పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మే 2014, మంగళవారం

Murthy Kvvs కవిత

Mario Puzo గాడ్ ఫాదర్ నవల లోని ఇంకా కొన్ని సన్నివేశాలు..! ఇదివరకు ఓ పోస్టులో Sicilian నవల గూర్చి చెప్పుకున్నాం కదా.తరవాత దానిలో ఇంకో నవల గూర్చి చెప్పుకుందాం. అయితే ఫుజొ కొన్ని ఇటాలియన్ మూలం లోనుంచి వచ్చిన పదాలనే ఇంగ్లీష్ రచన లోను వాడతాడు.ఎందుకంటే ఈ ఆర్గనైజెడ్ నేరవ్యవస్థ ని అమెరికాకి పరిచయం చేసింది సిసిలియన్ లే గదా..!అసలు God Father రాయాలనే ఆలోచన రావడం చాలా విన్నూత్నమైనది అప్పటికి.ఎందుకంటే ఆ కధ అంతా అమెరికా లో నే జరుగుతున్నా లీడ్ పాత్రల మూలాలన్నీ ఇటలీ పరిసరాలవే..! 1901 నాటికి డాన్ తండ్రి Antonia Andolini ని సిసిలీ లో చంపివేయడం తో తన సొంత ఊరునుంచి ఓ ఓడలో పారిపోయి అమెరికా చేరతాడు.అప్పటికతను ఇంచు మించు యవ్వనదశలో ఉంటాడు.అక్కడ మురికి వాడలో ఉన్న సిసిలియన్ లు కొందరు పరిచయం అవుతారు. వాళ్ళే CLEMENZO,SAL FESSIO వీళ్ళతో కలిసి బతుకు తెరువు కోసం చిన్న స్మగ్లింగ్ పనులు చేస్తుంటాడు.అయితే ఒక మనిషి ప్రయాణం విధి ఎలా నిర్ణయిస్తుందో చూడండి. అక్కడ ఆ మురికి వాడలో ఓ వీధి రౌడి ఉంటాడు..ప్రతి ఒక్కరు వాడికి విధిగా తాము సంపాదించినదానిలో కొంత ఇవ్వాలిసిందే.వీళ ముగ్గురుని బెదిరించి 700 డాలర్లని డిమాండ్ చేస్తాడు.అతగాడిని నేను ఒప్పిస్తానులే అని చెప్పి డాన్ ఆ రౌడి ని కలిసి కొంత డబ్బు ఇస్తాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అతడిని మర్డర్ చేస్తాడు.దానితో ఆ లొకాలిటీ లోని వ్యాపారస్తులు ,మిగతా జనాలు అతనికి గౌరవం ఇవ్వడం మొదలెడతారు.మనిషి పోకడ గురించి మంచి మాటలుంటాయిక్కడ.ఎవరైతే తమను భయపెట్టగలరో ప్రజలు వారినే గౌరవిస్తారు అనేది అర్ధం అవుతుందతనికి. ఇక మామూళ్ళు ఇతనికి ఇవ్వడం మొదలెడతారు. ఇక్కడ అతని ముందు చూపు శ్లాఘించవలసినదే.ఈ విధంగా ఎంతో కాలం సాగదు.కనుక చట్టబద్దమైన వ్యాపారాలలో ఉంటూనే ...మనం ఇతరుల వ్యాపారాలని కాపాడినందుకు,వాళ్ళ గొడవలు సర్దుబాటు చేసినందుకు ధనాన్ని వసూలుచేయాలి.ఆ రకంగా సమాజం లో మంచి పేరు తెచ్చుకొంటూనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని నిర్ణయించుకుని దాన్ని అమలుచేస్తాడు.ముందు ఆలివ్ ఆయిల్ బిజ్ఞెస్ లో సంపాదించిన తరవాత Gambling,Bootlegging లాంటి వ్యాపారాల వేపు దృష్టి సారిస్తాడు. అప్పటికి అవి చట్టబద్దమైన వ్యాపారాలు కావు...కాని కాలక్రమం లో అవుతాయని ,ఆ విధంగా ప్రభుత్వాన్ని మలచవచ్చని చెబుతాడు.పెళ్ళి చేస్కుని పిల్లల్ని కనడం,ఇతర పోటీదారులతో పోరాటాలు ,క్రమేపి వ్యాపార సామ్రాజ్యాన్ని తన స్నేహితులతో బంధువులతో విస్తరించడం ఇవన్నీ రకరకాల కధనాలతో ఇతర నవల ల్లో కూడా సాగుతాయి. తన పేరుని డాన్ విటో కార్లియాన్ గా మార్చుకుంటాడు.నిజానికి అతని సర్ నేం Andolini కాని తాను జన్మించిన కార్లియాన్ గ్రామం తనకి ఎప్పటికి గుర్తుండాలని తన ఇంటి పేరుని అలా మార్చుకుంటాడు. అప్పట్లోనే డాన్ పాత్ర అంటుంది మిగతా వాళ్ళతో..ఇలా విడిపోయి బిజినెస్ చేసినందువల్ల ఏం లాభం ఉంటుంది..మొనోపలి తీసుకురావాలి ఏ రంగం లోనైన అని.దాన్ని అమెరికన్ ధనవంతులు కాలక్రమం లో ఆచరణలో పెట్టారు కూడా..! గాడ్ ఫాదర్ బాగా ధనవంతుడైన తరువాత అనాధ పిల్లల్ని చేరదీసి చదివించడం..వారికి న్యాయశాఖ లో,పోలీస్ శాఖలో ..ఇలా అనేక శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాడు.దీని వెనుక కూడా దీర్ఘ ప్రణాళిక ఉంటుంది అతనికి....ఆ పిల్లలు జీవితాంతం అతనికి..అతని పిల్లలకి ...వ్యాపారాలకి కృతజ్ఞతతో ఉండాలనేది అతని ప్రణాళిక.ఆ విధంగా చారిటీ ని కూడా అతను దూరదృష్టితో చేస్తుంటాడు. నవల మొదట్లో Mario Puzo ఒక మాటని ఉటంకిస్తాడు."Behind every great fortune, there is a crime అని..! Qualified Man అనే పదం నవల లో వస్తుంది ...దానికి అర్ధం ఏమంటే ఒక మనిషిని చంపడం లో ప్రవీణుడు అని.ఇది సిసిలియన్ ప్రయోగమే.Consigliere అనే పదం కూడా ప్రత్యేకమైనది.బాస్ కి కుడి భుజం లాంటి వాడు అని.జడ్జ్ లతోను,మినిస్టర్ల తోను,అలాగే ఇతర ముఖ్య విషయాల్లో డాన్ తరపున సంప్రదింపులు చేస్తుంటాడు.ఒక ప్రణాళిక రూపొందించి డాన్ చెప్పడం తో ఇతను తగు వ్యవహారాలతో రంగం లోకి దిగిపోతాడు.Tom Hagen డాన్ కి ఈ విధంగా ఉంటాడు దీనిలో. Lupera అంటే ఆయుధం.Omerta అంటే రహస్యంగా వ్యవహరించే ఓ విధానం.ఇలా ఇవన్నీ సిసిలీ మూలాల లోవే.ఇవన్నీ తరచూ నవల్లో తగులుతుంటాయి.యవ్వనవంతునిగా ఒంటరిగా అమెరికా లో దిగి అక్కడే వివాహమాడి ,పిల్లల్ని ఇంకా మనవళ్ళని పొంది...వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రకరకాల దశలుగా సాగే డాన్ జీవితాన్ని Eloborate గా వివరిస్తాయి.Fools die నవల్లో లో కూడా ఈ పాత్ర బాగ ఉంటుంది.సరే..అదెప్పుడైనా చెప్పుకుందాం...! --KVVS MURTHY

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jTfAba

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి