"నేను-నేను= మనం" రచన:ఇమ్రాన్ శాస్త్రి మాత కడుపులో నుంచి భూమాత కడుపులో వెళ్ళే ప్రయాణంలో..ఎంతోమంది తారసపడ్తారు.... కాని ఎవరికి వాళ్ళు ఏదో ఒక సంబంధంతోనే ముడిపడ్తారు అమ్మ దగ్గర్నుంచి కనే అమ్మాయి/అబ్బాయి వరకు.... "మానవ సంబంధాలన్ని అవసరాలే"' అని ఎక్కడో చదివినట్టు గుర్తు..నిజమేనేమొ... ప్రయోజకుడికి పక్కనుంటూ పనికి రానివాడిని పక్కకు కూడా రానివ్వని తండ్రులు.. కలెక్టర్ అయితె సోదర భావాన్ని క్లీనర్ అయితె చీదర భావాన్ని వ్యక్తపరిచే సోదరులు.. సంపాదన బాగుంటే వేడన్నం అంతంతమాత్రంగా ఉంటే చద్దనం పెట్టి ప్రేమగా అవమానించి, జాలిగా హెచ్చరించే బంధువులు.. వాళ్ల దగ్గర లేని దాన్ని మన దగ్గర నుంచి పొందాలనే(బ్రతకడానికి కావలసినవన్ని) స్వభావంతో{స్వార్ధంతో అన్నా తప్పు లేదు} ప్రవర్తించే స్నేహితులు.. ఒకటో తారీఖు నాడు ఇక్కడ ప్రేమ అమ్మబడును అనే ఆభరణాన్ని మెడలో వేసుకునే భార్యలు.. మూర మల్లెపూలకో,మూడొందల రూపాయల చీరకో ఆకట్టుకోవచ్చని నమ్మే భర్తలు.. కన్నాక పోషించడం మీ బాధ్యత ఎదిగాకా మిమ్మల్ని చూడడం చూడకపోవడం మా ఇష్టం అని సమర్ధించుకునే పిల్లలు.. ఇన్ని అవశేషాలకు కాస్త పక్కకు జరగాలని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి అనిపిస్తుంది కాని తప్పక ఏదో ఒక వేషం వేసుకుని సశేషంగా సాగిపొతున్నాడు... తన నుంచి తాను దూరమవుతూ నలుగురితో ఏకమవ్వాలని.....!
by నేనే ఇమ్రాన్ శాస్త్రి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f69hkS
Posted by Katta
by నేనే ఇమ్రాన్ శాస్త్రి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f69hkS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి