పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Jabeen Unissa కవిత

జాజిమల్లె తీగా...! జాజిమల్లె తీగ లాంటి ఆడజన్మ కస్టమా, కన్న తండ్రి కడుపుకైన బరువు బిడ్డనయ్యానా, కట్టుకున్న భర్తకేమొ కట్నం డబ్బు ముఖ్యమా, ఇరుగు పొరుగు వాల్ల కంటికి ఆటబొమ్మనయ్యానా, (జాజి) ఈ జన్మకింక ఇంత చాలు పాడు లోకమా, ఎన్ని చట్టాలున్న కట్నం బాధ ఆపతరమా, కామ కళ్ళనుంచి ఆడదాన్ని కాపాడతరమా,(జాజి) కలల వచ్చిన పూల దారి ఎక్కడుందమ్మా, కళ్ళు తెరిచి చూస్తె కళ్ళనిండ సాగరమేనంటా, మా జీవితానికె విలువ ఇంక ఎక్కడుందమ్మా, జాజిమల్లె తీగా...! జాజిమల్లె తీగ లాంటి ఆడజన్మ కస్టమా, 15/3/2014

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OfFji3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి