ఏది మంచి? ************* కలలు కల్లలైన నాడు మనిషిగా బ్రతకడం కష్టం మనసు రక్కసుగా మారి కార్చిచ్చులాగా మనుగడను దహియిస్తుంది అందులో మండే గుండెలెన్నో ! కనికరం లేని కసాయి కడతేర్చిన ప్రాణాలెన్నో? కాల గమనంలో మనిషి మంచివాడు అందుకేనేమో మనిషి చెడ్డవాడు ! మంచి ఉన్నచోటే చెడు ఉండాలి లేకుంటె రెండూ ఒక్కటేగా ! మానవ చరిత్రలో చెడుపై మంచి గెలుపు అది కేవలం పుస్తకాలలో కొన్ని పేజీలు మాత్రమే ! చేడు గెలవందే రాజ్యాలు కూలాయా ? చేడు గెలవందే తలలు తెగాయా ? మంచి చెడులకి తేడాలేదు అది కేవలం మనిషి స్వార్ధం మీదే ఆధారం అది కేవలం మనిషి ఈర్ష మీదే ఆధారం ! ఇది మంచి అని ఏదీ నిర్వచనం ? ఇది చెడు అని ఎక్కడ శాసనం ? రెంటికీ సమాధానం ఉంటే చెడు లేని మనసులేన్ని ఈ మానవ కూపంలో ? చెడు చెంతకు ఆరాటం దేనికి ? మనిషికేమి రోగం ఒక వైపే ఉండొచ్చుగా ? దేవతలు రాక్షసులు ఎవరు మంచి వారు ? ఒకరికి హాని చెయ్యనివారు మంచివారు, దేవతలు చెడ్డవారు రాక్షసులు అంటారు మరి మానవులు ఎలాంటి వారు ? చెడ్డవాళ్ళు ముమ్మాటికి చెడ్డవాళ్ళు పువ్వుపై కనిపించే తేనెటీగను చూసి మురిసిపోతాం తేనెటీగ పోగేసిన తేనెను తస్కరిస్తాం ....మనం రాక్షసులం కాయలు పండ్లను మురిపాన కని పెంచిన ఎన్నో తల్లులను పిల్లను ఎడబాపే మనం రాక్షసులం ... నిజంగా రక్కసులం దూడల మూతులగట్టి కడుపులగొట్టి ఆవుల కన్నీరును ఒమ్పుతాం దూడల తిత్తుల ఆశపెట్టి బర్రెల గోసల ముడుపుగడతాం....మనం అసురులం పక్షులను జంతువులను బందీలను జేసి బానిస బ్రతుకుకు భద్రత లేదని చిందులేస్తాం ...మనది సిగ్గులేని జన్మ ... మనం రాక్షసులం కృష్ణ మణి I 15-03-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIOYs4
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fIOYs4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి