ప్రశ్న రాజీనామా ===================రావెల పురుషోత్తమ రావు పేశ్నిస్తున్నంత కాలం ప్రవాహ వేగంతో మెదడు పనిచేస్తూ వునే వుండేది. కొండలమీదనుండి జారిపడే జలపాతంలా చలన ద్యుతితో విద్యుత్తులా సాగుతూ వుండేది మనసు. అవతలి వాళ్ళను ఉక్కిరి బికీరిచేస్తూ అయోమయంలోకి వాళ్ళను నెట్టే స్తూ వుండేది. నీతినిజాయితీలు యేమాత్రం లోపించినా నాప్రశ్నోపనిషత్తు గజ గజ వణికిస్తూ వుండేది. నిలువు టద్దంలా వారికి నా ప్రశ్నలు సోదాహరణమై నిలిచేవి. ఇప్పుడు కాలమంతా మారిపోయింది. ప్రశ్నిచే వాళ్ళకూ ముడుపులు ముడతాయనీ--లోక సభ సాక్షిగా నిరూపితమైందని చదివాను. ప్రశ్నలు సంధించకుండాకూడా బహుమానాలనందుకునే దౌర్భాగ్యం దాపురించింది. కుల మతాలకు దగ్గరగానే కుళ్ళు రాజకీయం కులీనమనుకునేలా ప్రవర్తిస్తున్నది. ప్రశ్నలలో నిప్పు స్థానంలో నీళ్ళు ప్రవేశించడం మొదలయింది. మనిషి దుర్మార్గాలకు సోదాహరణంగా నిలవడం మొదలయింది. ఇక ఎవరిని పశ్నించాలి ఎందరిని ప్రశ్నించాలి? గంపగుత్తగా అంతటా కాలుష్యమే రాజ్యమేలుతుంటే పీల్చీ గాలిని కూడా మనమే కలుషితం జేసుకుంటూ పోతుంటే ప్రశ్నలకింకా విలువేముంటుంది? అందుకే ప్రశ్నించినా సరయిన సమాధానం రాబట్టలేమని తెలిసి ప్రశ్నించే ధోరణికే స్వస్తిచెప్పే ఆలోచనలో ఉన్నాను. కోట్లను అధికారాన్నడ్డంపెట్టుకుని పోగేసుకున్న జద్విఖ్యాతులూ వాగ్దాన వర్షంలో జనాన్ని తడిపి ఆతర్వాత తప్పించుకు తిరిగే నాయకమ్మన్యులూ మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుని ప్రవర్తించే రోజులు అతి సమీపంలో ఉన్నాయని గమనించి మరీ మీ గమ్యాన్ని గమనాన్నీ మార్చుకునేలా చూసుకోండి అదే చాలు అదే పదివేలు-- ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hi654h
Posted by Katta
by Ravela Purushothama Rao
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hi654h
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి