పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Harish Babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Harish Babu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఏప్రిల్ 2014, సోమవారం

Harish Babu కవిత

!!నాకక్కరలేదు!!భీమ్!! నాకొచ్చిన తీర్పుపై నువ్వు అమూల్యమైన కన్నీటి చుక్కలు జాలువారిస్తే అవి నాకక్కరలేదు.., నీకు చేతనయితే నా గొంతుకకు నీ గళాన్ని జోడించి ప్రపంచానికి వినబడేలా ఈ నకిలీ ప్రజాస్వామ్య దేశాన్ని ప్రశ్నించు నాకు జరిగిన అన్యాయంపై..., నీకు చేతనయితే జోడి చెప్పులతో ఆ న్యాయమూర్తి దవడలు పగలగొట్టు నిందితులెవరో చెప్పిన దాక.., నీకు చేతనయితే నా గోతి ప్రక్కన పడుకోటానికి సిద్దపడు నాకు న్యాయం జరిగే పోరులో నువ్వు అమరుడవైతే...! అంతేగానీ మిత్రమా..,నా కుటుంబంపై నువ్వు చూపే ప్రేమ అక్కరలేదు.., నా ఇంటికొచ్చి ఎలా జరిగిందో ఆరా తీసే పంచాయతి నాకసలే అక్కరలేదు ఓ న్యాయమూర్తి నువ్విచ్చిన తీర్పుతో నేను ఎక్కెక్కి ఏడుస్తానని అనుకొకు.., నీకు భయపడి పారిపోతానని అనుకొకు..., నేనున్నది సమదిలోనే కావొచ్చు.., కానీ నా పిడికిలి ఏదోక రోజు నీ గొంతును బిగిస్తుంది నాకు జరిగిన ద్రోహం ఇంకెవ్వరికి జరగకుండ.., నిందితులే లేరన్నావ్ మరి నా చావుకి కారణంఎవరు...? నాపై దాడిని కధలు..,కధలుగా ఎలా చెబుతారో ఒకసారి నా పల్లెకెల్లి విచారించు వీలైతే నా తల్లి కన్నీళ్ళు దోచిట్లో పట్టుకొని తాగు అప్పుడైనా నీకు జ్ఞానం కలిగి నాకు అనుకూలంగా తీర్పు ఇస్తావేమో....! — feeling proud.

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j7RZTW

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Harish Babu కవిత

!!ఎవేవో ఘోషలు!!భీమ్!! ఎవేవో ఘోషలు ఎవేవో ఆర్తనాదలు వినబడుతున్నాయ్ వాళ్ళు ఎవరై ఉంటారు....? చినసుబ్బడు..,ఎర్రెంకడు లాంటి మాల..,మాదిగలు తప్ప బుక్కేడు బువ్వ కోసం భూమిని తాకితే అదేమో కమ్మోడిని..,కాపోడిని పంపింది నన్నో అంటరానోడు ముట్టుకున్నాడని ఇంకేంది గొడ్డళ్ళు..,బడెసెళ్ళతో కారపు పోట్లలతో మనువు అంటరాని పల్లెపై స్వైర విహారం చేసాడు చీకట్లో గుమ్మంలో పెట్టాల్సిన దీపాన్ని చచ్చిన పీనుగ ముందు పెట్టేలా చేసాడు.

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1my4iJv

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Harish Babu కవిత

!!మళ్ళీ అవే!!భీమ్ !! మళ్ళీ అవే గుడెక్కే మెట్ల దగ్గర బళ్ళో కూర్చొనే చోటు దగ్గర కుంటలో దోచిట్లో తీసుకొని తాగే నీళ్ళ దగ్గర ఎప్పుడో నన్ను ప్రశ్నించిన పెదాలు తూ..లంజకొడక మాలో కుర్చోక పొతే అటుపోయే కుర్చోవోచ్చుగా అంటూ పెద్దకులపోళ్ళ పెళ్ళి బంతిలో నన్ను గర్జించిన ఓ పెద్దమనిషిలాంటి ఓ ఆడపిల్ల ఇన్నేళ్ళ తరువాత ఎదురై అడుగుతుంది నువ్వు ఎవరంటు...?నీదే ఈ కులమంటూ...? ఈ ప్రశ్న విన్న ప్రతిసారీ...! కళ్ళలో నీటిసుడులు తిరుగుతున్నాయి ఓదార్చే వాళ్ళుంటే రోజంతైనా ఏడుస్తానేమో నువ్వడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేక నా కులన్నాడిగి నువ్వేం చేస్తావ్ ఛీ....!నీదా కులమంటూ వాళ్ళలాగే నువ్వు ఎత్తి పోడుస్తావ్ అయిన మాకది కొత్తకాదే గురుదక్షణగా ఇచ్చిన బొటనవేలులు మీ రామాయణ.,మహాభారతాల్లో రాక్షసులుగా చెప్పుకొనే బానిసలు నీలాంటోళ్ళు దూరంగా పెట్టే నాలాంటోళ్ళు మేమంతా ఒక్కటే ఊరికి దూరంగా వేలివేయబడ్డవాళ్ళం దళితులం..,దరిద్రులం.., అంటులేకపోయిన నీలాంటోళ్ళని ముట్టుకోకుడదని మీ దేవుళ్ళ చేత శపించబడ్డ అంటరానోళ్ళం....!

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhXbkd

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Harish Babu కవిత

//అందుకే నువ్వు అమ్మవైనావ్//భీమ్// నా కష్టాల్లో కన్నీళ్ళై.., నా సంతోషం వెనుక కారణం అయ్యావ్ అలిగినపుడు తరగని కూటి కుండ.., ఫోన్ చేయనప్పుడు నిద్రపోని రాత్రులు హాస్టల్ నుంచి ఇంటికి వొచ్చిన ప్రతిసారీ దీర్ఘంగా నన్నే చూసే ఆ కళ్ళకు..., ఏం ఇచ్చి ఋణం తీర్చుకోను...! ఋణం సంగతి దేవుడికి ఎరుక.., నువ్వు పదికాలాలు చల్లగా బ్రతుకు బిడ్డ అంటావ్ అందుకే రాజేశ్వరి నువ్వు 'అమ్మ'వైనావ్ మొగుడు తాగొచ్చి కొడుతుంటే.., ఉయ్యాలలో నిద్రపోయే బిడ్డ భవిష్యత్తు అంచనా వేస్తూ తన్నుకొచ్చే ఏడుపుని కడుపులో దాచిపెట్టి కన్నీళ్ళనే ఆకలిగా తీర్చుకున్నావ్ పట్నంలో చదివే కొడుకు ఇంటి నుంచి తిరిగి వెళ్తుంటే ఒక్కసారైనా చూడకపోడానీ వాడి చూపుకోసం రోడ్డు మలుపు దాక ఎదురుచూసే ఓ చిన్ని ఆశవైనావ్ ఒకటేమిటి "అమ్మ" చెప్పుకుంటూ పోతే ఎన్నో...! ఈ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబితే స్వార్ధం అంటావ్ అదే స్వార్ధంతో నేనే అందరికన్నా మిన్నగా బ్రతకాలని ఆ దేవుడినేకోరుకుంటావ్ ...! నీ ప్రేమకు నేను ఏం చేయగలను అమ్మ ఇలా పిచ్చి వ్రాతలు వ్రాయటం తప్ప...!

by Harish Babu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NK0jND

Posted by Katta