పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మే 2014, మంగళవారం

Srinivasa Balaji కవిత

శ్రీనివాస బాలాజీ || మథర్స్ డే || క్షమించమ్మ మము క్షమించు ఎంతెదిగిన అమ్మనెరుగని పసి పిల్లలం క్షమించమ్మ మము క్షమించు. ఓ రూపం కడుపులో పడ్డయాల నుంచి కాళ్లతో తన్నిన, కమ్మని స్పర్శనుకుంటివి. నవమాసాలు మోసి, నరకయాతనబడి జన్మనిస్తివి. అల్లరి, అలక,అరుపు, ఏడుపులన్నింటిని ఓర్చుకుంటివి. ఉలిక్కిపడి మెము నిద్రలెస్తే, నీ కంట కునుకు పడితే ఒట్టు. గొరు ముద్దలు తినిపించాలని అబద్దాలాడిన అమ్మవైతివి. ఎవరిజోడు వారికొచ్చి,పిల్లలై, ఎవరి గూటికి వాళ్లుబోతె సల్లగుండండని ఆశీర్వదిస్థివి. కష్టమోచ్చిన, నష్టమోచ్చిన ఎక్కరాని మెట్లేక్కితివి, తొక్కలేని గుమ్మాలు తొక్కితివి ఎండకెండి, వానాకు తడిసి కాయ,కష్టం నువ్వు జేసిన, నీడకైతే మము చేర్చితివి మంచి బుద్దులు మాకు నేర్పే సద్వులేన్నో నేర్పిస్తివి అమ్మనే సద్వనోల్లు, ఏం నేర్పలేవని ఋజువైతుంది ఇప్పుడిప్పుడే చిన్నప్పుడు ఆట్టేర్రి, వయస్సుకోస్తే అదోలోకం పెళ్ళాం వచ్చి పిల్లలోస్తే నీ ఊసే గుర్తురాదయె డబ్బుపిచ్చి, సంసార బందిఖానలో మేము పడ్తే వెలివేతకు నువ్వు గురైతివి. ఎంతమంది ఉంటేనేమి నీవంతు పనిమాత్రం ఎప్పుడు ఏదురు సూడవట్టే, కనీసం ఓ చెయేసి అసారైన దఖాలలు లేనేలేవు, అక్కున చెర్చుకున్న ఆనవాలు అస్సలు కానరావు గాని మధర్స్ డే జర్పుకోంటున్నాం నువ్వెరుగని ఈ అడవిలో క్షమించమ్మ మము క్షమించు ఎంతెదిగిన అమ్మనెరుగని పసి పిల్లలం 12.05.2014

by Srinivasa Balaji



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1giwQYv

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి