పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
నేనే ఇమ్రాన్ శాస్త్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నేనే ఇమ్రాన్ శాస్త్రి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఏప్రిల్ 2014, బుధవారం

నేనే ఇమ్రాన్ శాస్త్రి కవిత

"నేను-నేను= మనం" రచన:ఇమ్రాన్ శాస్త్రి మాత కడుపులో నుంచి భూమాత కడుపులో వెళ్ళే ప్రయాణంలో..ఎంతోమంది తారసపడ్తారు.... కాని ఎవరికి వాళ్ళు ఏదో ఒక సంబంధంతోనే ముడిపడ్తారు అమ్మ దగ్గర్నుంచి కనే అమ్మాయి/అబ్బాయి వరకు.... "మానవ సంబంధాలన్ని అవసరాలే"' అని ఎక్కడో చదివినట్టు గుర్తు..నిజమేనేమొ... ప్రయోజకుడికి పక్కనుంటూ పనికి రానివాడిని పక్కకు కూడా రానివ్వని తండ్రులు.. కలెక్టర్ అయితె సోదర భావాన్ని క్లీనర్ అయితె చీదర భావాన్ని వ్యక్తపరిచే సోదరులు.. సంపాదన బాగుంటే వేడన్నం అంతంతమాత్రంగా ఉంటే చద్దనం పెట్టి ప్రేమగా అవమానించి, జాలిగా హెచ్చరించే బంధువులు.. వాళ్ల దగ్గర లేని దాన్ని మన దగ్గర నుంచి పొందాలనే(బ్రతకడానికి కావలసినవన్ని) స్వభావంతో{స్వార్ధంతో అన్నా తప్పు లేదు} ప్రవర్తించే స్నేహితులు.. ఒకటో తారీఖు నాడు ఇక్కడ ప్రేమ అమ్మబడును అనే ఆభరణాన్ని మెడలో వేసుకునే భార్యలు.. మూర మల్లెపూలకో,మూడొందల రూపాయల చీరకో ఆకట్టుకోవచ్చని నమ్మే భర్తలు.. కన్నాక పోషించడం మీ బాధ్యత ఎదిగాకా మిమ్మల్ని చూడడం చూడకపోవడం మా ఇష్టం అని సమర్ధించుకునే పిల్లలు.. ఇన్ని అవశేషాలకు కాస్త పక్కకు జరగాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి అనిపిస్తుంది కాని తప్పక ఏదో ఒక వేషం వేసుకుని సశేషంగా సాగిపొతున్నాడు... తన నుంచి తాను దూరమవుతూ నలుగురితో ఏకమవ్వాలని.....!

by నేనే ఇమ్రాన్ శాస్త్రి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f69hkS

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

నేనే ఇమ్రాన్ శాస్త్రి కవిత

"నాకది చాలు" రచన:ఇమ్రాన్ శాస్త్రి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కాలమంతా గడపొద్దు.. పగలంతా నిను వెతికే కనులకు ఎదురైతే చాలు....! గుండెల్లో గుసగుస మని పలికే భావాలన్నీ చెప్పొద్దు.. పెదవంచున మౌనం దాచిన మాటెంటో పసిగడితె చాలు...! ప్రతి నిమిషం వెనువెంట తిరిగే నీడలా మారొద్దు.. నీ వెనక నడిచేటప్పుడు నా వైపు చూస్తే చాలు...! నీ ధ్యాసలో పడి నే మరచిన నన్ను., నువ్వు గుర్తించొద్దు... నీకంటూ ఏమి కాని నేను నీకై ఉన్న వాడిలా గుర్తుంటే చాలు....! నే రాసే ప్రతి లేఖకి బదులివ్వకపోయినా పర్లేదు.. అవి చేరలేనంత దూరంగా నీ చిరునామ మార్చకుంటే చాలు...! బ్రతుకంతా నీ జతలో ఉండాలనే ఆశకు ఆయువు పోయద్దు.. కను మూసిన నా కథ విన్నాక నీ కంట కురిసే ఒక్క కన్నీటి బొట్టు చాలు...!

by నేనే ఇమ్రాన్ శాస్త్రి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOjeXS

Posted by Katta

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

నేనే ఇమ్రాన్ శాస్త్రి కవిత

"ఈ రోజు తనదట" మరి..... ఎన్ని మనసుల్లో చిగురించిందో ఎన్ని మనసుల్ని చిదిమేసిందో ఎన్ని కన్నుల స్వప్నాలను నిజం చేసిందో ఎన్ని కన్నీటి లేఖలకు కారణమైందో ఎన్ని గుండెల చప్పుళ్ళను వింటుందో ఎన్ని గొంతుల అంచుల్లో దాగుందో ఎన్ని నిన్నలను తిరిగి రప్పించిందో ఎన్ని నిమిషాలను వెనక్కి తిప్పిందో ఎన్ని పెదవుల్ని ఒకటి చేసిందో ఎన్ని పిలుపుల్ని పెడ చెవిన పెట్టిందో ఎన్ని జంటలను ముడివేసిందో ఎన్ని ఒంటరితనాలకు ఓదార్పైందో ఎన్ని ఆశలకు ఆయువు పోసిందో ఎన్ని ఆయువులను ఆపేసిందో.......!

by నేనే ఇమ్రాన్ శాస్త్రి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eVWhNI

Posted by Katta