పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Girija Nookala కవిత

దరిద్ర నారాయణుడు మీ దారిద్ర్యమే మా మహా భాగ్యము మీవ్యసనాలే మా కల్పవ్రుక్షాలు మీకు పోసే మందు మాకు ఐదేళ్ళకు రక్ష మీకు ఇచ్చే నోటు మా అవినీతికి ఆసిశ్శులు మీ డబ్బు మీకు ఇచ్చి ఔదార్యము చూపిస్తాం కుల మత గోడలు కట్టి ఆప్యాయత ఒలికిస్తాం ప్రజలకు ఎన్ని కలలు,నాయకులకు ఎన్ని కల్లలు ఎన్నికల జాతరలోని ఎన్నెన్ని వింతలు! దరిద్ర విశ్వరూపం రాజకీయ రాక్షసుడి పదవి మోక్ష మార్గం ఐదేళ్ళకొకసారి దరిద్రుడే నారాయణుడు భుక్తుడే భక్తుడు. ప్రాణ మాన ఆస్ఠులు హరించే ప్రజాహంతకులు పాలన మరచి బరితెగించి దోచుకునే బందిపోటు దొంగలు మతం కులం జాతి పేరుతో మనసులు చీల్చే నాయక రూప కరటక దమనులు. ప్రజాస్వామ్యం పరమ విచిత్రం స్వాములైన ప్రజలు నిత్యదరిద్రులు దాసులైన ప్రతినిధులు నిధులకు వారసులు ఎన్నికలు మాయ ప్రజల రాజ్యం మిధ్య రాజనీతిలో నీతి, నేతి బీరలో నెయ్యి. మేలుకో ఓటరా మేలుకో, నోటు చూసి,కల్లు తాగి,దిమ్మతిరిగి మీటనొక్కి కల్లు తాగిన విశ్వాసానికి అవినీతికి విత్తునాటి వేళ్ళు ఆనిన వట వ్రుక్ష చేదు ఫలం స్వయం క్రుతం ఓటు వేసిననాడు తెలివి చూపలేదని వగచి ఏడ్చి లేదు లాభం నీతివంతుడికి పట్టం కట్టు మంచి కోసం జల్లెడపట్టు యధా ప్రజా థదా రాజా ఏక్ దిన్ కా సుల్తానువి ఓటు చక్రాయుధ ధరుడవి నీ విచ్చక్షణే నీకు రక్ష.

by Girija Nookala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1flG5Rs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి