పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Niharika Laxmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Niharika Laxmi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2014, మంగళవారం

Niharika Laxmi కవిత

( వానసినుకమ్మ) ఆకాశగంగమ్మ కన్నెర్రచేయమాకు రైతన్నల మీద నింగేదో నేల మీద అలిగినట్టుంది వానసినుకమ్మ నింగీ నేలనీ కలుపరావమ్మ ............. ఆషాడం వస్తనే ఉంది ముసురులే లేవమ్మ , రైతన్నరుణాలతో గింజలు ఎరువులు కొని దున్నుకొని సినుకమ్మ నువ్వోస్తవనే ఎదురు చూస్తున్నాడమ్మ, నేలంతా ఎండిపోతున్నది పెద్దమనసు చేసుకొని ఒక్కసారి వచ్చి నేలను తడిపిపోవమ్మ ..... పంటకు తెచ్చిన పురుగులమందులే రైతుకు దిక్కగును సినుకమ్మ నువ్వు రాకుంటే ... సొమ్ములన్నీ పెట్టి కౌలుతీసుకున్న రైతు ఆగమైతడు సినుకమ్మ నేలమీదకి రావమ్మ ! వనదేవతకు జాతరలే చేస్తాము రైతుల కష్టాలే గట్టెక్కితే కరుణించవమ్మ సినుకమ్మ ! ................................... నిహారిక (24-06-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nywY4o

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Niharika Laxmi కవిత

'విషాద యాత్ర " అమ్మా ! నీ కడుపుతీపి ఆ దేవుడికి ఏమి ఎరుక ! నీ చెట్టంత కొడుకులు ,కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న కూతుళ్ళు జలసమాధి అవుతుంటే గుండెలు పగిలేల రోదిస్తున్నా కనికరించట్లే ఆ దేవుడు .......... ! క్షణకాలం ముందు నాన్న నేను బావున్న అని చెప్పి తిరిగిరాని లోకాలకుపోతావనుకోలేదు ఆ తండ్రి ! స్నేహితులతో ఆడి పాడి మధ్యలో వదిలిపోయారుగా ! అంతుచిక్కని జననాలు మరణాలు మధ్యలో ఉన్న ఈ బంధాలకు తప్పని ఈ వేదన ............... ! పార్వతి కడుపుకోత తెలిసిన శివుణ్ణి అడుగు అమ్మ బదులిస్తాడేమో ............. ? .................................. నిహారిక (9-06-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kSrjZA

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Niharika Laxmi కవిత

{అమ్మమ్మ ఇల్లేది ?} పిల్లలందరూ వేసవి సెలవులొస్తే చాలు స్వేచ్చా విహంగాలై అమ్మమ్మ ఇంటికి పయనమవుతుంటే మాకు మాత్రం అమ్మమ్మ తాతల స్మృతులే ...... ! కాకి వచ్చి ఇంటి మీద వాలగానే మేము వస్తామని ఎదురు చూసే అమ్మమ్మ చూపులే ఇంక లేవు ! అల్లరి చేయకుండా అమ్మ మాట వినమ్మ అని నా దగ్గర నిదురించవమ్మ అని అడిగే తాతయ్య మాటలు ఇంక లేవు.................... ! జున్ను పాలు ,రేగి వడియాల రుచులు ఇంక లేవు ! సెలవులకు ఎక్కడికి వెళ్ళావని అడిగే ప్రశ్నకి బదులు నా మౌనం .....కనులలో కన్నీరు.... కాసేపు బాధ ....మళ్లీ అన్నీ మామూలే ........... ! .................................. నిహారిక — 04-06-2014

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nOtwr4

Posted by Katta

1, జూన్ 2014, ఆదివారం

Niharika Laxmi కవిత

{బంగారు తెలంగాణా} రేపు రెపరెపలాడే తెలంగాణా జెండా సాక్షిగా గొంతెత్తి పాడరా " జయ జయహే తెలంగాణా జననీ జయకేతనం .... " అమరువీరుల ప్రాణాలు నాలుగుకోట్ల హృదయాలలో ఎన్నటికి సజీవం ! జయశంకర్ నీ ఆశయాల సాధనలో సత్తువ నిండిన గుండెలతో బంగారు తెలంగాణాకై మా తరం పరుగులిక ! ......................... నిహారిక 01-06-2014

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nEXrBZ

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Niharika Laxmi కవిత

{ దాంపత్యపు ముందడుగు } భర్త ...పెళ్లి పుస్తకపు మొదటి పేజీలో 7అడుగులలో మొదటి అడుగుతానై తన అడుగుజాడలో నడవమంటాడు ఎందుకో తెలుసా ............... ? జీవితపు ముళ్లబాటలో తాను ముందడుగు వేసి భార్యకు పూల బాటని పరచడానికే .......... ! ఇదే దాంపత్య మైత్రి ............! ....................... నిహారిక(13-05-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gjkiA2

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Niharika Laxmi కవిత

(నేను ... మా అమ్మ ..... ) teacherని కొట్టి schoolకి వెళ్లనని మారంచేసినా, నచ్చచెప్పి నన్ను పంపిన క్షణాలు ఎదలో పదిలం ! పళ్ళ మధ్యలో పిన్నీస్.. cycle టైర్లో కాలుని ఇరికించి ఏడుస్తుంటే నువ్వు విలవిల్లాడిన క్షణాలు పదిలం ! నువ్వు విసుగొచ్చి తిడితే మంచం కింద దాక్కొని నీతో వెతికించిన క్షణాలు పదిలం ......... ! ఇప్పటికి కలలతో నిదుర చెదిరినా పక్కనే ఉన్నానంటూ ఓదార్చి నిదురలోకి పంపే క్షణాలు పదిలం! జ్వరంవస్తే నన్ను దగ్గరికి తీసుకొని నిదుర లేని రాత్రులు ఎన్ని గడిపావో ఆ క్షణాలు పదిలం ! ప్రసవించడానికి ఎంత ఇబ్బంది పెట్టాను అని అడిగితే చిరునవ్వుతో కప్పేస్తావు ఆ భాదని ! తిననని మారంచేస్తే నేటికి గోరుముద్దలు పెడతావు , నలుగురు మా గురించి మంచిగా చెబితే మురిసిపోతావు ! ఎప్పటికి నీకు పసిపాపనే కాబట్టి ఎంత అల్లరి చేసిన ఓపికగా భరిస్తావు ! నేను ... అక్క ...నాన్నే .......... నీ ప్రపంచం ..! ఇంత అనుభందాన్ని నాకు పంచి ఇచ్చావు నీకు నేను తల్లినై కంటిపాపలా చూసుకుంటాను అమ్మా ! .................................... నిహారిక (may -11-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RCU8Nd

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Niharika Laxmi కవిత

{ మేనత్త } మనసెరిగిన ఓ అత్త మా మేనత్త ! నీ ఇంటి ముంగిళ్లలో కూర్చొని ముచ్చటిస్తాను ఎన్నో ఊసులు ! ఊ .. కొడుతూ వింటావు అత్త అలుపెరుగక ! మా మామ ముచ్చట్లు అడిగితే చిరునవ్వులే చిందిస్తావు ! చేతి గాజులే తొడుగుతావు ఈ మేనకోడలికి ప్రేమతో ........గడసరి అత్తవైనా నీకు సొగసరి కోడలినే ............... ! ............................ నిహారిక (06-05-2014)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rXRgWh

Posted by Katta

17, ఫిబ్రవరి 2014, సోమవారం

Niharika Laxmi కవిత

(ఈ ప్రేమ ) రెండు మనసులను ముడివేసి ఏడడుగులకు దారితీసి , నూరేళ్ళ జీవితానికి నాంది పలికేది ఈ ప్రేమ ........ ! కులాలకు అతీతమైనది , మతాలకు అతీతమైనది , రూపురేఖలకు అతీతమైనది, ఈ ప్రేమ .................! చీకటిలో వెన్నెలలాగా , బాధలో ఓదార్పులాగా , ఒక్కసారి ఎదను చేరితే శాశ్వతంగా నిలిచిపోయేది ఈ ప్రేమ ................. ! ................... నిహారిక (17-02-14)

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1guWXZf

Posted by Katta

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Niharika Laxmi కవిత

హృదయ వీణ (కవితలు ) వీణ ఎన్నో స్వరాలను పలికించగలదు.హృదయవీణ ఎన్నో భావాలను పలికించగలదు. మనసులోని భావాలకు అక్షరరూపమే కవిత. సమాజంలో జరుగుతున్న పరిణామాలకి ,జీవితంలో ఎదురయ్యే విషయాలకి ,ప్రకృతిని ఆస్వాదిస్తునప్పుడు ఇలా ఎన్నో సందర్భాలలో హృదయం స్పందిస్తుంది . అలా ఎద స్పందించిన భావాలకి అక్షరరూపం ఇచ్చి కవితగా మలచిన వాటిలో కొన్ని కవితలని ఈ పుస్తకంలో ప్రచురించటం జరిగింది .నా ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో విషయాలని నేర్చుకుంటూ సాగుతున్న తరుణంలో రాసిన ఈ కవితలని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను . తప్పులు దొర్లితే మన్నించి హృదయ వీణ శృతులను సవరించండి .. ................. పుస్తకం :హృదయ వీణ (కవితలు) రాసినది :బుడగం.లక్ష్మి నిహారిక(18 years) .మెకానికల్ ఇంజనీరింగ్ (2nd year) పేజీలు :36 Published by: SPHOORTHI PUBLICATIONS No. 8, Sury Satya Appartments, Fortune Murali Hotel Lane, Mogalrajpuram, Vijayawada - 520 010 Ph: 0866-6666677 PRICE : 20/-

by Niharika Laxmi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0NlF1

Posted by Katta