ఆరాజేందరనందకిశోరాన్ని అలరించింది పరిణతవాణి పరిచయాలు ప్రఫుల్ల కవితా చంద్రోదయాలు కలంపడుతున్న కలువ మొగ్గలకు ఆశల సౌదామినులయ్యాయి ఆశయాల హరివిల్లులయ్యాయి కొత్త గొంతుల కోయిలల గానం చిత్త శుద్ధి చేసింది చివర చిలుకలు వాలిన చెట్టును చిత్తరువు బంధించింది ---------------------------------------- వాధూలస 22-3-2014 ప్రపంచ కవిత్వ దినోత్సవ సందర్భంగా 'కవిసంగమం'లో ప్రేక్షకుడినై పొందిన అనుభూతి.

by Rammohan Rao Thummuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hRIuVK

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి