పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
ShilaLolitha Poet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ShilaLolitha Poet లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2014, ఆదివారం

ShilaLolitha Poet కవిత

అమ్మకం ధర ========== హోల్సేల్ అబ్బాయి ధర -3 లక్షల రిటైల్ లైవ్ అమ్మాయిధర జీవితాంత సేవ డ్రెసెడ్ చికెన్ అమ్మాయి -నిలువెల్లా బంగారం -భారీ ఎత్తున వస్త్రాల సేకరణ స్కిన్లెస్ -తోలు వలిచి ఏం చేసుకున్నా మీఇష్టం బోన్ లెస్ -ఏం చేసుకున్నా మీ ఇష్టం ఎముకలు , తల లేని వేలాడే మొండెం -నిన్నెప్పటికి ప్రశ్నించలేని నీ ,ఇగోని' తృప్తి పరిచే నిధి ఇవన్నీ నిన్నటి ధరలు రేపటి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. త్వర పడండి త్వర పడండి------

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pqSR85

Posted by Katta

1, జూన్ 2014, ఆదివారం

ShilaLolitha Poet కవిత

శిలాలోలిత || మొగలిపువ్వూ- నంది వర్ధనం ----------------------------------------------- ఆమె ఒక నందివర్ధనం. నవ్వుతూ తుళ్ళుతూ పారే సెలయేరు. చదువుల పర్వతాలనధిరోహించిన ధీర వనిత.సంస్కారపు నదీ పాయల్ని చుట్టుకొన్న మెరుపుతీగ. అమ్మా నాన్నలు కలల గూడుకి తలుపులు తెరిచారు. నందివర్ధనానికి పెళ్లయింది. ఆమె ముందంతా సహచరత్వపు భవిష్యత్కాంతులే ! అతడు ఒక మొగలి పువ్వు. ఉత్సాహ ఉద్వేగాల కెరటాల హోరు.చదువుల ఋతువులన్నింటా మెరిసే ధీర హృదయుడు. అహంభావపు పొరలు కమ్ముకున్న సగటు మనిషి. 1 అమ్మానాన్నలు కలలగూడుకి తలుపులు తెరిచారు. మొగలి పువ్వుకీ పెళ్లయింది. అతడి ముందంతా ఆమెలో తానెలా నిరూపించుకోవాలనే. నందివర్ధనానికి కొత్తే. అన్నీ చెప్పిన అమ్మానాన్నలు అసలు విషయాలు తెరమరుగునుంచారు. 2 మొగలి పువ్వుకీ కొత్తే. మిత్రుల ముందు చర్చోపచర్చలు. ఓ మిత్రుడి చిటికెనవేలు పట్టుకొనివెళ్లి,శృంగార కవాట ద్వారాలు తెరిచాడు. నందివర్ధనానికి,మొగలిపువ్వుకీ మొదటి రాత్రి. ఆమెకంటే తానెంత ఆధిక్యుడో అన్నీ తెలిసిన మేధావో తెలపాలని అతనిలో తీవ్రకాంక్ష. 3 వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును,వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అసలు కధ అప్పుడే మొదలయింది. నాంది ప్రస్తావనలు ఐపోయాయి.విష్కంభ చర్యలు ముగిసాయి.భరతవాక్యం ఎదురైంది. ఆమెకు ,అతడికీ తెలీకుండానే క్రిమీకరణ ప్రవేశంతో ఖాళీశరీరంలో బ్రహ్మజెముడు మొలిచింది. ఆమెకివేమి తెలీకుండానే తల్లయింది, ఇంట్లోనే కాన్పయింది.అంతా బాగానే ఉంది. కానీ, కొన్నాళ్ళకు ‘బ్రహ్మజెముడు’ ముళ్ళను ఒళ్ళంతా రాసుకుని మొగలిరేకులతో యుద్ధానికి దిగింది. అప్పుడెప్పుడో కాలుజారినపుణ్యం కాస్తా ఫలవంతమైందని తెలిసే లోపు జ్ఞానం కొరవడింది. అది ఆమె నుంచే తనకు వచ్చిందనే పొగరుతో అనుమానపురంపాలతో ఆమెపై యుద్దాలు. తెల్ల బోయిన ఆమె తేరుకొనేలోపు ఛీత్కారాల చెత్తబుట్టలో విసిరేయబడింది. ఆమె కున్న అక్రమ సంబంధాల వల్లేనని ద్రోహలేఖను మరణవాంగ్మూలంలా రాసి ఉరి తాడును ఆశ్రయించింది మొగలి పువ్వు. కటకటాలవెనుక నందివర్ధనం.ఇదీ వీళ్ళిద్దరి జీవితం! 4 పెళ్లికి ముందే ,ప్రేమకు ముందే పరీక్షలు చేయించుకున్నా, అక్రమసంబంధాలవైపు చూడకున్నా,సరైన లైంగిక విజ్ఞానమున్నా,తొలినాళ్లలోనే చేయించుకున్నా ఈ రోజు.... నందివర్ధనం స్వచ్చంగానూ, మొగలిపువ్వు ముసిముసి నవ్వులతోను మనముందే ఉండేవారు నిరాశ కంటే ఆశ గొప్పది.’ఆశ’ చేరువున్న మనిషికి నిరాశ ఉండదు. విలువలు మనిషిని ఉన్నతాకాశంలో నిలబెడతాయి. ప్రలోభాలు మనిషిని పాతాళానికి దిగజార్చుతాయి. 5 మరణించాల్సినంత నేరాలు వాళ్ళేంచేసారు? మొగ్గలోనే రాలిపోకుండా నిలిచి వెలగాలంటే.... తల్లిదండ్రుల అవగాహనానేపధ్యంలో, సమాజ కరుణహస్తాలతో ‘ఆశను’ ప్రోది చేసి, రాలిపోతున్న సుమాలను మళ్ళీ బ్రతికించుకోవాలి. నందివర్ధనం తెల్లటి నవ్వుతోను, మొగలిపువ్వు పరిమళభరితంగానూ మనముందుండే రోజుకోసం స్వప్నిద్దాం. # [ఎయిడ్స్ డే సందర్భంగా >2008]

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gSfDoS

Posted by Katta

30, మే 2014, శుక్రవారం

ShilaLolitha Poet కవిత

ఇటీవల ఎక్కువగా 'కవిసంగమం' చూసే అవకాశం కలుగుతోంది. ఇన్నేళ్ళ నా సాహిత్య జీవితంలో ఇన్నిన్ని కవితలు ఒకచోట చూసే అవకాశం; మరీ ముఖ్యంగా కొత్త తరం కవులు అద్భుతంగ కవిత్వం రాస్తుండటం ఎంతో సంతోషాన్ని కల్గిస్తుంది. ఇటువంటి వేదికలు ఎంత ఉపయోగమో, కవిత్వం- నిత్య కవిత్వ ఉత్సవంగా మారడానికి పరిణమించడం బాగుంది. ఫేస్ బుక్ ను 'కవిసంగమం' ఇలా కవిత్వం కోసం ఉపయోగిస్తుండటం ఎంతో ముచ్చటేస్తుంది.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rpAQLf

Posted by Katta

23, మే 2014, శుక్రవారం

ShilaLolitha Poet కవిత

అనగనగా ఓ ఇల్లు ........*** ********************************* ఉదయం ----------- అతడు- ప్యాంటు చొక్కా తొడుక్కొని వెళ్తాడు ఆమె ఇంటిని కూడా తొడుక్కుని వెళ్తుంది. ఆమెనడుస్తున్న ఇల్లులా ఉంటుంది. పొగచూరిన పొయ్యిలా ఉంటుంది. మధ్యాహ్నం ------------------ ఫోన్లూ,సిగరెట్లు పరామర్శల' టీ' ల మధ్య పని చెయ్యకుండానే చేసి నట్లుండే అతను- అన్ని సీట్ల వర్కు ఒక్కతే చేసి పెత్తనాల మధ్య ,బాక్సులో చల్లారిన అన్నాన్ని కుక్కుకుంటూ అలసటతో ఆమె- సాయంత్రం ------------------ సీడీలు,మల్లెపూలతో రిలాక్స్ కోసం బడ్జెట్లు, బాధ్యతలు, చిట్టా విప్పనియ్యని అతను- కూరలు,తినుబండారాలు,నిస్సత్తువతో లగేజీలా ఆమె - కామా పెట్టిన పనులూ,పిల్లలూ, కల్లలు కావంటూ ఆమె- అతడు ------------ ఛి ! నువ్వేప్పటికి నా ప్రియురాలివి కాలేవు. ఛా! నువ్వెప్పటికీ నా చెలికాడివి కాలేవు. హు- ఈ అమ్మా నాన్నలు 'బిడ్డల శిక్షణ,' నెప్పుడు నేర్చుకుంటారో???

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oo600W

Posted by Katta

21, మే 2014, బుధవారం

ShilaLolitha Poet కవిత

కవిత్వం గురించి బివివి ప్రసాద్ గారు రాసిన కామెంట్ : నచ్చిన కామెంట్ ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ".....కాస్త పెద్ద కవిత రాసినపుడల్లా అభివ్యక్తి పలుచన అయిందా అనిపిస్తుంది. కానీ, ఆ వస్తువూ, దాని ద్వారా ఇవ్వదలచిన అనుభూతీ అట్లా వచ్చినపుడు, బిగింపు కోసం అతిగా ఎడిట్ చేసినా, లేదా మరికొన్ని ఊహల్నో, పోలికల్నో జతచేసినా కవితలో ఉండవలసిన మౌలికమైన సౌకుమార్యం చెదిరిపోతుంది అనుకొంటాను. కవిత్వం రాసే అనుభవం ఏ కవికి ఆ కవిదే. ఒక సాంద్రమైన లేదా సుకుమారమైన అనుభూతినో, లోతైన ఆలోచననో అక్షరాల్లోకి మార్చే ప్రయత్నమే కవిత అవుతుంది నా వరకూ. రాసాక వెనుతిరిగి చూసుకొన్నపుడే ఈ కవిత శిల్పం, అభివ్యక్తీ ఇలా వచ్చాయి కదా అనిపిస్తుంది. కొన్ని బలమైన వ్యక్తీకరణలు స్పురించటం మాత్రం కవి సాధన చేసిన ఆంతరికశుద్ధి వలన, కవిలో మేలుకొన్న విశ్వ మానవుని వలనా సంభవిస్తుంది అనుకొంటాను. కవిత్వం సాధన చేయటమంటే అక్షర సాధన కాదనీ, వ్యక్తిత్వ సాధన అనీ అనిపిస్తుంది. ఆ వ్యక్తిత్వం కవి జీవితం మొత్తానికి చెందినదా, ఆర్ట్ వరకే పరిమితమా అనేది మరొక తరచి చూడవలసిన విషయం."

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nesXqu

Posted by Katta

18, మే 2014, ఆదివారం

ShilaLolitha Poet కవిత

బసవి ----------- ఆమెప్పుడు నవ్వగలదు? ఆమెప్పుడు నడవగలదు? మాట్లాడగలదు? అందరిలాంటి మనిషిగా జీవించగలదు? చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను చెట్టుబెరడు లాంటి శరీరం భావరహితమైన గాజు కళ్ళు ఆకలితో అలమటించే ఒళ్ళు పగలంతా వెలివేత రాత్రంతా జాగారం ఊరందరి ఆకలిని ఊరంతటి అమానుషత్వాన్ని మదమెక్కిన పిశాచుల క్రౌర్యాన్ని శరీరమున్నందుకు ఆడదానిగా అవయవమున్నందుకు మరల మరల మరల మరలా ఆమె చిన్నభిన్న మౌతూనే ఉంది వావి వరసలు లేనిఊరుమ్మడి బతుకామెది జోగుతున్న వ్యవస్థలో జోగిని'' ఆమె ఏ ఇంట్లో చావుమేళం మోగినా ఆమె తాగి ఆడాల్సిందే ఎవడెక్కడ చెయ్యి పెట్టినా ఎవడెప్పుడు అనుభవించినా అడ్డు చెప్పకుడదన్నదే ఊరి నీతి! కట్టిన గజ్జెలు మోగుతూనే ఉన్నాయి పుట్టిన పిల్లలు దోపిడీకి గురవుతూనే ఉన్నారు అందరి అందరందరి వీర్యాల చిత్తడిలో ఆమె లుకలుకలాడే పురుగులు తింటున్న శరీరంతో హీనంగా,హేయంగా,దీనంగా మనమున్దింకా నిలబడే ఉంది నెమ్మది నెమ్మదిగా లేవడానికి ప్రయత్నిస్తోంది మీరూ,నేనూ, మనమూ కలిసి జోగిని' ని మనిషిగా జీవించనిద్దాం! మహారి,నాటి,మురళి,తెవార్, డియార్,బసవి,జోగిని, పార్వతి,ముత్తామ్మ, తామమ్మ,-పిలుపేదైతేనేం? భాషేదైతేనేం, ప్రాంతమేదైతేనేం మన ముందే కాలుతున్న శరీరంతో ఆమె కూలుతున్న శరీరంతో ఆమె- ఆమెప్పుడు హాయిగా నవ్వగలదు? ఆమెప్పుడు ధీమాగా నడవగలదు? స్వతంత్రంగా మాట్లాడగలదు? మనిషిగా జీవించగలదు? మనమందరం మనుషులుగా ఆలోచించినపుడు ఆమె హక్కులకై పోరాడినప్పుడు ఆమె కూడా నవ్వగలదు.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sHxLSe

