పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Krishna Mani కవిత

చిన్న మనసు *************** అగసూడు అగసూడు అందమైన అంగడి అమ్మకొంగు వట్టుకొని అడుగు మీద అడుగేస్తి సంచివట్టి అమ్మ నింపె వారందాక కడుపులు ! దిక్కులు వట్టి నా మొకం మెరిసిపోతి మనసున నెత్తిమీద టోంగ గొట్టి అమ్మగుంజె ముందుకు ! శనగ పల్లీలు తెల్లమురుకు పెద్ద పాపడ కడుపుగోకి అడిగిన ఓపలేక పానము చిల్లర సదిరి ఇప్పిచ్చే కారం బఠానీలు దవడలు గుంజె ,కడుపు నిండె అయినా మనసు నిండలేదు ! పక్కపోరడు నాకవట్టె పాల ఐస్క్రీం కారే చుక్కల వట్టి సప్పరిద్దమంటె ఉరిమురిమి సూడవట్టె పిల్లిమొకపోడు ! నెత్తిమీద సంచెత్తి ఎడమచేతిల నన్నుపట్టి నడసవట్టే మాయమ్మ జాతర దాటి ఇంటికి తోవ్వవడితే నడవనంది పానము ! అంగట్ల నడవనంటె మల్ల వారం తోల్కరాదని బిగవట్టిన చెమ్మ తుడిషి అమ్మ చేతినదింపట్టి ప్రేమతోడ అడుగులు ! కాళ్ళు గుంజంగ ఇల్లు జేరితి దూపకు చెంబెత్తి దించితి సాప మీద కాళ్ళు సాపుకుంటే ఒళ్ళు మరిశిన నిద్దురాయే ! కృష్ణ మణి I 23-04-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA8qgl

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి