* *ఆ.....అక్షరాలు.....* * ఎలాజరిగిందో మరి అంతరంగంలో ఆలోచనలు అక్షరాలుగా ప్యూపాలు పగల గొట్టుకొన్నట్టున్నాయ్ ఎందుకనో మరి పదాలై పెదాలు దాటించాలని ప్రయత్నం చేస్తే ఓడిపోయిన సైన్యం లా దిగాలుగ వెనుతిరిగాయి .. ఉక్రోషంగా ఎత్తుకు పైఎత్తుగా మాటల పదాలను కొటగోడలుగా పేర్చుదాం అంటే బరువైన పదాలేవీ బాష లో ఇమడ్చ లేక గుండె తలుపులు గడియ వేసుకొన్నాయి.. ఏమైందో ఇక నీలి రంగు సిరా లో వెతలుగా కొన్ని అక్షరాలను తడిపేస్తూ నింపబోతే ఆ సాంద్రత బరువు తట్టుకోలేక ఇంకు చుక్కలకు 'కన్నీటి 'చుక్కలు నేస్తాలయ్యాయ్ ఎలాగో ఒకనాటికి తడిసీ తడవని అక్షరాలని తడారిన గుండె పై రాల్చుకున్నాక కాలం భూతమైంది కవిత గతమైంది సగం కరిగిన కొవ్వొత్తి చేతిలో పట్టుకొని చిరిగిన పుస్తకాలలో రెండు శూన్యాల నడుమ ఇరుక్కున్న అక్షరాలను చూడబోతే పురాతన పుస్తకంలోని తప్పిపోయిన కాగితాలు పచారీ సామానుకి వలువలైపోతే జరీ అంచులా మెరుస్తూ ఆ అక్షరాలు.. నా అక్షరాలు... **పద్మ**23|4|2014
by Padma Bikkani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA8tc6
Posted by Katta
by Padma Bikkani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA8tc6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి