పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Shamshad Mohammed లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Shamshad Mohammed లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Shamshad Mohammed కవిత

సమాంతర రేఖలు ప్రపంచపు రెండు కొసలకి వ్రేలాడుతున్నవాళ్ళం ఏరొజుకారోజు మాటల వంతెన వేస్తూ మౌనంతొ తెంచుకుంటున్న వాళ్ళం మూసుంచిన గదిలోంచి కట్టివుంచిన దస్తావేజులను ఒక్కటొక్కటిగా విప్పుకుంటున్నవాళ్ళం ఎడారిలో ప్రయాణిస్తూ దాహాన్ని ఓర్చుకోవడం అలవాటైన బాటసారులం మనకుమనమే గీసుకున్న రెండు సమాంతర రేఖలం మనం నిర్మించుకున్న ఊహప్రపంచంలో ఎవరికి వాళ్ళం స్వేచ్చగా ఒదిగే గువ్వలం షంషాద్ 4/24/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1htQ4nF

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

Shamshad Mohammed కవిత

ఉగాది గడచిన ఉగాదుల స్వాగతాల తోరణాలన్ని జ్ఞపకాల దండలో గుచ్హబడ్డాయి లాభలో నష్టాలో అప్పులో ఆదాలో ఇష్టాలో అయిష్టాలో అంతో ఇంతో ప్రతిసారిలాగే కొయిల కూస్తూ మామిడి కాస్తూ వేప పూస్తూ సవత్సర కాలంలో షడ్రుచుల పట్టికలో దేనివాటా ఎంతైనా జీవితకాలం తినాల్సిందేగా అయిన ఆశల గుమ్మానికి కొత్త తోరణాలతో అందరికి జయాలే కలగాలని జయనామ సంవత్సర ఉగాదిని స్వాగతిస్తున్నాను షంషాద్ 3/28/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jFYCPF

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Shamshad Mohammed కవిత

లేక్ టాహొ చిరుగాలికి రాలే బొడ్డుమల్లెల్లా లేలేత కిరణాల తాకిడికి రాలుతున్న మంచు ముత్యాలు ఎడారిలో ఇసుకలా పరుచుకున్న మంచులో మనసు గిరికీలు కోట్టే యవ్వనమై ప్రేమ బంతులు విసురుకుంటున్నాయి వయసు కేరింతలు కొట్టే పసిదై స్కీయింగ్ బొర్ద్ పై జారుతున్న జంటలు పడవలో లహిరి లహిరి లహిరిలా ట్యూబింగ్ లో షికార్లు సాగుతున్నాయి హుషారుగా శరీరానికెన్ని ముసుగులేసినా కుక్కిమంచంలో ముసలమ్మలా వణుకుతుతోంది చెరువులో మంచుతెప్పల్ని కుప్పలుగా పోసినట్టుంది ఆకాశం మసక చీకట్లో మంచు చీర చుట్టిన కొండమల్లివైపు వోరగా తొంగి చూస్తున్న సందమామ షంషాద్ 3/14/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLgzMh

Posted by Katta

9, మార్చి 2014, ఆదివారం

Shamshad Mohammed కవిత

గమ్యం దారి తప్పింది చేరుకోవాల్సిన గమ్యం ఒకటి చేరుకున్నది మరొచోటుకి గమ్యం దారి తప్పింది పలకాల్సిన స్వాగాతాలన్ని దాటిపోయిన సమయాన్ని శంకిస్తున్నాయ్ సముద్రం అడుగునుంచి ఎగసి పడ్డ ఆకర్షణ శక్తి నీ రెక్కల బలాన్ని లాగేసుకుంది ఆనవాళ్ళు ఆయిల్ తెట్టెలై సముద్రం పై తేలుతూ నీ వారి గుండెల్లో ఆశ అనుమానమై వేధిస్తుంది నువ్ బ్రతికే వుంటావని [కౌలాలంపూర్ నుండి బీజింగ్ వెల్తున్న విమానం సముద్రం లొ పదిందన్న వార్త విని] షంషాద్ 3/9/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKr0QA

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Shamshad Mohammed కవిత

నీడ ఒంటరి నడకల్లో నా తొడైన నీడలొ కొత్తగా నీ రూపం కనిపిస్తుందిప్పుడు చివరి గమ్యం చేరేదాకా అలసట లేని అడుగులేస్తానిక మౌనం మాత్రమే మాట్లాడే నా స్నేహం లోకి నీ స్వరం తోడైంది కరువు రాదింక కబుర్లకి నిద్ర లేని రాత్రి లేదిక నాకు ఆశల పూలతో దోసిలి నింపిన నువ్వే నా కలల ప్రపంచం ఎండుతున్న నా గుండె చెరువును నింపావు కురుస్తూ కాటుక దిద్ది కట్ట వేస్తాను పొంగి పోకుండా అందని చంద్రుడ్ని ఆకాశపుటరచేతిలో గోరింటతో అద్దుకొని పండిన వెన్నెల్ని చూసి మురిసిపోతూ పారేసుకున్న పసి మనసు షంషాద్ 2/28/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bTSVtW

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Shamshad Mohammed కవిత

తప్పిపోయిన మా పల్లె కుప్పలుగా పోసి ఆడిన చింతగింజలాటలో లెక్కలేసుకున్న కట్టలు గుర్రాలు ఏనుగులు ఎక్కడికి పారిపోయాయొనని వెతుక్కుంటున్న వరండాలు అంబా అనే పిలుపు వినపడక చావిట్లొ గుంజకి కట్టిన తాడు గింజుకుంటుంది కరగని నేలా బండలాటలో కదిలిపోయిన తిరిగిరాని కాలం అమ్మమ్మతోపాటే పడేసిన ట్రంక్ పెట్టెలో ఏడుస్తూ వెళ్ళిన పచ్చీసు పట్టా ఏ బార్బి బూచి ఎత్తుకెళ్ళిందో అందమైన నా తాటాకుబొమ్మకి దిష్టి తగిలి అష్టా చెమ్మలాటలో పంటలకి ఏ చీడపురుగు పట్టిందో ఏమొ ఉత్తుత్తి అన్నంపప్పులుడకేసిన మట్టిగురుగుల్నికరిగించిన చీమ కళ్ళ ప్లాస్టిక్ గిన్నెలు రిమొట్ కంట్రోల్ బొమ్మలకింద ముక్కలైన నా చిన్ని చెక్కపీటలు అడ్డుకునెవారు లేక చెదలు కి స్వేచ్చని పరిచిన గోడలు పడాపడేసిన ఇంటికి నన్నెందుకువంటరిగా వేల్లాడదీయ్యడమని వెర్రిగా నవ్వుకుంటున్న తాళం కప్ప ఎక్కడని వెతకను తప్పిపోయిన మా పల్లెని తిరిగిరాని నా బాల్యాన్ని షంషాద్ 2/10/2014

by Shamshad Mohammed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kxxwtj

Posted by Katta