పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, ఏప్రిల్ 2014, బుధవారం

Naresh Nandam కవిత

మైనారిటీ || నరేష్ నందం 23.04.2014 -------------------------- ఉదయం స్కై బాబా షేర్ చేసిన డా. దిలావర్ గారి త్రి’శూల’ నొప్పి కవిత స్ఫూర్తిగా.. -------------------------- మనసులను ముళ్లకు గుచ్చి సొంతగడ్డ మీదే పరాయితనం మూలాలను శోధిస్తూ వెక్కిరిస్తోంది చూడు ఈ ప్రాంతీయవాదం! ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు నోరున్నోళ్లదేనట రాజ్యం! వారి లంగలఫంగ మాటలకు పరవశించి, అంగాంగాలను కత్తిరించాలని ఫత్వాలు ఇచ్చి, అమ్మల మానాలపై బూతుల కవితలు కూర్చే గోప్ప కవుల, రచయితల సమూహాలకేం తెలుస్తుంది? ఊహ తెలిసినప్పటి నుంచి నాది అనుకున్న చోటులో, మరెవ్వడో వచ్చి వెకిలి నవ్వుతో నువ్వు పరాయోడివని వెక్కిరించి.. నిన్ను తంతాం, తరిమేస్తాం, నాలుకలు తెగ్గోస్తామంటూ.. మూడ్ వచ్చినప్పుడల్లా బెదిరించి, నోటికొచ్చిన పచ్చిబూతులన్నీ పరమ ఆనందంగా సంకీర్తన చేస్తోంటే.. రోజుకోసారి పక్కవాడిని చూసి కడుపుమండి కుళ్లునిండిన కళ్లతో కుమిలిచచ్చే వారికేం తెలుస్తుంది? వలస బతుకుల మీద విరక్తితో, సెటిలర్లనే మాటల ఈటెల పోటుని భరించలేని అశక్తతతో.. దీనమ్మా జీవితం.. ఎవడి కడుపుకొడుతున్నామని మేమీ నగరంలో అంటరానివాళ్లమయ్యామనే ప్రశ్నకు జవాబుదొరకని తనంపై కోపం, ఉద్రేకం.. రెండవతరగతి పౌరుడిగా బతకటంలో నొప్పి ఎలా తెలుస్తుంది?? మా కడుపులో పెట్టుకుని చూసుకుంటామనే మాట పెదాలు దాటకముందే.. నీయబ్బా ఆంధ్రోడా.. మా జాగలకొచ్చి బతుకుత మమ్మల్నే పైసలిమ్మంటవారా.. అని కూసే ఆ మహానుభావుల నోళ్లను ఎన్ని వేల సార్లు ఫినాయిలుతో కడగాల్నో..?? కర్రీపాయింటు గాళ్లే కదా అని జాలి కూడా చూపకుండా, వాడి కంచంలోని ఎంగిలి కూడు తింటోన్న ఈ నా పెద్దమనుషులను ఏమని పొగడాల్నో..?? నోటితో పలకరించి నొసటితో వెక్కిరించే గోప్ప సంస్కృతీసంప్రదాయాల వారసులైన పాదుషా ముద్దుబిడ్డలను చూసి వారి పాలన ఇంకెంత బాగుంటుందో అని పొంగిపోవాల్నో..?? అన్యాయమంటే.ఎక్కడో గుజరాతులో జరిగేది మాత్రమే కాదు.. అరాచకమంటే.. కడుపులో పిండాన్ని తీసి ముక్కలుగా నరకటం మాత్రమే కాదు.. తనకు సంబంధంలేని సంఘటనకు, సాక్షిగా కూడా లేని సందర్భానికి నిందల కుండలను నెత్తిన మోస్తూ తిరగాల్సిరావటం కూడా అన్యాయమే.. అలాంటి అన్యాయానికి మద్ధతు తెలుపుతూ కవితలనే పేరుమీద విశృంఖలతనూ, మనసులోనీ పర్వర్షన్‌నూ వాంతి చేసుకోవటమూ అరాచకమే..

by Naresh Nandam



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hgwhMH

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి