పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Chand Usman కవిత

చాంద్ || ఈ రాత్రి ఇకపై రాకుంటే బాగుండును || నల్లని దుప్పటి కప్పినట్లు రాత్రి దాని క్రింద వెన్నెలకు తడుస్తూ చుట్టూ పువ్వులు వికసిస్తున్న చోట చల్లగాలికి ఊగుతున్న జ్ఞాపకాలతో మంచు పడి రేగిన గాయాలకు ఎండిన కళ్ళ నుండి ఆమె బయటపడి ఒక మోడులా నిలబడి అంటుంది ******* సాయంత్రం అబద్దాలు అన్నీ అస్తమించగా రాత్రి నా ఎదుట ఉదయించే నిజం నువ్వు నీకు తెలియనిదా రాత్రిని నీకోసమే అలంకరించేదాన్ని నేను నీ గుండెలపై వెలుగుతుంటే నువ్వు చంద్రునిలా వికసించే వాడివి ******* దీని ప్రతీ క్షణంలో నీ సువాసన నా ఎండిన దేహాన్ని నీ చితి పై కాలుస్తుంది మన మద్య నలిగిన రాత్రులన్నీ ఈ రాత్రిని ఆవహించి కక్ష తీర్చుకుంటున్నాయి నువ్వెంత సర్దిచెప్పినా ఈ చీకటిని వెలుగనుకొని జీవించలేను ******* ఈ రాత్రి ఇకపై రాకుంటే బాగుండును మీ చాంద్ || 11.03.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oW6865

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి