పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Subhash Koti లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Subhash Koti లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జూన్ 2014, సోమవారం

Subhash Koti కవిత

కొత్తబాట Posted on: Mon 09 Jun 05:07: 2014 ఇన్ని బాటల మధ్య ఒక కొత్తబాట వేయడం సులువేం కాదు ఇన్ని మాటల మధ్య కొత్తగా మాట్లాడటం ఇన్ని యుగళగీతాల గందరగోళాల మధ్య ప్రళయపోరాట గీతమెత్తుకోవడం సులువేం కాదు మళ్ళీ మళ్ళీ చౌరస్తాలో నిలబడతావ్‌ ఏ బాటైనా గమ్యానికి చేరుస్తుందా పున: పున: పరిశీలిస్తావ్‌ ఏ బాటైనా తనను తాను సరిచూసుకుంటుందా సరిచేసుకుంటుందా తనను తాను పునర్నిర్వచించుకుంటుందా పునాదుల్ని పునర్నిర్మించుకుంటుందా శ్రామికవర్గ వెన్నెముకను సమకూర్చుకుంటుందా ఎదురుచూస్తావ్‌ తప్పిపోయిన తల్లిరాకకై పిల్లవాడు ఎదురుచూసినట్టు వేచిచూసి, వేచిచూసి, అలసి సొలసి కమ్ముకుంటున్న నిరాశల అమావాస్యలో ఆకాశాన్ని చూస్తావ్‌ ఆశయాల నక్షత్రాలు చిరంజీవులై వెలుగుతూ వుంటారు మళ్ళీ అన్వేషణ మొదలెడతావ్‌ ఆశల పక్షులెగురుతాయి ప్రయాణం కొనసాగుతుంది. - నవీన్‌ సెల్‌: 9493320208 ( జూన్ 8, 2014 నాడు " ప్రజాశక్తి " దినపత్రిక ఆదివారం అనుబంధం " సోపతి " లో ప్రచురించబడింది. )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kZx41V

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Subhash Koti కవిత

రాంప్రసాద్ బిస్మిల్ రాసిన ఈ గజల్ అష్ఫాఖుల్లాఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, షహీద్ భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య యోధుల నోట్లో ఎప్పుడూ ఉండేది.నిజంగా వాహెద్ భాయ్ అనువాదానికి నేను శిరసువంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాం ప్రసాద్ బిస్మిల్ గారి గొప్ప దేశ భక్తి గీతానికి , మీ గొప్ప అనువాదం తోడైంది. ఎంత గొప్ప గజల్ ఇది . ప్రతి భారతీయుడూ తప్పక చదివి నిత్యం మననం చేసుకోవాల్సిన గీతమిది. subhash Koti గారు రాంప్రసాద్ బిస్మిల్ రాసిన ప్రముఖ గజల్ అనువాదం రాయమని చెప్పారు. సాధ్యమైనంత వరకు బిస్మిల్ రాసిన గజల్ భావాన్ని ఇక్కడ ఇస్తున్నాను. సుభాష్ గారు పోస్టు చేసిన వర్షన్లో కేవలం 6 షేర్లున్నాయి. కాని బిస్మిల్ రాసిన కవిత చాలా పెద్దది. నాకు లభించినంత వరకు ఆ కవితను సేకరించి ఇక్కడ పోస్టు చేస్తున్నాను. సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై దేఖ్ నా హై జోర్ కితనా బాజు యే ఖాతిల్ మేం హై (సర్ ఫరోషీ అంటే అర్ధం తలను తెగనమ్ముకోవడం. భావార్ధం ప్రాణాలు ధారబోయడానికి కూడా సిద్ధం కావడం. తిరుగుబాటుకు పూనుకోవడం) ప్రాణాలు త్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది హంతకుడి భుజాల్లో బలం ఎంతుందో చూద్దాం ఏక్ సే కర్తా నహీం క్యోం దూసరా కుచ్ బాత్ చీత్ దేఖతాహూం మేం జిసే ఓ చుప్ తేరీ మెహఫిల్ మేం హై (ఓ దేశమా) ఒకరితో ఒకరు ఏదీ మాట్లాడరేమిటి నీ గోష్ఠిలో ఎవరిని చూసినా మౌనంగానే ఉన్నారు రహ్ బరే రాహే ముహబ్బత్ రహ్ న జానా రాహ్ మేం లజ్జతె సహ్రానవర్దీ దూరి యే మంజిల్ హై (లజ్జత్ అంటే మజా. సహ్రానవర్దీ అంటే ఎడారిలో తిరుగాడడం) ప్రేమదారిలో మార్గదర్శీ నువ్వు దారిలో ఆగిపోకు ఎడారిలో తిరుగాడే మజా గమ్యం దూరంగా ఉన్నప్పుడే బాగుంటుంది యుం ఖడా మక్తల్ మేం ఖాతిల్ కహ్ రహా హై బార్ బార్ క్యా తమన్నా యే షహాదత్ భీ కిసీ కే దిల్ మేం హై వధ్యస్థలిలో హంతకుడు నిలబడి పదే పదే అడుగుతున్నాడు అమరత్వం పొందే కోరిక ఎవరి హృదయంలోనైనా ఉందా అంటున్నాడు యే షహీదె ముల్కో మిల్లత్ మైం తేరే ఊపర్ నిసార్ అబ్ తేరీ హిమ్మత్ కా చర్చా గైర్ కీ మహఫిల్ మేం హై దేశం కోసం బలిదానం చేసిన వారికి తలొంచుతున్నాను ఇప్పుడు మీ ధైర్యసాహసాల చర్చ పరుల (శత్రు) గోష్ఠిలో జరుగుతోంది వక్త్ ఆనే దే బతాదేంగే తుఝే అయ్ ఆస్మాం హమ్ అభీ సే క్యా బతాయేం క్యా హమారే దిల్ మేం హై సమయం వచ్చినప్పుడు ఆకాశమా నీకు చెప్పేస్తాం ఇప్పుడే మా గుండెలో ఏముందో నీకేం చెప్పాది? ఖీంచ్ కర్ లాయీ హై సబ్ కో ఖతల్ హోనే కీ ఉమ్మీద్ ఆషికోంకా ఆజ్ జమ్ ఘట్ కూచ యే ఖాతిల్ మేం హై హతమవ్వాలన్న ఆశే అందరినీ లాక్కుని వచ్చింది ప్రేమికుల గుంపు నేడు హంతకి వీధిలో ఉంది హై లియే హతియార్ దుష్మన్ తాక్ మేం భైఠా ఉథర్ ఔర్ హమ్ తయ్యార్ హై సీనా లియే అప్నా ఇధర్ ఆయుధాలతో శత్రువు కాపు కాసి ఉన్నాడక్కడ మేమూ మా రొమ్ము విరుచుకుని సిద్ధంగా ఉన్నామిక్కడ ఖూన్ సే ఖేలేంగె హోలీ గర్ వతన్ ముష్కిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై దేశం కష్టాల్లో ఉంటే నెత్తుటితో హోలీ ఆడతాం ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది. హత్ జిన్ మేం హో జునూన్ కట్ తే నహీ తల్వార్ సే సర్ జో ఉఠ్ జాతే హై ఓ ఝుకతే నహీం లల్ కార్ సే దేశప్రేమ ఉన్న చేతులు కరవాలాలతో తెగి రాలవు లేచిన తలలు బెదిరింపులతో కిందికి వాలవు ఔర్ జో భడ్కేగా షోలా సా హమారే దిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై మా గుండెల్లో ఉన్న నిప్పుకణం ఇంకా భగ్గుమంటుంది ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలో ఉంది హమ్ తో నికలే హీ థే ఘర్ సే బాంధ్ కర్ సర్ పే కఫన్ జాం హథేలీ పర్ లియే లో బఢ్ చలే యే ఖదమ్ (కఫన్ అంటే శవవస్త్రం. సమాధి చేసే ముందు మరణించిన వ్యక్తిని రెండు తెల్లని వస్త్రాల్లో చుడతారు. దాన్ని కఫన్ అంటారు. సర్ పే కఫన్ బాంధ్నా అంటే ప్రాణత్యాగానికి సిద్ధపడడం. జాం హథేలీ పర్ లేనా అంటే ప్రమాదాలను ఎదిరించడం. తెలుగులో అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అన్న సామెత ఇక్కడ పొసగదు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవడం అంటే భయపడుతూ బతకడం అన్న భావం ఉంది. జాం హథేలీ మేం లేనా అంటే ప్రమాదాలను ఎదిరిస్తూ ప్రాణాలు ధారబోయడానికి సిద్ధపడడం అన్న భావం ఉంది) మేం ఇంటి నుంచి ప్రాణత్యాగానికి సిద్ధపడే వచ్చాం ప్రాణం చేతపట్టి అడుగులు ముందుకు వేస్తున్నాం జిందగీతో అప్నీ మెహమాం మౌత్ కీ మహ్ఫిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై జీవితం ఒక అతిథి మాత్రమే, మనం మృత్యు గోష్ఠిలో ఉన్నాం ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలోనే ఉంది. దిల్ మేం తూఫానోంకి టోలీ ఔర్ నసోం మేం ఇంక్విలాబ్ హోష్ దుష్మన్ కే ఉఢాదేంగే హమేం రోకో న ఆజ్ (హోష్ ఉఢాదేనా అంటే నిర్ఘాంతపోయేలా చేయడం) గుండెలో తుఫానులు, నరనరాన విప్లవం శత్రుగుండెలో నిద్రపోతాం, ఆపకండీ రోజు దూర్ రహ్ పాయే జో హమ్ సే దమ్ కహాం మంజిల్ మేం హై సర్ ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మేం హై మాకు దూరంగా ఉండేంత ధైర్యం గమ్యానికి లేదు ప్రాణత్యాగం చేసే కోరిక హృదయంలోనే ఉంది. ఓ జిస్మ్ భీ క్యా జిస్మ్ హై జిస్ మేం న హో ఖూనె జునూన్ తూఫానోం సే క్యా లఢే జో కష్తీ యే సాహిల్ మేం హై దేశప్రేమ లేని శరీరం కూడా ఒక శరీరమేనా ఒడ్డునున్న పడవలో తూఫానులతో పోరాటమా (చివరి షేర్ లో బిస్మిల్ పేరు తఖల్లుస్ గా కనబడుతుంది, చాలావర్షన్లలో ఈ షేర్ లేదు. సుభాష్ గారు పోస్టు చేసిన వర్షన్లో ఉంది.) అబ్ న పహలే వల్వలే హై ఔర్ న అర్మానోం కి భీడ్ ఏక్ మిట్ జానేకి హసరత్ అబ్ దిలే బిస్మిల్ మేం హై మునుపటి ఉత్సాహము, కోరికలు ఇప్పుడు లేవు బలై పోవాలన్న ఆశే ఇప్పుడు బిస్మల్ హృదయంలో ఉంది.

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kWtqWm

Posted by Katta

15, మే 2014, గురువారం

Subhash Koti కవిత

గజల్ ఒక అగ్ని ~~~~~~~~~~~ ఫైజ్ షేర్ లక్షణం గురించి ఒక గొప్ప షేర్ చెప్పాడు, మరణానికి నాలుగైదు రోజుల ముందు; " జలేన జగ్ మే అలావోతో షేర్ కిస్ మక్సద్ " " చలి మంట అంత కూడా లోకానికి వేడి ఇవ్వకపోతే, ఇక షేర్ వల్ల ఏమి ప్రయోజనము? " అందుకేనేమొ గజల్ ఒక అగ్ని అంటారు శేషేంద్రగారు. అంటే కవిత మనిషిలో వేడిని పుట్టించాలి.వేడి అంటే శ్రోత గుండెలో చుర్రుమనాలి.విన్న వెంటనే నోట్లో నుంచి ' వాహ్ ' అనే శబ్దం రావాలి.కావ్యం లోంచి అలంకారం తీసేస్తే నిప్పులో నుంచి ఉష్ణం తీసేసినట్లవుతుంది. ఈ అగ్నిని సృష్టించడానికి ఉర్దూ కవి జీవనాగ్నుల్లో ప్రయాణం చేసి తప్త సువర్ణం అవుతాడు. ఉదాహహరణకు చాలా ఉష్ణోగ్రత ఉన్న ఫైజ్ షేర్ మరొకటి చూడండి; " జిస్ ధజ్ సే కొయీ మక్తల్ మే గయా ఓ షాన్ సలామత్ రహతీ హై యే జాన్ తో ఆనీ జానీ హై ఇస్ జాన్ కీ తో కోయీ బాత్ నహీ- " అలంకరిచుకొని ఉరికంబం వైపు నడచిన అతని తేజస్సు, శాశ్వత శుభం కలిగి ఉంటుంది;ఈ ప్రాణమా వస్తూ, పోతూ ఉండేది,; అదంత గొప్ప విషయం కాదు..." ఈ షేర్ వీరుల ధైర్యాన్ని, వారి నిబద్ధతను మరియు ప్రాణాలను తృణప్రాయంగా భావించే త్యాగనిరతిని వర్ణించాడు కవి. అమరుడైన భగత్ సింగ్ త్యాగం సరిగ్గ ఇటువంటిదే కదా. ( ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రిక 1-2-85 లో ప్రచురిత గుంటూరు శేషేంద్ర గారి " గజల్ ఒక అగ్ని " సాహితీ వ్యాసం ఆధారంగా ...)

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ltN9O0

Posted by Katta

14, మే 2014, బుధవారం

Subhash Koti కవిత

ఒక పాకిస్తానీ కవి షేర్ ~~~~~~~~~~~~~~~ " చష్మె సాకీ ముఝే హర్ గామూ పై యాదాతీ హై రాస్తా భూలూ తో జావూ కహీ మైఖానేకా " ' ప్రియురాలి కళ్ళు నాకు జీవితపు ప్రతి మలుపులో జ్ఙాపకం వస్తున్నాయి. రస్తా ఎక్కడ మరచిపోతానో, మధుశాలకు వెడుతూ..... ' ప్రియురాలి కళ్ళపై చాలా మంది కవులు ఉర్దూలో మంచి కవిత్వం రాశారు. మచ్చుకు ఒక షేర్ ఇది . (అనువాదకుడు ; గుంటూరు శేషేంద్ర కవి )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jrTic6

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Subhash Koti కవిత

ఒక దొహా ( కవి పేరు తెలీదు ) " ప్రీతం తేరీ యాద్ మే రగే భయా సబ్ తార్ రోమ రోమ సుర్ దేత్ హై లేకర్ నాం తెహార్ " ఓ ప్రియతమా ! నీ స్మరణలో నరాలన్నీ తంత్రులై పోయాయి రోమ రోమమూ నీ నామమే జపిస్తున్నది ( గుంటూరు శేషేంద్ర గారి అనువాదమిది.)

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mRoTMr

Posted by Katta

Subhash Koti కవిత

మరొక దొహా ( కవి పేరు తెలీదు ) " ఆజా ప్యారే నయన్ మే ఫంక్ ఢాస్ తొ హెలూ నా మై దేఖూ ఔరన్ కో, నా తోహే దేఖన దూ " రా ప్రియా నిన్ను నా కనురెప్పల్లో మూసి వెయ్యనీ నేను ఇతరుల్ని చూడలేకపోవాలి,నువ్వూ ఇతరుల్ని చూడలేకపోవాలి. ( అనువాదము: గుంటూరు శేషేంద్ర కవి )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1giPbVl

Posted by Katta

4, మే 2014, ఆదివారం

Subhash Koti కవిత

పిల్లలమర్రి // నవీన్ కోటి """""""""""""""""" ఇంటి ఇరుకుల్లోంచి సంత సరుకుల్లోంచి బయటపడి నిన్ను చూడటం పరుగెత్తీ చక్రంలా పరుగెత్తీ తల్లి ఒడిని చేరుకోవటం ఒక ఉపశమనం ఒక ఆనందం నిన్ను చూస్తే గది, గదికో కొమ్మలా విస్తరించి పనుల నదై ఇల్లంతా పాయలు, పాయలై ప్రవహించే మా అమ్మను చూసినట్లే నా భార్యను చూసినట్లే నిన్ను చూస్తే నా పాలమూరును చూసినట్లే దేశదేశాల్లో పుష్పిస్తున్న నా చేతుల్ని చూసినట్లే ప్రవేశద్వారం వద్ద అడుక్కుంటున్న అవ్వలా మాజా తాగేవాళ్ళని మళ్ళీ, మళ్ళీ చూసెళ్తున్న పేదపిల్లలా లోకం కళ్ళల్లో పడకుండా వాళ్ళిద్దరే లోకమయ్యే లోకాన్ని వెదుక్కుంటున్న పడుచుజంటలా మారాం చేస్తున్న బిడ్డకి కథలవుతూ అన్నం తినిపిస్తున్న అమ్మలా నీ నీడలో ఆడుతూ, పాడుతూ పిల్లల్తో పిలగాడైన నాన్నలా పలురూపాల్లో కనిపిస్తున్న నిన్ను చూడటం నేలలో పాతుకుపోయి పురివిప్పి నిలుచున్న నెమలిని చూడటం నీకింద నిలబడి తల పైకెత్తితే ఆకుల్తో అలంకరించిన ఆకాశాన్ని చూడడం నిన్ను చూస్తూ కూర్చుంటే ఉదయం మధ్యాన్నమౌతుంది మధ్యాన్నం సాయంత్రమౌతుంది నిన్ను చూసొస్తున్న ప్రతిసారీ ఐస్ క్రీంలా కరిగిపోతున్నావని మనిషిలా సంకుచితమౌతున్నావని సముద్రం నదై పోతున్న బాధ నది చెరువైపోతున్న బాధ చెరువు కరువై పోతున్న బాధ! ~~~~~~~~~~~ ~~~~~~~ ( "పాలపిట్ట " ఫెబ్రవరి-మార్చ్ 2014 సంచికలో ప్రచురించబడినది)

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kyzepB

Posted by Katta

3, మే 2014, శనివారం

Subhash Koti కవిత

కవులంటే...... / నవీన్ కోటి ~~~~~~~ కోకిలల గొంతునొక్కితే కాకులు కవిత్వం చెబుతాయి మీరు హ్యాండ్సప్ అంటే చేతులెత్తవు అక్షరాలు మీ బుల్లెట్లకు భయపడి తూటాలు పేల్చడం మానవు అక్షరాలు ** ** కవులంటే లక్షల మంది కోసం అక్షరాలయ్యేవాళ్ళు ప్రజల కన్నీళ్ళకి కడగండ్లకి ద్రవీభవించి వాళ్ళ నాలుకల మీద నదులై ప్రవహించేవాళ్ళు *********** తేది:03-05-2014

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ncR45a

Posted by Katta

30, ఏప్రిల్ 2014, బుధవారం

Subhash Koti కవిత

శ్రీ శ్రీ జయంతి నేడు, అందుకే ఈ కవిత...... మేం నిన్ను ప్రేమిస్తాం! // నవీన్ కోటి -------------- మేం నిన్ను ప్రేమిస్తాం! మట్టిని ప్రేమించినట్టు మట్టిని ప్రేమించే మనిషిని ప్రేమించినట్టు తల్లిని ప్రేమించినట్టు తల్లిని ప్రేమించే బిడ్డను ప్రేమించినట్టు మేం నిన్ను ప్రేమిస్తాం! మహా కవీ! మంచి నీటి మహా సముద్రమా! సరుకుల్నేతప్ప మనుషుల్ని ప్రేమించలేని చోట వరిపైర్ల మధ్య పారే వాగును ప్రేమించినట్టు మేం నిన్ను ప్రేమిస్తాం! దేవుళ్ళనే తప్ప మనుషుల్ని ఆరాధించ లేని చోట పొలం ఎండిన రైతు వాన దేవుణ్ణి ఆరాధించినట్టు మేం నిన్ను ఆరాధిస్తాం! మహా కవీ! ఒంటరైన వాడి వెంట నడిచే సాహస సమూహమా! శివాలెత్తుతున్న చీకటి రాత్రి నాడు పున్నమి చంద్రుని లాగా నేడు నీ అవసరముంది మాకు నిన్నటి కంటే ఎక్కువగా! మనిషికీ మనిషికీ మధ్య మరింత ఎత్తుగా లేచిన గోడల్ని పగుల గొట్టాల్సిన పని ఉంది మాకు నిన్నటి కంటే ఎక్కువగా! మహా కవీ! నేల కూలిన వాడి చేత కవాతు చేయించే కవిత్వమా! వలలు లేని లోకంలో పక్షులెగరడం కావాలి మాకు కలలు నిజమయ్యే లోకంలో కలిసి బతకడం కావాలి మాకు! ప్రజలు విజయాన్ని స్వప్నించిన కాంక్షారణ్యమా! ఆశ చావలేదు ఎవరెస్టు ఎడారి కాలేదు సీతాకోకచిలుక ఇంకా తన రంగులు కోల్పోలేదు ఇంద్ర ధనస్సులో ఏ రంగూ మాయం కాలేదు! మహా కవీ! అనితర సాధ్యమైనా, అత్యున్నతమైన నీ మార్గం కావాలిప్పుడు! మేం నీ బాటలో నడుస్తాం ఈ రోజు కాకపోతే రేపైనా నిలుస్తాం! గెలుస్తాం! నిలిచి గెలుస్తాం! గెలిచి నిలుస్తాం! తేది:30-04-2014 ( రచనా కాలం: శ్రీ శ్రీ శత జయంతి సందర్భంగా 2009 లో )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdrIiX

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Subhash Koti కవిత

మితృలారా! ఇది అసలే ఎన్నికల కాలం.ఎన్నో కలల కాలం. కలల బేహారులు ప్రజలకు కలలు అమ్మి వోట్లు దండుకొనే కాలం. కల్లలు ఎల్లలు దాటి వరదలయి ప్రవహించే కాలం.నల్ల డబ్బు విపరీతంగా యేరులై పారే కాలం. తిట్ల పురాణాలను నేతలు సుప్రభాతం వలె గాక ప్రతి దినమూ పారాయణం చేసే కాలం. డబ్బులు దండుకొని పత్రికలు అభ్యర్థుల జయాపజయాలను హెచ్చవేసి ప్రచురించే కాలం. ఇట్టి వోట్ల రుతువు గురించి ప్రసాద మూర్తి రాసిన ఈ కవితను చూద్దాం. ఓడిపోతున్న దేశం *********** ఎవరో ఒకరు గెలుస్తారులే... నల్ల డబ్బు నాటు సారా ఆయుధాలయ్యాక అమ్ముడు పోయిన ప్రతి వోటరూ అటొ ఇటో ఒక పక్షాన సైనికుడయ్యాక... గెలిచేది ఎవడైతేనేం.. ఓడిపోయేది మాత్రం ప్రజాస్వామ్యమే.. ~~~~ ~~~~ ఎవరు గెలిస్తే ఏముంది నేస్తం.. నువ్వూ నెనూ మరేదైనా మాట్లాడుకోవడం మంచిది క్రికెట్ నుండి ఎన్నికల టికెట్ దాకా అంతా అమ్మకం కొనుగోళ్ళ లాభసాటి.. వ్యాపారమే కదా! ఎన్నికల్లో రిజర్వేషన్ మాటెలా వున్నా చట్టసభల్లో సీట్లన్నీ కోటీశ్వరులకే నోటు గెలుస్తుంది..వోటు ఓడుతుంది ఇదే పంచవర్ష ప్రహేళిక ~~~~~ ~~~~~ ఎన్నికలు ఎక్కడ జరిగితేనేం.. గెలిచేదిస్వార్థం..ఓడేది మనిషి ఎవడో ఒకడు గెలుస్తాడులే.. ఓడేది మాత్రం నువ్వూ నేనే ^^^^^^^^^^^ ^^^^^^^^^

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h38Xi4

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Subhash Koti కవిత

కల్చరల్ డాగ్ *********** జాగ్రత్త గురూ రెచ్చిపోయి నీ దేశం దరిద్రాన్ని అక్షరీకరిస్తావేమో.... పెట్రేగి నీ దేశం మత హింసను రంగుల్లో దృశ్యమానం చేస్తావేమో ఆందోళనతో నీ దేశంలో అన్యాయాలను....అక్రమాలను ఖండిస్తూ నిప్పుల సంగీతమై మండిపోతావేమో జాగ్రత్తరా బాబూ ! దేశభక్తులకు ఆగ్రహం వస్తుంది నిన్ను దేశద్రోహిగా చిత్రీకరించి చించిపారేస్తారు ******* ****** ఆకలి ఇండెక్స్ లో మన దేశం అగ్రస్తానంలో ఉందని కరిగి కరిగి కన్నీరయ్యేవు సుమా ! సంస్కృతీ పరిరక్షకులకు నరాలు తెగుతాయి నువ్వు సొంత దేశం దరిద్రాన్ని అమ్ముకునే పరాయి దేశం కిరాయి రాతగాడిగా కీర్తికెక్కుతావు ఆకలి చావులనైనా....ఆత్మహత్యలనైనా అదృష్టవంతులకు స్వర్గప్రాప్తి దొరికిందని భావప్రాప్తి పొందాలి. ప్రసాద మూర్తిగారు రాసిన ఈ కవితలో లోని కొంత భాగమే ఇది. కల్చరల్ డాగ్ ల కోపానికి ఆహుతైనట్లుంది రచయిత.సొంత అనుభవం లేకుండా రచయిత కవితను ఇంత బలంగా రాయలేడనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కౄరమైన అనుభవాన్ని ఎవరితోనైనా పంచుకుంటే , వినే వారు సామాన్యంగా కల్చరల్ డాగ్ రియాక్షన్ ఇంత దారుణంగా ఉంటుందంటే నమ్మరు. మొత్తంపైన కవి వాస్తవాన్ని సెటైర్ గాను,కవితాత్మకంగా చెప్పడం లో కృత కృత్యుడయ్యాడు.ఈ వస్తువు పై ఖాదర్ మొహియుద్దీన్ రాసిన ' పుట్టు మచ్చ ' మరియు రచయిత పేరు జ్ఙాపకం లేదుగాని ఇంకో కవిత ' లాల్ బనో గులామీ చోడో ఔర్ బోలో వందేమాతరం ' తర్వాత వచ్చిన బలమైన మూడో కవిత ఇది.

