పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Vakkalanka Vaseera కవిత

తీపి ఏకంగా తీయని గోళాన్నే ధరించి ఓ చిన్ని గింజ ద్రాక్ష పండులో కూర్చుంది కాంతి సంవత్సరాలకు ఆవలినుండి ద్రాక్షపండు హృదయంలోకి ఏ తీయదనం ప్రవహించిందో? ఏ తీయని స్పర్శకి ఆకుపచ్చని తీగల్లో జలతరంగిణి మోగి తీయని సంగీతం పండంతా నిండిపోయిందో ఏ తీయదనం వల్ల పండు తన గుండెల్లో గింజని దాచుకుందో? పర్వతాలు నదులు సముద్రాలతో వెలుగు చీకట్ల దోబూచుల్లో వాయుదారాల కల్నేతలో దిగంబరాలను అలకరించుకున్న భూగోళం బహుశ భూగోళం అట్టడుగు మట్టంలోని ఓ సరస్సులోపల కూడా ఓ బీజం ఎక్కడో మహాకాశంలో మండే మహాగోళం నుంచి తీయదనం కాంతిగా మారిపోయి కాంతిసంవత్సరలను దాటుకుంటూ నీటిలోకి సైతం దూకి అట్టడుగున ఉన్న బీజాన్ని ముద్దాడటం ఏ తీయదనం? నీటిలోని కాంతి నిర్మల సౌందర్యమై ఆకుపచ్చని అరచేతులు విప్పి హృదయ కమలమై అరవిచ్చి ఆకాశాన్ని ఆహ్వానించడం ఏ తీయదనపు మహాత్యం అన్నిటి కంటే తీయనిది కడుపు తీపి ఆ తీపి అమ్మచూపులో ప్రసరిస్తుంది ఆ తీపి అమ్మ స్పర్శలో ప్రసరిస్తుంది ఆ తీపే కమలాసనం మీద తేనె సరస్సులో రెక్కలల్లార్చుతూ వాలిన నక్షత్ర సంగీతం నుండి కూడా ప్రసరించేది ఎందుకో? ఎందుకో? ఎందుకో ? ఎవరి నిష్కారణ అవ్యాజ కరుణ వల్లనో!!! -----------వసీరా

by Vakkalanka Vaseera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m68KBl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి