అడివమ్మ అడివి అమాయిక అడిగిందల్ల ఇచ్చే వొడిసిపోనితనం తనది నరుక్కున్నోనికి నరుక్కున్నంత తిన్నోడికి తిన్నంత దాచుకున్నోళ్ళకు దాచుకున్నంత కాలం ఏదడిగినా ఇచ్చే పిచ్చిప్రేమలతల్లి అడివి వెన్నెలల ఏరువాక అడివి, పాటల పూలపిల్లనగొయ్యి అడివి కొండవాగుల తాంబురా అడివి,మట్టిపిట్టల ఆకాశం అడివి మంచిమనసున్న మనుష్యుల ఏకైక జనభూమి అడివి నిరంతర కాలచక్రసభల సత్యాన్వేషణ తత్వగీతి అడివి మౌనంతో ప్రపంచాన్ని ఆవిష్కరించింది అడివే మనిషికి మానాభిమానాలను నిరపేక్షతో అందించింది అడివే మైదానాలు సోయితప్పినపుడు మైకం వొదిలించే పచ్చిపసరు అడివే నేల విడిచి సాము చేసే పాముల రాజ్యాన్ని పుట్టలో తొక్కేది అడివే కట్టలుపోసి జనాల్ని ముంచే నోట్లకట్టల ఆనకొండల్ని చంపే చీమలకోన అడివి నమ్మడమంటే ఎంత మహనీయమైందో అడివొక్కటే చెబుతుంది కడుపులో దాచుకుని రేపటిపొద్దుకు కంటిరెప్పైన కాపలా సెంట్రీ అడివి చిల్లం కల్లమైన ఆత్మీయతలకు తొవ్వజూపే తోడునీడ అడివే గడ్డిపరకలనుంచి అనంతఖనిజాల దాకా స్వచ్ఛసహజమైన గిరిజనాల నుండి జనతననిజాల దాకా ఒక్క అడివేరా అమ్మపాలంత తీయగా అందిస్తది ఆకలైతే అన్నంపెడ్తది, యుద్ధమంటే ఆయుధమైతది
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SXGGo7
Posted by Katta
by Sriramoju Haragopal
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SXGGo7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి