పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jabeen Unissa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jabeen Unissa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2014, శనివారం

Jabeen Unissa కవిత

పరుగులతో నను నడిపింది, ఈ జీవితమేలే ఒక బండి, ఆగని పాటే నాదండి, అద్దంలో రూపం లేదండి, నా నీడనే అద్దం అనుకోండి, నను తాకిన గాలియే శ్వాసండి, శ్వాసకు అర్ధం ఏదండి, ఇది గమ్యం చేరని బాధండి, విడుదల లేని బ్రతుకండి. 26/4/2014

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lStNEf

Posted by Katta

Jabeen Unissa కవిత

తామరపువ్వా తామరపువ్వా నన్ను చూడవా, ఈ నీటి పైన ఆకునై ఉండిపోయానే, నిను తాకలేక ఒంటరిగా మిగిలిపోయానే, ఈ దేశ జాతి పువ్వుగ ను నిలిచిపోయావా,[తామరపువ్వా] నీ గొప్పతనము నిను మెచ్చిన లోకమెంతనే, నిను వీడిపోయి నే దూరం ఎటు పోతానే, నీ ఆకునై నీతోనే నేనుంటాలే, ఈ తోటకే మెరుపు తీగ మనమౌదామే,[తామరపువ్వా] తామరమే కోమలము ఆకు కాదులే, తీగకెన్ని ఆకులున్న పువ్వు ఒకటిలే, ప్రతి చీకటి చందమామ దిగి వచ్చిందే, ఈ నీటి పైన వెలుగు నిన్ను చూపించిందే, [తామరపువ్వా] 24/4/2014.

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rvWDxu

Posted by Katta

Jabeen Unissa కవిత

పరుగులతో నను నడిపింది, ఈ జీవితమేలే ఒక బండి, ఆగని పాటే నాదండి, అద్దంలో రూపం లేదండి, నా నీడనె అందం అనుకోండి, నను తాకిన గాలియె స్వాసండి, స్వాసకు అర్ధం ఏదండి, ఇది గమ్యం చేరని బాధండి, విడుదల లేని బ్రతుకండి. 26/4/2014

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PCRG81

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Jabeen Unissa కవిత

జాజిమల్లె తీగా...! జాజిమల్లె తీగ లాంటి ఆడజన్మ కస్టమా, కన్న తండ్రి కడుపుకైన బరువు బిడ్డనయ్యానా, కట్టుకున్న భర్తకేమొ కట్నం డబ్బు ముఖ్యమా, ఇరుగు పొరుగు వాల్ల కంటికి ఆటబొమ్మనయ్యానా, (జాజి) ఈ జన్మకింక ఇంత చాలు పాడు లోకమా, ఎన్ని చట్టాలున్న కట్నం బాధ ఆపతరమా, కామ కళ్ళనుంచి ఆడదాన్ని కాపాడతరమా,(జాజి) కలల వచ్చిన పూల దారి ఎక్కడుందమ్మా, కళ్ళు తెరిచి చూస్తె కళ్ళనిండ సాగరమేనంటా, మా జీవితానికె విలువ ఇంక ఎక్కడుందమ్మా, జాజిమల్లె తీగా...! జాజిమల్లె తీగ లాంటి ఆడజన్మ కస్టమా, 15/3/2014

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OfFji3

Posted by Katta

27, ఫిబ్రవరి 2014, గురువారం

Jabeen Unissa కవిత

(ఏంది భాఇ) ఏంది ఏంది ఏంది భాఇ ఎంత వరకు ఈ వింత, తప్పు చేసినోడెవడొ సిక్ష జాతికే నంట, హిందు ముస్లిం భాఇ భాఇ బడి తలపుల వరకేనా, తిరిగి తిరిగి పానం అలిసే ఇల్లు అద్దెకు ఇవ్వరంట, టూలెట్ అని బోర్డ్ చూసి తలపులు తట్టానయ్యా, ముస్లిం అని తెలియగానే వింత వింత చూపులంట, వెజిటేరియన్ ఐతేనె అద్దెకి రావాలంట, ముస్లింకు అసలు ఇవ్వమొఇ జాఓ జాఓ అంటారా, సూటి పోటి మాటలతో గుండెను గుచ్చారయ్యా, ఏంది ఏంది ఏంది భాఇ ఎంత వరకు ఈ వింత, తప్పు చేసినోడెవడొ సిక్ష జాతికే నంట, హిందు ముస్లిం భాఇ భాఇ బడి తలపుల వరకేనా.

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cb1gK2

Posted by Katta

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Jabeen Unissa కవిత

ఒంటరి రోజా (పాట) ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరిదానివా(2) ముల్లె సాస్వత నేస్తమా, పచ్చని ఆకే అందమా, చల్లటి నీరే స్వాసనా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరి దానివా ప్రేమకు గుర్తువు నువ్వెగా, పెల్లికి మాలవు నువ్వెగా, స్నేహానికి గుర్తువు నువ్వెగా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరి దానివా(2) మనసుకు తోడంటూ లేదా, మమతలు పంచేవారెవరో కంటికి ఎదురే కాలేదా, ప్రేమకు దారే కనపడదా నిన్నే చేరక తికమకనా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరిదానివా ముల్లె సాస్వత నేస్తమా, పచ్చని ఆకే అందమా, చల్లటి నీరే స్వాసనా, ఓ రోజాపువ్వా నువ్వు ఒంటరిదానివా(2)

by Jabeen Unissa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nJsUNL

Posted by Katta