పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Annavaram Devender కవిత

తొవ్వ ........అన్నవరం దేవేందర్ ....23.04.2014 కరీంనగర్ లో ‘విద్యుల్లత’ లు విరచిమ్మిన కాలం కరీంనగర్ జిల్లా సాహిత్యానికి పత్రికా రంగానికి పెట్టింది పేరు .జిల్లా నుంచి 1969 లో సంవత్సరం పాటు ‘విద్యుల్లత ‘యువ సాహిత్య మాస పత్రిక నడిచింది .సాహితీ మిత్ర మండలి దీనిని ప్రచురించింది .దీనికి సంపాదకులుగా బి.విజయకుమార్ (జీవగడ్డ విజయకుమార్ గా ప్రసిద్దులు ),జి .లింగారెడ్డి (డాక్టర్ గోపు లింగారెడ్డి ,ప్రఖ్యాత జానపద సాహితీ వేత్త ,రెండేళ్ళ కింద మరణించారు ).వి.వెంకటరెడ్డి లు వ్యవహరించారు .అప్పుడు వీళ్ళంతా విద్యార్థులే జమ్మికుంట కళాశాలలో చదువుకొంటడ్రు.ఇటీవల నా పాత పుస్తకాలు సదురుతుంటే విద్యుల్లత జన్మదిన కథల సంచిక దొరికింది (ఆగస్ట్ –సెప్టెంబర్ -1970 )ఇందులో ఏడు కథలు ఉన్నాయి .ఈ పత్రిక కు శ్రీ శ్రీ .కొడవటిగంటి ,కే.వి రమణారెడ్డి ,అద్దేపల్లి రామమోహనరావు ,తాడిగిరి పోతరాజు ,చలం ,రాసిన ఉత్తరాలు ఉన్నాయి .నలబై నాలుగేండ్ల కింది సాహిత్య పత్రిక చూస్తే గంమతి అనిపిచ్చి ఈ కాలం లో రాస్తున్న . ఇంకా ఇందులో మెట్టు మురళీధర్ రావ్ ‘సుడుగుండం ‘,సి .ఎస్ రావ్ ‘గంజయిగొట్టాలు,అత్తలూరి నరసిహ్మరావ్ ‘నిద్ర పింగళి రంగా రావ్ ‘ఆకలి ‘,రవికాంత్ ‘ఉదయం ‘,ఆగ్నేయ ‘నింద లేందే ‘యం.యన్ రావ్ ‘హింస ను నిషేదించిన పులి రాజు ‘కథలు ఉన్నాయి .అట్లనే పి.యన్ .స్వామి ప్రఖ్యాత రచయిత కిషన్ చందర్ తో ముఖాముఖి ఉన్నది .ఆపుడే తెలంగాణా నుంచి ఇంత గొప్ప పత్రిక వెలువడింది .ఆ తరువాత కాలం లో ఆగి పోయింది .కరీంనగర్ కేంద్రంగా ఆనాటి సాహిత్యం ప్రచురణకు కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఏర్పడింది .’బదులా’ కథా సంకలనం కూడా ఇక్కన్నుంచే వచ్చింది .శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రేవల్యుషన్’ఇక్కన్నే అచ్చయింది . అసలు కరీంనగర్ లో 1954లో బోయినపల్లి వెంకటరామరావ్ సంపాదకత్వాన ‘సారస్వత జ్యోతి ‘త్రైమాస పత్రిక వెలువడింది .అదే కాలంలో కమల్ కరిమనగారీ సంపాదకత్వంలో మానేరు ఉర్దు పత్రిక ‘పంచాయితి యుగం ‘పాతికలు వెలువడ్డాయి .1977 లో మలయశ్రీ సంపాదకత్వం లో సత్యార్తి పత్రిక వెలువడింది .తెలుగు సాహిత్యానికి కరీంనగర్ అందించినది ఎంతో ఉన్నది .ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో పత్రికలు వస్తున్నాయి సిరిసిల్ల నుంచు ‘దిక్సూచి ‘సాహిత్య పత్రిక వస్తుండే....అట్లనే తెలంగాణా ఆవిర్భావం నాటి నుంచి ఇక్కడి మిత్రులు ‘వాగు ‘సాహిత్య పత్రిక వెలువరించేందుకు సన్నాహాలు చేస్తుండ్రు ..వాళ్ళను స్వాగతిస్తాం

by Annavaram Devender



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rhUGVp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి