పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, మార్చి 2014, శనివారం

Nirmalarani Thota కవిత

సుప్రభాత గీతమై నిను మేలుకొలపాలనుకున్నా ప్రత్యూషం ముందే వచ్చి పక పకా నవ్వింది . . పైట కొంగునై నీ నుదుటి స్వేదమద్దాలనుకున్నా పిల్ల గాలి చల్లగా వచ్చి కొంటెగా నవ్వింది . . మెత్తని ఒడినై నీ బడలిన తనువు సేద తీర్చాలనుకున్నా మల్లె పూల పొత్తిళ్ళు మత్తుగా విచ్చి ముసి ముసిగ నవ్వాయి . . జోలపాటనై హాయిగా నిను నిదుర పుచ్చాలనుకున్నా జాబిలమ్మ నెరజాణలా వెన్నెల్లు తెచ్చి జాలిగా నవ్వింది . . మరుసటి రోజైనా నేనే ముందుండాలని మసక చీకట్లు గుట్టుగా దాటి నడిరాతిరే ఆత్రంగా నీ ఇంటి ముంగిలికి చేరుకున్నా. . హు . . మూసివున్న తలుపు వాకిట్లోనే వెక్కిరించింది . . ! నిర్మలారాణి తోట తేది : 15.03.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m68J0j

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి