ఈ రోజు ఒక ప్రముఖ కవి పుట్టినరోజు ఆయనే Billy Collins (DOB: March 22, 1941) American http://ift.tt/1gbMUsJ Source: http://ift.tt/1f2ArU1 వారిదే ఒక కవిత ఇక్కడ:....................................... ఒక్కోసారి వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉంటాయి సన్నని నల్లటి చేవ్రాలులో… ప్రతి పేజీ మార్జిన్లోనూ చెల్లాచెదరుగా కోపంతో రచయితమీద వ్యతిరేకంగా. “నా చేతికిగాని దొరికితే, Kierkegaard ! Conor Cruise O’Brien! తలుపు గడియపెట్టి మీ తలలోకి కాస్తతర్కం ఎక్కేలా చేస్తాను,” అన్నట్టు ఉంటాయి. కొన్ని వ్యాఖ్యలు మాత్రం అప్పటికప్పుడు వ్రాసినవి “అర్థం పర్థంలేదు,” అంటూ తీసిపారేసే రకమో, “ప్లీజ్”, “హ్హహ్హహ్హా” అని రాసే రకమో అన్నమాట. నాకు బాగా గుర్తు, ఓ సారి పుస్తకం చదువుతూ… అది “A Life of Emily Dickinson” … తలపైకెత్తి, బొటనవేలు బుక్ మార్క్ లా పెట్టి పేరాకి పక్కనే “మరీ మూర్ఖంగా రాయకు” అని వ్యాఖ్యరాసిన వ్యక్తి ఎలా ఉంటాడా అని ఊహించడం. పేజీ మార్జిన్ల సైకతతీరాల్లో తమ పదముద్రల్ని చెల్లాచెదరుగా విడిచే విద్యార్థులు కొంచెం హద్దుల్లోనే ఉంటారు. ఒకరు “Eliot”కవితపక్కన”రూపకాలంకారం” అని గెలికితే; ఇంకొకరు, జొనాథన్ స్విఫ్ట్ “A Modest Proposal” కి పేరా పక్కన యాభైసార్లు “వక్రోక్తి” అని రాస్తారు. లేదా వాళ్ళు క్రీడామైదానాల్లో గేలరీలోంచి అరిచే అభిమానుల్లా మూతికి అడ్డంగా రెండుచేతులూ పెట్టి Duns Scotus కీ, James Baldwin కీ “తిరుగులేదు” అని అరుస్తుంటారు. “వావ్!” “ఏం రాసేవు గురూ” అనో, “ఏం గురి” అనో అంటుంటారు. పక్కన తుఫానులా వర్షించే టిక్కులకీ, నక్షత్రాలకీ, ఆశ్చర్యార్థకాలకీ లెక్కే ఉండదు. “మనిషికీ ప్రకృతికీ మధ్య సంఘర్షణ” అని మార్జిన్లో రాయకుండాగనక కాలేజీ నుండి పట్టభద్రులైతే, బహుశా ఇప్పుడు ఒక అడుగు ముందెయ్యడానికి ఇది సరైన సమయం. మనందరం కూడా ఆ తెల్లని చుట్టుకొలతని ఆక్రమించినవాళ్ళమే చేతికుర్చీలో కూర్చుని కాలక్షేపానికి పేజీలుతిరగేస్తున్నామని అనిపించుకోకుండా పెన్ను కోసం తడుముకున్న వాళ్ళమే. దారిపక్కన ఒక ఆలోచనా ముద్రని వేసిన వాళ్లమే ఒక అభిప్రాయాన్ని అంచున అంటుగట్టిన వాళ్లమే. చివరికి ఐరిష్ సన్యాసులుకూడా తమ చీకటి గ్రంధాలయాల్లో క్రీస్తు జీవిత సువార్త పేజీల అంచుల్లో వెలిబుచ్చేరు నకళ్ళువ్రాయడంలో తమబాధల్ని క్లుప్తంగా వ్యాఖ్యలుగా, ఒక పిట్ట తమకిటికీ దగ్గర చేస్తున్న సంజ్ఞలు గురించో, లేక తాము చదువుతున్న పేజీ మీదపడుతున్న ఎండగురించో రాస్తూ… అజ్ఞాత వ్యక్తులు భవిష్యద్యానం చేస్తున్నారు తమజీవితాల్ని దాటి మనగల వాహక నౌకలో William Blake అతనిమీద రాసిన తీవ్రమైన విమర్శ చదివే వరకూ, Joshua Reynolds ని మీరు చదివినట్టే కాదని కొందరంటారు. వీటన్నిటికంటే ఎక్కువగా మనసులో మెదిలేది లాకెట్టులా నా ఆలోచనల్లో వేలాడేదీ నెమ్మదిగా వేడేక్కుతున్న ఒక వేసవిరోజున స్థానిక గ్రంధాలయంలోంచి ఎరువుతెచ్చుకున్న “Catcher in the Rye” పుస్తకంలోని వ్యాఖ్య. నేనింకా అప్పుడే ప్రౌఢవిద్యలోకి అడుగుపెడుతున్నా మా తల్లిదండ్రులగదిలో సోఫాలో కూచుని పుస్తకం చదివే రోజులు; ఒక పేజీ మీద ఆ వ్యాఖ్య కనిపించినపుడు ఒక్కసారిగా నా ఒంటరితనం ఎంతలోతుగా అనిపించిందో నా కళ్ళముందు ప్రపంచం ఒక్కసారిగా ఎంత విశాలమూ, ఎంత తీపుగానూ అయిందో మీకు చెప్పలేను. కొన్ని జిడ్డు జిడ్డు మరకల తర్వాత చక్కని దస్తూరీలో పెన్సిలుతో ఇలా రాసి ఉంది- అది నే జీవితంలో కలుసుకోలేని ఒక అందమైన అమ్మాయిదని ఖచ్చితంగా చెప్పగలను- “ఈ ఎగ్ సలాడ్ మరకలకి క్షమాపణలు. ఏం చెయ్యను, నేనిపుడు ప్రేమలో పడ్డాను.” . బిల్లీ కాలిన్స్ అమెరికను కవి. . ఈ కవితలోని సౌందర్యం దాని విశ్వజనీనతలో ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు వైయక్తిక అనుభవాన్ని సార్వజనీనము చెయ్యడంలోనూ, సార్వజనీన అనుభవాన్ని వైయక్తికం చెయ్యడంలోనే కవి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. కాలేజీ మెట్లెక్కడంగాని, లైబ్రరీకెళ్ళి పుస్తకం చదవడం అలవాటున్న వాళ్లకి గాని ఈ విషయం స్వానుభవంలోనిదే. పుస్తకాల మార్జిన్లలో … పజిల్సు, కనుక్కో చూద్దాం, వ్యాఖ్యలూ, బొమ్మలు, ఒకటేమిటి … కాలక్షేపం నుండి, సీరియస్ గా చదువుకుని రాబోయే పఠితలకి సులభం చేద్దామన్న తపనతో రాసే రాతలదాకా అన్ని రకాలూ చూసి ఉంటాము. ఈ కవితలో కొసమెరుపు… దాని ప్రత్యేకత. . Marginalia . Sometimes the notes are ferocious, Skirmishes against the author Raging along the borders of every page In tiny black script. If I could just get my hands on you, Kierkegaard, or Conor Cruise O'Brien, They seem to say, I would bolt the door and beat some logic into your head. Other comments are more offhand, dismissive - "Nonsense." "Please!" "HA!!" - That kind of thing. I remember once looking up from my reading, My thumb as a bookmark, Trying to imagine what the person must look like Who wrote "Don't be a ninny" Alongside a paragraph in The Life of Emily Dickinson. Students are more modest Needing to leave only their splayed footprints Along the shore of the page. One scrawls "Metaphor" next to a stanza of Eliot's. Another notes the presence of "Irony" Fifty times outside the paragraphs of A Modest Proposal. Or they are fans who cheer from the empty bleachers, Hands cupped around their mouths. "Absolutely," they shout To Duns Scotus and James Baldwin. "Yes." "Bull's-eye." "My man!" Check marks, asterisks, and exclamation points Rain down along the sidelines. And if you have managed to graduate from college Without ever having written "Man vs. Nature" In a margin, perhaps now Is the time to take one step forward. We have all seized the white perimeter as our own And reached for a pen if only to show We did not just laze in an armchair turning pages; We pressed a thought into the wayside, Planted an impression along the verge. Even Irish monks in their cold scriptoria Jotted along the borders of the Gospels Brief asides about the pains of copying, A bird signing near their window, Or the sunlight that illuminated their page- Anonymous men catching a ride into the future On a vessel more lasting than themselves. And you have not read Joshua Reynolds, They say, until you have read him Enwreathed with Blake's furious scribbling. Yet the one I think of most often, The one that dangles from me like a locket, Was written in the copy of Catcher in the Rye I borrowed from the local library One slow, hot summer. I was just beginning high school then, Reading books on a davenport in my parents' living room, And I cannot tell you How vastly my loneliness was deepened, How poignant and amplified the world before me seemed, When I found on one page A few greasy looking smears And next to them, written in soft pencil- By a beautiful girl, I could tell, Whom I would never meet- "Pardon the egg salad stains, but I'm in love." .
by Yasaswi Sateesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbMUsJ
Posted by Katta
by Yasaswi Sateesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbMUsJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి