పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sree Kavitha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sree Kavitha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Sree Kavitha కవిత

'' మనసంతా నువ్వే''లో నన్ను త్రుతియ విజేతగా నిలిపిన నా ''కవితా సుమం '' ------------- ********** -------------- 'శ్రీకవిత' ||'జయ'కేతనాల ఉగాది || (ఉగాది కవితల పోటీకి) ఆకులు రాల్చి మోడు వార్చిన శిశిర ఋతువు చిద్విలాసాలున్న విజయ నామ సంవత్సరం ఆఖరి అంకానికి చిరునవ్వుల వీడ్కోలు కాల చక్రంలో నీ 'విజయ ' 'ఆపజయాలు ' చిరస్మరణీయం ఉద్వేగ భరితం రసరమ్య రాగ భరితం నీతో గడిపిన క్షణాలు మనోహరం ఆ మధురస్మృతులతో మమేకమై ముందుకు వెళ్తూ... మరో నూతనానికి "నీరీక్షణాలు"..!! నీరీక్షణాలకు చరమగీతం పలుకుతూ చైత్ర మాస శుక్ల పక్షం శుభారంభం మోడువారిన జీవకోటిని వర్షించి హర్షించుటకై వసంత ఋతువు ఆగమనం ఆశయాల చెట్టను చిగురింప జేసే ఘడియ చైత్ర శుద్ధ పాడ్యమి బ్రహ్మ దేవుడి సృష్టికి చక్కని ముహూర్త గడియ 'యుగ్ ''ఆది "ఉగాది".ఆ పర్వదినాన నూతనానికి నాంధి పలకమంటూ ఆభయమిస్తున్న "జయనామ సంవత్సరానికి " !!స్వాగతం సుస్వాతం!! ఆ శుభవేళ అరుణకిరణాల విభావరిలో ఆశల ఉత్తేజంతో తేజం సరిచేసుకొని జయంకోరే వారికి జీవితం షడ్రుచుల సమ్మిళితం, రాగద్వేషాల రసరమ్యమని తెలిపేందుకు వేపపువ్వుతో చేదు అనుభవాల దుఃఖాన్ని,భెల్లంతో మధురమైన తీపిగుర్తులను, పచ్చిమిరపకాయల కారంతో కోపాన్ని, ఉప్పుతో భయాన్ని, చింతపండుతో చిరాకుని లేతమామిడితో ఆశ్చర్యాన్ని మిశ్రమం చేసి ఆరగించమనే మధుర ఫలహారం "ఉగాది పచ్చడి" ...!! ఆరుణోదయాన శతమానం భవతి అంటూ శథగోపునికి శిరసావహించి మనోవాంఛ ఫలసిద్ధికై వేదోపనిషత్తులు ఆవిఘ్నం కోసం విఘ్నేశ్వరుఁడి ముందు గుంజిళ్లు, సాష్టాంగ ప్రణామాలు, పూజారుల ఆశీర్వచనాలు కాలచక్రంలో గ్రహాల గమనాన్ని గుణించి బేరీజు వేసుకొని అనుగ్రహం పొందటానికి అనువైన తిథి,వార,నక్షత్ర,యోగ,కారణ కూడిన రాశి ఫలాల శుభగడియలు పన్నెండు మాసాల ఆణుకువలు మెళకువలు విపులంగా తెలుసుకొనేలా సంపుటించిన పుస్తకాన్ని కర్తవ్యంగా ఆలకించడమే "పంచాంగ శ్రవణం"...!! ముంగిలిలో ముగ్గులా, షడ్రుచుల మృస్టాన్నభోజనంలా ,ఆమని కోయిలలా వచ్చింది ఉగాది మళ్ళీ పన్నెండు మాసాల బంధంతో మావి చిగురుల హరితవర్ణంతో భవితల బాంధవ్యాల వేడుకై నటనకు నందులు, కవులకు సన్మానాలు, సాహితీ సేవకు సముచిత పురస్కారాలు మళ్ళీ మొదలు కమ్మని వంటల ఘుమఘుమలు,కొత్త ఆల్లుళ్ళకు కానుకల దీవెనలు మన సాంప్రదాయాలు ప్రపంచ తెలుగు వారందరికి జయనామ సంవత్సరంలో హర్షాతి జయకేతనాలు అందాలని ప్రార్ధిస్తూ ఉగాది శుభాభినందనలు

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Oa5ENM

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Sree Kavitha కవిత

||తీపి కీబోర్డే - తీపి చాక్లెట్ ని తలపిస్తూ సేం ఫీలింగ్|| @ 'శ్రీకవిత' శుభొధయం తీపి మధురం చెసెను తీపి అదరం తీపి మధురం పూరించేను ఖాలి ఉదరం తీపిగా పిలిసే పలుకుల ఉలుకులు కలిగించేను తీపి ఊసుల కులుకుల మనొహరాల ఉల్లాసం తీపి పదిలం కలిగించె అనుభూతులు అమరం తీపి మ్రుధులాలతో మెధలాడె స్ర్ముతులు స్వాలంభనం తీపి చాక్లెట్ కోకో గింజల రంగరింపులతో పొంధె గోధుమ వర్ణం తీపి చాక్లెట్ రూపు రెఖల సున్నితాలు వెర్పరిచేను నొరూరించె సాంగత్యం తీపి రాసాలు కలిగించేను లలాజలాల రసరమ్య భంధం తీపి రాసాల అనుబంధం విడదీయలేని అనుసంధానం తీగలేని కీబోర్డ్ తలపించేను కవరులేని బోసి చాక్లెట్ ఆ కీబోర్డ్ ని తాకినా మీటినా పంపే ఆక్షరాల పధాలు హ్రుధయమనే మదర్ బోర్డ్ కి మెలవింఛె శ్రుతిలయలు అవి మధి తలపులు అనే మానిటరు కిచ్చె పరవశాల సందేశాలు ఆ సందేశాల ఆదేశాలు పుచ్చుకున్నా ఇచ్చుకున్నా కలిగేధి !!సేం ఫీలింగ్!! వప్పుకుంటారా..?? ....

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Q9XJSJ

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

Sree Kavitha కవిత

శ్రీ కవిత ॥ ఏమని వర్ణించను ॥ 23.04. 2013 పచ్చని ప్రకృతి వడిలొ సెలయేటి నుంచి వీస్తున్న చల్లని పైరగాలి శబ్దం వేణుగానమై వినిపిస్తుంటే కోకిలలు మన కలయికు శ్రుతి కలపగా నా హృదయమంజరివైన నీతో మనసువిప్పి మట్లడాలనుకోంటున్న సమయంలో నీ గురుంచి చెప్పమంటే ఏమని చెప్పను ..!! తెల్లని పద్మం లాంటి నీ ముఖము చూసి చక్కని చెలిమికి, పవిత్రతకు చిహ్నం అని చెప్పనా .?? నీ నుదుట గల ఎర్రని బొట్టు చూసి శ్రమించి ఉన్నత శిఖరాలను అందుకోగలవని చెప్పనా...?? నీలిరంగు గల నీ "అక్షులు" చూసి విశాలమైన నీ హృదయమునకు ప్రతీక అని చెప్పనా ..?? పసుపు పచ్చని నీ శరీర వర్చస్సు చూసి నీతో, నీవారికి శుభములు కల్గునని చెప్పనా..?? లేత ఆరంజ్ రంగుగల నీ చీర చూసి కష్టాలలో, త్యాగానికి గుర్తు అని చెప్పనా....?? ఆకుపచ్చని రంగుగల నీ చేతి గాజులు చూసి నీ ఇల్లు సిరిసంపదలకు ఆలవాలమని చెప్పనా పింక్ రంగుగల నీ పాద పద్మంలు చూసి నీ సున్నిత వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్పనా..?? లలిత కళలతో, అపూర్వ మెధాశక్తితో మంచి స్పూర్తితో, స్నేహమాదుర్యం పంచుతున్న నా "స్నేహమాధురి" వన్నెల రవళి అయిన నీ గురుంచి !! ఏమని వర్ణించను...??!!

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NGhPBR

Posted by Katta

Sree Kavitha కవిత

శ్రీకవిత || హ్రుదయ సరాగాలు || 23.03.2014 నిన్నే నిన్నే తలచుకొని మది వీణను మీటే రాగం నీవవనీ నన్నే నాలో నెమరేసుకొని మది అంతరంగం లో మ్రొగే ఆలాపన నేనవనీ ప్రతి రోజు కవితై వచ్చి నిను వర్ణించనీ ..వర్ణించనీ..!! ఎన్నో ఎన్నో భావాలను తలపులలో రచియించాను మొదటి ఆక్షరం నీవవనీ భావాల ఝరిలొ విజ్రుంభించే పదాలు ... గమించె గమనం నేనవనీ ప్రతి కవితా మాలికలో ప్రస్ఫుటింఛె అర్దం నీవని ..!! అక్షరం అక్షరం కలిపి పలికే రెండక్షరాల "ప్రేమ "కి అర్దం మనమవ్వని 'ప్రే'రణతో మనోహరమైన ఆకర్షణ నీవనీ 'మ'దురంగా మైమరిపించే యంత్రం నేనవనీ ప్రతి ఆకర్షణలో చెలరేగే పులకింతల పరవశాల .. 'ప్రేమ'లొకంలో మనం ఒకటై !! .. విహరించనీ..!!

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWEB3R

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Sree Kavitha కవిత

ముసురుకున్న వలపు వానలొ హర్షంతొ తడుస్తూ నువ్వు నేను కలిసి ఒకటై ఆనంధించె మధురిమలు ఈ నీటి భిందువులు భంధువులై మనతొ చెసెను సరసాలు వలసిన నేను తలసిన నువ్వు తమకంతొ కలిసిన వలయమును చూసి మురిచిపొయిన ఆకాసం గగనపు వీది విడిసి తరలింది మనకొసం ద్రవించి కురిపించేను తడుపుతున్న జోరు వర్షం ముసిరిన వలపు వానలొ మొత్తం ఆమాంతం తడిసిపొదాం విసిగి వేసారి కసురుకున్న కాలాన్ని కలగా మరిచిపొయి క్రొత్త ఆద్యానికి పునాధి వేద్దాం మన ఆశయాల ఆశలను చిగురింప సెద్దాం మనస్పర్దలు వాన నీటి ముత్యాలతొ కడిగెద్దాం నాఆలొచన నీవై నీ కనుపాప మీద నేనై ఒకె బాటగ ఒకె ఆటగా ఒకె పాటగా శ్రుతిలయలతొ సప్త స్వరాలు పలికిద్దాం రాగాలు ఆలపిద్దాం కలకాలం కలసి సాగుదాం కాలనికి నిదర్శనమౌదాం ....@ "శ్రీ" శుభరాత్రి నేస్తాలు!!

by Sree Kavitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gk0bdX

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

9, మార్చి 2014, ఆదివారం