పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
నరసింహ శర్మ మంత్రాల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నరసింహ శర్మ మంత్రాల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, జూన్ 2014, గురువారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయకుహరాన్ని ఛేధించుకొని మరీ ఎగసి ఉప్పోంగుతున్న జలధార. మునుపెన్నడూ గ్రోలి ఎరుగని ఈ నవీన సజీవధారను ప్రశ్నించాను ఓయి! జలధారా! చెలియలు కట్టిన ఏ రహస్య మార్గాల వెంబడి మీరు ఇలా నాదిశగా ప్రవహిస్తూన్నారు? గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతరంగ మధుకోశానికి కూర్చిన మరిన్ని నూతన శ్వేతవర్ణపు కుహరములందు ఆ స్వర్ణవర్ణపు మధూకరములు నా గత జీవితపు వైఫల్యాలనుంచి సైతం స్వారించి మరీ పూతేనియల్ని నింపుతున్నాయి! గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతరస్ధ నిశీధి లోనికి చొచ్చుకొని వచ్చెడు ఉష్ణమాలికా వీచికలు నా భావనలో వెచ్చటి కొలిమి సెగల వోలె తోచుటకు, అవి తమ తోడుగూడి గొనివచ్చెడి స్ఫూర్తి ప్రదములగు సూర్యకాంతి పుంజములేనని గ్రహించిన నా కనుదోయి చెమ్మగిల్లినది! గతరాత్రి నిద్రిస్తూన్నప్పుడు నేనో కల కన్నాను ---- ఎంత భ్రాంతిని గొలిపే కల! నా హృదయాంతఃకరణలో ఆ పరమాత్మాంశనే నేను సాక్షాత్కరింప జేసుకున్నాను! Last Night As I Was Sleeping అనే అంటినియో మచాదో స్పానిష్ కవితకి తెలుగు అనువాదం. -- నరశింహశర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v1wjx0

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

SONGS OF THE HIGH COUNTRY Soria, in blue mountains, on the fields of violet, how often I've dreamed of you on the plain of flowers, where the Guadalquivir runs past golden orange-trees to the sea. ------------Antonio Machado శిఖర (సం)గీతం ఆ హేమవర్ణిత నారింజ తరూ తటముల దోగాడుతూ సాగర సంగమాభిలాషియై ఉరుకులిడుతూ సాగిపోయెడి పెన్నేరు నదీ ప్రవాహసీమలో ఈ విరిసిన సాంద్ర సుమ మైదాన తావులలో ఆ ఊదారంగుపూల పచ్చిక బయళ్ళ నడుమ నింగిని తాకుతూ నిలిచిన నీలగిరి శిఖరమా! ఓ బుడాపెస్టా ! పదే పదే కలలు కంటుంటాను కదా నీ సందర్శనాభిలాషినై. -----------నరశింహశర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qloYFP

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

ఈ ఏటవాలు కాంతిపుంజాలతో చెలిమిగా వచ్చిన మలయమారుతాలు తమ బొండు మల్లెల గుబాళింపులతో నన్నావరించి నా ఆత్మను పలకరించాయి. నా వద్ద గులాబీలు లేనే లేవు నా హృదయాంతరంగ వన సీమలో పూచిన సుమాలన్నీ ఎండి, వడలి మృత్యువునే వరించాయి. నా ఆత్మ వెదజల్లే మల్లెల గుబాళింపులు స్వీకరించి నీ గులాబీ సౌరభాలు బదులిస్తావా? పోనీలే! ఈ జవజారి రాలి పడిన పూలరేకులూ, పీలవర్ణిత పత్రాలూ ఆ గోరు వెచ్చని కొలను నీటినే ఆస్వాదిస్తాను ఆశగా. మలయమారుతం ఎటో వెళ్ళిపోయింది మల్లెల గుబాళింపులను వెంటదీసుకుని ఓ పక్క నాకు దుఃఖం ఆగడంతేదు మరో పక్క నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోంది “నీ కొసగిన ఆ సుందర, సుకుమార హృదయాంతరంగ వనసీమను మరీ అంతలా ఛిద్రం చేసుకున్నావేం” అంటూ...........!!!!!! నరశింహశర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p709xB

Posted by Katta

26, మే 2014, సోమవారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

Guadarrama Guadarrama, is it you, old friend, mountains white and gray that I used to see painted against the blue those afternoons of the old days in Madrid? Up your deep ravines and past your bristling peaks a thousand Guadarramas and a thousand suns come riding with me, riding to your heart. Antonio Machado ఓ గాలికొండా ! నీలాంబర తెరపై చిత్రించిన లేతముదురు హరితవర్ణిత పర్వతశ్రేణి పార్శాలలో తరచుగా నేను దర్శించే చిర పరిచిత మిత్రుడా ఓ గాలికొండా! ఇది నీవేనా ! ఆనాటి అరకులోయ నీరెండ సాయంసంధ్యలు లోతైన ఇరుకు పర్వతపు నేర్రెలూ చేరనలవికాని ఉత్తుంగ శిఖరాలు ......రండి నాతో కల్సి విహరించండి ఆ వేనవేల అరకులోయ అందాలలోకి ఆ వేనవేల సూర్యకాంతిపుంజాలతోటి మీ హృదయాంతర ఆహ్లద శీమలోనికి ----నరశింహ శర్మ మంత్రాల మాడ్రిడ్ పట్టణ శివారులోని పర్వతశ్రేణిలో గౌడర్రమా ఓ పెద్ద శిఖరం. దానినే మన అరకులోయ వద్దగల గాలికొండతో సరిపోలుస్తూ చేసిన అనువాదం.

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p9zbri

Posted by Katta

23, మే 2014, శుక్రవారం

నరసింహ శర్మ మంత్రాల కవిత

Has my heart gone to sleep? Has my heart gone to sleep? Have the beehives of my dreams stopped working, the waterwheel of the mind run dry, scoops turning empty, only shadow inside? No, my heart is not asleep. It is awake, wide awake. Not asleep, not dreaming— its eyes are opened wide watching distant signals, listening on the rim of vast silence. ------Antonio Machado పై కవితకు నా స్వేచ్ఛానువాదం. నా హృదయం జోగుతున్నదా? ఈ నిశీధి నిశ్శబ్ద తరంగజనిత స్తబ్దతావృతములందు చిక్కుబడిన నా హృదయ సంవేదనలు జోగుతున్నాయా? నా స్వప్నమాధుర్యాలు శలవతీసుకున్నాయా? నా నిరంతర చైతన్యపూరిత భావనా స్రవంతులు ఎండి పొడిబారుతున్నాయా? నా యోచనా దొన్నెల చయనిక నిండుకున్నదా? లేదు, నా హృదయం జాగృతమై ఉన్నది మెలకువగానే ఉన్నది, పూర్తి చైతన్యముతో జోగుట లేనేలేదు, కలలు అసలే లేవు నా అంతఃచక్షువులు విప్పారి చూస్తున్నవి ఆ నిశీధి నిశ్శబ్ద తరంగ సంకేతాలను గమనిస్తున్నవి, గ్రహిస్తున్నవి. మచాదో తన అంతఃచేతన అచేతనం కాకుండా ఉండేందుకు ఎంత తపన పడుతున్నాడో గమనించండి. ఈ కవితలోని ఆత్మసంవేదన అద్భుతం. on the rim of vast silence. ఈ ఆఖరి వాక్యాన్ని మొదటి వాక్యంగా మలిచి అనువాదం చేయడం వలన మఛాదో కవితా స్ఫూర్తికి అనువుగా అమరిపోయింది. ----- నరశింహ శర్మ మంత్రాల

by నరసింహ శర్మ మంత్రాల



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVIR6u

Posted by Katta