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fhQLpy

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Subhash Koti కవిత

కవిత్వం కావాలి, కవిత్వం ********* ******** ******** అసలు కవిత్వం అంత అవసరమా ? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. కవిత్వం రాయడమెందుకు ? చదవడమెందుకు ? అనే ప్రశ్నలు తరచుగా వినిపిస్తుంటాయి మనకు.అయితే దీనికి సమాధానం మనకు ' ఒక్తావియో పాస్ ' మాటల్లో వినండి." సామాజిక న్యాయం లేని సమాజం మంచిసమాజం కానట్లైతె, కవిత్వం లేని సమాజం కలలు లేని ,పదాలు లేని, మరీ ముఖ్యంగా మనిషికీ మనిషికీ మధ్య వంతెన లేని సమాజం.మాట్లాడగలం కాబట్టె మనం ఇతర జంతువుల కంటె భిన్నం. మరి భాష ఉత్కృష్త రూపమే కవిత్వం.ఒకవెళ సమాజం కవిత్వాన్ని నిర్మూలిస్తే, ఆ సమాజం ఆధ్యాత్మికంగా ఆత్మహత్య చేసుకుంటుంది." శ్రీ పుట్టపర్తి నాయాయణాచార్యులు ఒకానొక సాహిత్యగోష్ఠిలొ ఈ విధంగా చెప్పారు " మానవుడు ఆలోచనా శీలి, ఆలోచించటం అనేది మానవుడి స్వభావంలోనే ఇమిడి వుంది. ఆలోచన అనేది లేకుండా మానవునికి అస్తిత్వమే లేదు. ఉండదు.నిత్య ఆలోచనాశీలి అయిన మానవునికి గంభీరమైన ఆనందాన్ని, గొప్ప ఆహ్లాదాన్ని కలిగించేది కవిత్వం అవుతుంది." కాబట్టి కవిత్వం భాష యొక్క ఉత్కృష్ట రూపమే కాకుండా మానవుడికి మానసికానందాన్ని కలుగజేస్తుంది. ( మార్చి-ఎప్రిల్ ,2014 " కవితా !" బుల్లెటిన్ సౌజన్యంతో )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lknE3k

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Subhash Koti కవిత

అద్భుతమైన దోహా ( తెలుగు సేత: గుంటూరు శేషేంద్ర గారు ) బ్రజ్ భాషలో మొహమ్మద్ మల్లిక్ జాయిసీ చెప్పిన దోహా ఇది: కాగా కాగా సబ్ తన్ ఖాయియో, చున్ చున్ ఖాయియో మాంస్ . దో నయ్ నా మత్ ఖాయియో, పియా మిలన్ కె ఆస్: కాకీ కాకీ దేహమంతా తిను, ఏరుకుని ఏరుకుని తిను మాంసం. రెండు కళ్ళు మాత్రం తినకు,వాటిలో ప్రియుడ్ని కలిసే ఆశ మిగిలి ఉంది. ( ప్రియుడి వియోగ దుఃఖము చేత ప్రాణ మాత్రావశిష్థ అయి ఒక స్త్రీ అంటోంది )

by Subhash Koti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sZdhay

Posted by Katta