Posted by Katta

13, మే 2014, మంగళవారం

ShilaLolitha Poet కవిత

శిలాలోలిత | రోబోట్ ......................... ప్రాణమున్న రోబోట్లం మనం. మనకై మనం నవ్వం, మాట్లాడం, కలిసిరాం. యంత్రాలమై, మరమంత్రాలమై శవాలమీంచి, సమాదులమీంచి, సహృదయులమీంచి శతకోటి అన్యాయాల మీంచి నడిచి వెళ్లిపోతుంటాం. మననుంచి ఎప్పుడో జారిపడిపోయిన పాదరసపు బొట్టు మన మనసు. ఎప్పుడు ఎక్కడ ఎలా జారిందో తెలీదు. ఇకనైనా స్పృహలోకి వచ్చి ఆ పాదరసాన్ని పున:ప్రతిష్ట చేస్తే మనుషులుగా బతకొచ్చు కొనఊపిరి నిత్య శ్వాసగా మిగలొచ్చు.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l7ENNk

Posted by Katta

22, ఏప్రిల్ 2014, మంగళవారం

ShilaLolitha Poet కవిత

కాంతి + కాంతి = చీకటి. -------------------------------- ఆమె ఒక కాంతి అతడు ఒక కాంతి కాంతి తరంగ శృంగం కాంతితరంగ ద్రోణితో కలగలిస్తే చీకటి చారిక ఈ భూప్రపంచంలో కౌటుంబిక నిలయాల్లో కాంతి వలయాల ఆ వర్తనాల్లో అతడు ఆమెల కాంతి ప్రయాణాల్లో ఇంకెన్నాల్లీ చీకటి దారులు పెద్ద కాంతులు చిన్న కాంతులుండవు ఆ ధిపత్యాల అహంకారాల విభజన రేఖలుండవు. లేని రేఖలతో ఉన్నట్లు ఊహించే కుట్రలే- అతడు ఆమెలు సమాన కాంతులే అహాలు మరిస్తే వెలుగు పుంజాలే బ్రతుకంతా వెన్నెల పుప్పోడులే. అతడు శృంగమ్ స్థాయిననుకొని ఆమెను ద్రోణి స్థాయిలోకి నెట్టివేస్తే- అతడే కాదు సమాజమూ చీకటి మొహాన్ని తోడుక్కోవాల్సివచ్చింది. మనసులు కలవాల్సిన చోట కలవకపోతే మానవత్వపు పరిమళాలు మలినమైతే మనిషితనానికి వీడ్కోలు చెబితే ఆర్ధిక సంబంధాలే జీవితాన్ని నిర్దేశిస్తే ఆమె కూడా సాటి మనిషేనన్న ఇంగితం కొరవడితే కాంతి+ కాంతి= చీకటే.

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rdcwc4

Posted by Katta

20, ఏప్రిల్ 2014, ఆదివారం

ShilaLolitha Poet కవిత

ఉమ్మ నీటి సరస్సులో~~~__ ________________ అదొక చిగురు మొగ్గ అప్పుడే పూచిన లేలేత పరిమళం హిమాగ్ని జ్వాలల్లో ఉదయించే దీప శిఖ చీకటి గర్భ కుహరాల్లోంచే ఆలోచనల మొలకల్ని జల్లుకుంటూ వచ్చింది మునగ దీసుకుని పడుకున్న క్షణాల్లోనే తానెవరో తెలీక పోయినా స్కానింగ్ కిరణాలు ఒళ్ళంతా తడిమి తొలిసారిగా తానెవరో చెప్పినప్పుడు ఒక్క అమ్మ తప్ప అందరూ వాడిన మాటల కత్తుల గుత్తులు నాపై జళిపించి నప్పుడు తొలిసారిగా చెవులున్నందుకు దుక్కం వచ్చింది నన్ను నేనే చూసుకోలేక పోతున్నాను నాపై అప్పుడే ఈ యుద్దరావాలేమిటి ? నా ఒంటరి పోరాటానికి మొదటి మెట్టు మొదలైనదప్పుడే ! నా కోసం అమ్మ చేస్తున్న పోరాటానికి అమ్మా!నేనున్నానని చెప్పాలని తపన గుండె ఉంది కానీ గొంతు లేదు కదా బాధ ఉంది కానీ చూపించలేను కదా మనిషినేకానీ సగం మనిషినే కదా ! ఈ ఉమ్మనీటి సరస్సులోనే నేనొక నెత్తుటి కలువై ఒలికి పోతానో రవ్వల మెరుపై వెలుగు చూస్తానో తెలీదింకా కానీ నాకు మా అమ్మ ఒళ్ళో ఒదిగి పోవాలనుంది!

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i28Low

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

ShilaLolitha Poet కవిత

తెగనిముడి ________ నల్ల బుట్టనిండా చితికినశరీరాలు గోధుమ త్రాచులా ఒక దాన్నొకటి అల్లుకున్నాయి గంప కింద గిజగిజ లాడే ప్రాణి లా మృత్యువు చుట్టేసి నప్పుడల్లా దానిఆను పానూ చూద్దామనే ప్రయత్నం రుపమూ శబ్దమూ లేనిదయి కళ్ళు కాళ్ళు లేకపోయినా అమాంతంగా ఎత్తుకెళ్ళి పోయే డేగ ప్రెమలూ పిల్లలూ కుటుంబము కలలు కన్నీళ్ళు జీవితమూ కలబోసిన బతుకు కుండలో నీళ్ళోలుకుతున్న చప్పుడు తన వాళ్ళ వయిపు జీడి పాకంలా సాగే మనసు ఒక నిర్వి కల్ప నిరామయ స్థితిలో చడి చప్పుడు లేకుండా వెళ్లి పోతుంది ఇన్నాళ్ళు ప్రేమించింది శరీరాన్నా? మనసునా? మనసైతే నాతోనే నాలోనే ఉంది కదా? మరి దిగులెందుకిక! శరీరాన్నే ప్రేమించి నట్లయి తే_ బాహ్య కర్షణానాది? శరీరంతో మాట్లాడిన మనసునా మనసును చుట్టుకొన్న శరీరాన్నా? ? దేన్ని ప్రేమంటారు? అసలు పోయింది ఏమిటి? ఉన్నదేమిటి?ఉండీ లేని దేమిటి? నేనా? నువ్వా? ఇంకొకరా ?ఒకరింకొకరా? ఈ ముడి ఎంతకీ వీడడం లేదు

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gTTswb

Posted by Katta

9, ఏప్రిల్ 2014, బుధవారం

ShilaLolitha Poet కవిత

సముద్రఘోష ఎడారులుఒకప్పటి సముద్రలేనేమో ఎడారుల్లోని నత్తగుల్లను చెవి కానిస్తే సముద్రమై ఘోషిస్తుంది నత్తగుల్ల ఘనీభవించిన సముద్రానికి ప్రతీక నత్తగుల్ల విన్పించే హోరు అనంతానంత రహస్యాల నివేదిక ఆ నివేదికల శబ్దంలో నేను ఎప్పటికైనా సముద్రంలా మారతాను సముద్రమే నా గమ్యం నత్త గుల్ల నినదించే హోరు సారాంశం ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేనేమో కాలం జీవితాన్ని ఎడారిని చేసి నత్తగుల్లల్లా మార్చింది కాబోలు ఎల్లవేళలా నత్తగుల్ల విన్పించే హోరు లాంటి నిరంతర పోరాట శబ్దం

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n2UqXN

Posted by Katta